ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) బ్యాక్‌ప్యాక్ కమిటీ ఛైర్మన్‌గా గోదావరి జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రుడు మన్నే సత్యనారాయణ ఎంపికయ్యారు. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో నివసిస్తున్న ఆయన స్థానిక తెలుగు సంఘం GWTCSకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల వాషింగ్టన్ డీసీలో జరిగిన 22వ తానా మహాసభలకు GWTCS ఆతిథ్య సహకారం అందించి వేడుకల విజయవంతంలో కీలక భూమిక పోషించింది. సత్యనారాయణ ఎన్నిక పట్ల తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, కార్యదర్శి పొట్లూరి రవి, మాజీ అధ్యక్షుడు వేమన సతీష్, తదుపరి అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరిలు హర్షం వెలిబుచ్చారు. అమెరికాతో పాటు భారతదేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే పేద విద్యార్థులకు ఈ కమిటీ ఉచితంగా పాఠ్యాంశ సామాగ్రిని అందజేస్తుంది. ఈ సేవా కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేస్తానని మన్నే తెలిపారు.
తానా బ్యాక్‌ప్యాక్ కమిటీ ఛైర్మన్‌గా మన్నే సత్యనారాయణ
Related tags :