Videos

బ్లడ్ పడింది

Malaika Arora Shares Her Chaiyya Chaiyya Shoot Experience - బ్లడ్ పడింది

‘ఛయ్యా ఛయ్యా’ పాటతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు నటి మలైకా అరోరా. ఈ ఒక్క పాటతో ఆమె కెరీర్‌ దూసుకెళ్లిపోయింది. అయితే ఈ పాటను చిత్రీకరిస్తున్న సమయంలో ఆమె చాలా తీవ్రంగా గాయపడ్డారట. ఈ విషయాన్ని ఓ రియాల్టీ షోలో వెల్లడించారు. ‘పాట మొత్తం రైలు పైనే చిత్రీకరించారు. చాలా సార్లు పట్టుతప్పి పడిపోయాను. దాంతో నేను పడిపోకుండా ఉండటానికి నా నడుముకి తాడు కట్టారు. ఆ తాడు కట్టుకునే డ్యాన్స్‌ చేశాను. పాట షూట్‌ అయిపోయాక తాడు విప్పుతుంటే నడుమంతా రక్తమోడుతోంది. రాసుకుపోయింది. దాంతో సెట్లో వారంతా కంగారుపడిపోయారు’ అని తెలిపారు. ఈ పాటను ఏ.ఆర్‌ రెహమాన్‌ కంపోజ్‌ చేశారు. ఇప్పటికీ పాటకున్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఫరా ఖాన్‌ డ్యాన్స్‌ కంపోజ్‌ చేశారు. అప్పట్లో రైలుపై డ్యాన్స్‌ చేయడం ప్రేక్షకులను ఎంతో థ్రిల్‌కు గురిచేసింది. అందుకే బెస్ట్‌ కొరియోగ్రఫీ కేటగిరీలో ఫరా ఖాన్‌కు ఫిలింఫేర్‌ అవార్డు లభించింది.
https://www.youtube.com/watch?v=PQmrmVs10X8