Movies

రాణిగా మరోసారి

రాణిగా మరోసారి - Aiswarya Rai To Star As Rani Nandini In A Negative Shade

ఎందరో తమిళ దర్శకులు ‘పొన్నియిన్ సెల్వన్’ నవలను స్క్రీన్ మీద చూపించాలని అనుకున్నారు. కానీ మణిరత్నం ఫైనల్గా ఆ ప్రాజెక్ట్ను పట్టాలెక్కిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, కీర్తీ సురేశ్, అమలాపాల్ నటించనున్నారని సమాచారం. మోహన్బాబుని కూడా ఓ కీలక పాత్రకు మణిరత్నం సంప్రదించారు. ఇక ఈ సినిమాలో చేస్తున్నాను అని ఐష్ స్పష్టం చేశారు. అయితే తన పాత్ర ఎలా ఉండబోతోందో మాత్రం ఆమె బయటపెట్టలేదు.ఈ సినిమాలో ఐష్ నెగటివ్ షేడ్స్లో కనిపిస్తారని సమాచారం. చోళరాజ్యానికి చెందిన కోశాధికారి పెరియ పళువెట్టారియార్ భార్య నందిని పాత్రలో కనిపిస్తారట ఐష్. అధికార దాహంతో చోళ రాజ్యం కుప్పకూలిపోవడానికి భర్తను తప్పు దోవలో నడిపించారట నందిని. మరి నందినీగా ఐష్ నటిస్తే ఆమె భర్తగా నటించేది ఎవరు? అంటే.. ఆ పాత్రను మోహన్బాబు చేయనున్నారట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.