Politics

మరో మధ్యంతరం తథ్యం

మరో మధ్యంతరం తథ్యం - Siddharamayya Predicts BJP New Government Will See Another Intermittent Drop

కర్ణాటక అసెంబ్లీ బీజేపీకి ప్రయోగాలు చేసేందుకు ల్యాబ్ గా మారిందని మాజీ ముఖ్యమంత్రి కర్ణాటకలో కాంగ్రెస్ పక్ష నేత సిద్దరామయ్య విమర్శించారు. శుక్రవారం నాడు ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం బీజేపీకి లేదని సిద్దరామయ్య అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ విలువలపై బీజేపీకి నమ్మకం లేదని ఆయన విమర్శించారు.