సుఖవంతమైన, సంతోషకరమైన జీవితానికి గౌతమ బుద్ధుడు చెప్పిన 25 సూత్రాలు. సుమారుగా 2500 ఏళ్ల కిందట గౌతమ బుద్ధుడు మానవ జాతి మనుగడకు, సరైన జీవన విధానానికి కొన్ని సూచనలు చేశాడు. కొన్ని నియమాలను పాటించాలని చెప్పాడు. బౌద్ధ మతాన్ని స్థాపించి అనేక సూత్రాలను ప్రజలకు చెప్పాడు. అయితే ప్రస్తుత ఆధునిక యుగంలో గౌతమ బుద్ధుని సూత్రాలను ఎవరూ ఆచరించడం లేదు. కానీ వాటిని మన నిత్య జీవితంలోకి అన్వయించుకుని వాటిని పాటిస్తూ.. సుఖవంతమైన, సంతోషకరమైన జీవనాన్ని గడపవచ్చు. మరి మన జీవనం కోసం గౌతమ బుద్ధుడు చెప్పిన ఆ సూత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. మితిమీరిన కోపం పనికిరాదు. కోపం నిన్ను శత్రువును చేసి నిన్ను నాశనం చేస్తుంది. నీ పతనానికి నీ కోపమే కారణమవుతుంది. కనుక కోపం పనికిరాదు. శాంతంగా ఉండాలి.
2. జీవిత ప్రయాణం సాఫీగా సాగుతుందనుకున్నప్పుడు నువ్వు స్వతహాగా ఆకాశం కేసి చూసి నవ్వుకుంటావు.
3. ప్రపంచంలోని మనుషులందరిలాగే నువ్వు కూడా ఇతరుల నుంచి ప్రేమ, అనురాగం పొందేందుకు అర్హుడివి.
4. నిజం ఎన్నటికీ దాగదు. సూర్య, చంద్రులు ప్రకాశించకుండా ఉండలేరు.
5. మనస్సులో ఎలాంటి కకావికలమైన ఆలోచనలు లేకుండా నిర్మలంగా ఉన్నవారే శాంతమూర్తులు అవుతారు.
6. తప్పు చేసిన వారిని క్షమించండి. వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
7. ఎవరి జీవితంలో అయినా అతి పెద్ద ఓటమి అంటే.. నిన్ను నమ్మిన వారికి నిజం చెప్పకపోవడమే.
8. ఎలాంటి దారి లేనిచోట నువ్వు నడిచే తోవనే దారి అవుతుంది
9. మంచి మాటలు ఎన్ని చెప్పినా, ఎన్ని చదివినా.. వాటిని ఆచరణలో పెట్టకపోతే ప్రయోజనం ఏమీ ఉండదు.
10. శత్రువులను చూస్తే చక్కగా మొరిగే కుక్కనే మంచి కుక్క అవుతుంది. అలాగే ఒక మనిషి మంచిగా మాట్లాడితేనే మంచి మనిషి అవుతాడు.
11. మనస్సుంటే మార్గముంటుంది.
12. సమాజంలో పేదలు, ధనికులు ఉంటారు. అందరినీ సమానంగా చూడు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అన్న భావం మనస్సులోకి రాకుండా చూసుకోవాలి.
13. మంచి మాటతీరు, జాలి గుణం, సేవా తత్పరత అనేవి మానవత్వానికి ప్రతీకలు.
14. ఎట్టి పరిస్థితిలోనూ భయపడకూడదు. నీలో ఉండే భయాన్నిఎప్పుడూ పారద్రోలాలి. నువ్వు ఇతరులపై ఆధారపడకూడదు. నువ్వు చక్కగా ఉంటే ఇతరుల నుంచి సహాయం అర్థించకూడదు. అదే నీ స్వేచ్ఛకు చిహ్నం.
15. ఎలాంటి పరిస్థితి ఎదురైనా.. మనకు వచ్చే కష్టాన్ని, సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని వేచి చూడకూడదు.
16. ఏ పని చేసినా అంకిత భావంతో, మనస్సులో ఎలాంటి చెడు భావాలు లేకుండా చేయాలి
17. సమస్యలను నీకై నువ్వు పరిష్కరించుకో. ఇతరులపై ఆధార పడకు.
18. మనం ఏదైతే ఆలోచిస్తామో.. అదే ఆచరణలో చేస్తాం. కనుక ఆలోచనలు సక్రమంగా ఉండాలి. సక్రమమైన పనులు చేస్తాం.
19. నిన్ను నవ్వు జయించు. ఆ తరువాత ఇతరులను జయించడం సాధ్యమవుతుంది.
20. గొడవలు సృష్టించే 1000 పదాల కన్నా శాంతిని తెచ్చే ఒకే ఒక్క పదం మాట్లాడడం ఉత్తమం.
21. ఇతరులను ప్రేమించలేని వారు వారి కష్టాలను, సమస్యలను పరిష్కరించలేరు.
22. మానసికంగా దృఢంగా ఉంటేనే శారీరకంగా ఆరోగ్యం బాగుంటుంది.
23. మనిషి తనకు వచ్చే రోగాలకు తానే బాధ్యత వహించాలి.
24. ఒక కొవ్వొత్తితో 1000 కొవ్వుత్తులను వెలిగించవచ్చు. అలాగే సంతోషాన్ని ఎంత మందికి పంచినా తరగదు.
25. గతం గురించి ఆలోచిస్తూ విచారించకు. భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందకు. వర్తమానంలో జీవించు.