ఏ వస్తువు అయినా కొన్ని రోజులు వాడాక పాతగా అనిపిస్తుంది. వాటిని వాడాలంటే చాలామందికి మనసొప్పదు. అలాంటి వాటిల్లో చెప్పులు ముందుంటాయి. మరి వాటిని ఎలా అందంగా మార్చుకోవచ్చో చూద్దామా?
* రంగు మారిన తెల్లని కాన్వాస్ షూలని తీసుకుని శుభ్రం చేయాలి. ఇప్పుడు ముందు భాగంలో చక్కని ప్రేమ గుర్తుని పెన్సిల్‌తో వేసుకుని దానిపై గ్లూ రాయాలి. అది ఆరకముందే ఎర్రటి చమ్కీలను దానిపై చల్లాలి. అందమైన హృదయాకారం కనువిందు చేస్తుంది. మిగిలిన షూ అంతా మరో రంగు చమ్కీలను అలానే అతికిస్తే చాలు.
* ఒక్కోసారి చెప్పు బాగానే ఉన్నా దాని పట్టి తెగిపోతుంది. ఇలాంటప్పుడు మీరే సొంతంగా మీకు నచ్చేపట్టీని తయారు చేసుకోవచ్చు. ముత్యాల్లాంటి తెల్లటి పూసలతోనూ తయారు చేసుకోవచ్చు. సాధారణ పట్టీ స్థానంలో దీన్ని ఎక్కించి ముడివేస్తే సరి.
* మీ పాత చెప్పులకు నచ్చిన రంగుని వేయొచ్చు. చమ్కీలు, బీడ్స్ వంటివాటిని అంటించి అందంగా మార్చేయొచ్చు. ప్రయత్నిస్తే మరెన్నో ఆలోచనలు తడతాయి.