Devotional

గ్వాలియర్ అత్తా-కోడళ్ల ఆలయాలు

The sas bahu temple of gwalior has a crazy story behind it - గ్వాలియర్ అత్తా-కోడళ్ల ఆలయాలు

అత్తా కోడళ్లకు కూడా ఓ వింత ఆలయం ఉంది. ప్రత్యేకంగా వారి కోసం ఆలయాన్నే నిర్మించారు. అసలు ఆ గుడిని ఎందుకు కట్టారో? ఎక్కడ ఉందో తెలుసా? ఓ రాజు ఇంటిపోరే అద్భుతమైన మందిరాన్ని నిర్మించేలా చేసింది. ఆ దేవాలయ ప్రదేశమే ఇప్పుడు ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రంగానూ మారింది. ఇది మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉన్నది. పూర్వం గ్వాలియర్ ప్రాంతాన్ని పాలించిన మహిపాలుడు అనే రాజుకు భార్య, కుమారుడున్నారు. ఆయన భార్య వైష్ణవ భక్తురాలు. ప్రతి రోజూ విష్ణువుకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసేది. అందుకోసం రాజు ప్రత్యేకంగా వెయ్యి చేతులున్న మహావిష్ణువు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని కట్టించాడు. కొన్నాళ్లకు రాజు కుమారుడికి వివాహం జరిగింది. రాజు కోడలు శివ భక్తురాలు. విష్ణువు విగ్రహాన్ని తీసేసి, దాని స్థానంలో శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోడలు పట్టుబట్టింది. దీంతో విష్ణుమూర్తి ఆలయం పక్కనే శివుని గుడిని నిర్మించారు. అత్తా కోడళ్ల పంతంతో నిర్మించిన శివ, విష్ణు దేవాలయాలు అత్త-కోడళ్ల ఆలయాలుగా మారిపోయాయి