ఉత్తర అమెరికాలోని ప్రవాస తెలుగువారికి, భారతీయులకు ఆపద సమయాల్లో ప్రథమ చేయూతను అందించే తానా టీంస్క్వేర్ విభాగ అధ్యక్షుడిగా ప్రకాశం జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రుడు కొల్లా అశోక్‌బాబు నియమితులయ్యారు. ఆయన ఎన్నిక పట్ల తానా కార్యవర్గం హర్షం వెలిబుచ్చింది. ఒక్క 2018లోనే సుమారు 170కు పైగా ప్రమాదాలు, దుర్ఘటనల్లో చిక్కుకున్న బాధితులకు ఈ విభాగం సాయం అందించింది. తన నేతృత్వంలో ఈ విభాగాన్ని మరింత పటిష్ఠవంతం చేస్తానని అశోక్ తెలిపారు.
తానా టీంస్క్వేర్ అధ్యక్షుడిగా కొల్లా అశోక్‌బాబు
Related tags :