అమెరికా వెళుతూ.. దుబాయ్ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ హీరో శివాజీ. అలందా మీడియా కేసులో సినీనటుడు శివాజీ మరోసారి పోలీసులకు పట్టుబడ్డాడు. టీవీ9 వాటాల కొనుగోలు వ్యవహారంలో పోలీసు విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలో ఉండటంతో ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత నెలలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికా వెళుతూ శివాజీ పోలీసులకు పట్టుబడ్డాడు. తాజాగా దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లేందుకు ఆయన మరోసారి ప్రయత్నించడంతో అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు శివాజీని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Flash…దుబాయిలో పట్టుబడ్డ సినీనటుడు శివాజీ
Related tags :