Politics

కోడెల కుమార్తె పిటీషన్ కొట్టేసిన హైకోర్టు

Andhra High Court Rejects Kodela Daughters Petition

టీడీపీ సీనియర్‌ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమార్తెకు హైకోర్టులో చుక్కెదురు అయింది. ముందస్తు బెయిల్‌ కోసం కోడెల కుమార్తె విజయలక్ష్మి దాఖలు చేసిన నాలుగు పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. గుంటూరు జిల్లా నరసరావుపేట టౌన్‌, రూరల్‌ పోలీస్‌ స్టేషన్లలో నమోదైన నాలుగు కేసులు అక్రమమంటూ, వాటిని కొట్టేయాలంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి డీవీవీ సోమయాజులు ముందస్తు బెయిల్‌ అభ్యర్థనను తోసిపుచ్చారు. కాగా కే ట్యాక్స్‌ పేరుతో కోడెల కుమారుడు, కుమార్తె భూ దందాలు, సెటిల్‌మెంట్లు, బెదిరింపులు, కే ట్యాక్స్‌ వసూలు వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.