మళ్లీ అదే ప్రత్యర్ధి చేతుల్లో… జపాన్ ఓపెన్‌లోనూ పీవీ సింధు ఓటమి….ఇండోనేషియా ఓపెన్ టైటిల్ ఫైనల్ ఓటమిని మరచిపోకముందే భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు మరోసారి అదే ప్రత్యర్ధి చేతుల్లో ఓటమి పాలయ్యారు. జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్-750 టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో జపాన్ క్రీడాకారిణి యామగుచి చేతిలో ఓటమిపాలయ్యారు. తొలి గేమ్ ప్రారంభంలో సింధు ఆధిక్యంలో నిలిచినప్పటికీ.. రాను రాను ఒత్తిడికి గురికావడంతో సింధు వరుసగా పాయింట్లు కోల్పోయింది. దీంతో 18-21, 15-21 తేడాతో ఓటమిపాలైంది. మరోవైపు పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో మరో తెలుగుతేజం సాయిప్రణీత్ అదరగొట్టాడు. ఇండినేషియా ఆటగాడు టామి సుగియార్తోపై 21-22, 21-15 తేడాతో సునాయాసంగా విజయం సాధించి సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాడు.
సింధు మళ్లీ ఓడిపోయింది
Related tags :