Business

కొత్తగూడెం విమానాశ్రయానికి స్థలం అనుమతులు మంజూరు

Kothagudem Airport Gets Site Clearance - కొత్తగూడెం విమానాశ్రయానికి స్థలం అనుమతులు మంజూరు

ఖ‌మ్మం జిల్లా కొత్త గూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు కోసం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) లిమిటెడ్ కు కేంద్ర పౌర విమాన‌యాన శాఖ సైట్ క్లియ‌రెన్స్ అనుమ‌తులు ఇచ్చింద‌ని ఆ శాఖ మంత్రి హ‌ర్ దీప్ సింగ్ పురి లిఖిత‌పూర్వకంగా స‌మాధానం ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా పౌర విమానయాన రంగంలో భారీ డిమాండ్ ను తీర్చడానికి, పౌర విమాన‌యాన మంత్రిత్వ శాఖ తొలి ద‌శ సైట్ క్లియరెన్స్ ఇచ్చింద‌ని ఆయ‌న తెలిపారు. రెండో దశ అనుమ‌తి ఇంకా ఆమోదం పొందాల్సి ఉందన్నారు. రెండో అనుమ‌తి అనేది డిపిఆర్ తయారీ, ఆర్థిక అంశాల‌పై ముడిప‌డి ఉంటుందన్నారు. తెలంగాణలో విమాన‌యాన రంగం అభివృద్ధి డిమాండ్ పై పెద్దపల్లి ఎంపీ వెంక‌టేశ్ నేత అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు జవాబిచ్చారు.