Movies

పాతికేళ్ల తర్వాత పోలీసు

Rajinis Durbar New Stills Released - పాతికేళ్ల తర్వాత పోలీసు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘దర్బార్’. ఏ.ఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో రెండు స్టిల్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఒకటి పోలీస్‌ డ్రెస్‌లో స్టైల్‌గా నడుచుకుంటూ వస్తుండగా, మరో స్టిల్‌లో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ సినిమాను నిర్మిస్తోంది. తలైవాకు జోడీగా నయనతార నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో చిత్రమిది కావడం విశేషం. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. దాదాపు పాతికేళ్ల తర్వాత రజనీ వెండితెరపై పోలీసు అధికారి గెటప్‌లో దర్శనమివ్వబోతున్నారు. దాంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.