చూడ్డానికి చిన్నగా కనిపిస్తున్నా చిచ్చరపిడుగీ చిన్నారి. ఆరేళ్ల వయసులోనే సుమారు ₹55.12 కోట్ల విలువైన (80 లక్షల డాలర్లు, 950 కోట్ల కొరియన్ వొన్లు) ఐదంతస్తుల ఇల్లు కొనేసింది. ఉండేది దక్షిణ కొరియాలోని సియోల్లో. పేరు బోరమ్. అంత చిన్న వయసులోనే యూట్యూబ్లో వీడియోలు చేస్తూ స్టార్ అయిపోయిందీ చిన్నారి. 3 కోట్ల మందికిపైగా సబ్ స్రై స్క్రైబర్లున్నారామెకు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో యూట్యూబ్లో రెండు చానెళ్లను నడిపిస్తోంది బోరం. ఒక చానెల్ ద్వారా బొమ్మల రివ్యూలు ఇస్తుంటుంది. ఆ చానెల్ను 1.36 కోట్ల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. రెండో చానెల్లో రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. ఆ చానెల్కు దాదాపు 1.76 కోట్ల మంది సబ్స్క్రైబ్ అయ్యారు. ఆ ఫాలోయింగ్తోనే ఆ చిన్నారి డబ్బులు బాగా సంపాదిస్తోంది మరి. ఈ ఏడాది ప్రారంభంలోనే సియోల్లోని గంగ్నమ్ అనే పోష్ సబర్బన్ ప్రాంతంలో ఇల్లు కొన్నది. అయితే, అంత మంది ఫాలోవర్లను సంపాదించుకున్నా, వివాదాలూ ఆమెను చుట్టుముట్టాయి. దేశ విలువలను అవమానించేలా ఆ చిన్నారి చేస్తున్న వీడియోలున్నాయంటూ కొందరు జనం, స్వచ్ఛంద సంస్థ సేవ్ ద చిల్డ్రెన్కు ఫిర్యాదు కూడా చేశారు. ఆ చిన్నారి చేస్తున్న వీడియోల వల్ల పిల్లల మనసు, నైతిక విలువలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తండ్రి పర్సు నుంచి డబ్బులు కొట్టేయడం, రోడ్లపై కారు నడపడం వంటి వీడియోలను ఆ చిన్నారి పోస్ట్ చేస్తోందన్న ఫిర్యాదులొచ్చినట్టు సేవ్ ద చిల్డ్రెన్ అడ్వొకసీ డిపార్ట్మెంట్ మేనేజర్ కో వూయూన్ చెప్పారు. ఆ వీడియోలను పోలీసులకూ చూపించినట్టు సేవ్ ద చిల్డ్రెన్ చెప్పింది. దీంతో పిల్లల వేధింపుల నివారణకు రూపొందించిన కౌన్సిలింగ్ కోర్సును డిజైన్ చేయాల్సిందిగా బోరమ్ తల్లిదండ్రులకు సియోల్ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. అలాంటి వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగించేశారు
ఈ అమ్మయి కొనుక్కున్న ఇల్లు విలువ ₹55కోట్లు
Related tags :