బ్రిటన్ కొత్త ప్రధాని బోరిస్ జాన్సన్ మంత్రి మండలిలో భారత సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులకు కీలక పదవులు లభించాయి. బ్రెగ్జిట్పై తన విధానాలను దృఢంగా సమర్థించే ప్రీతీ పటేల్, అలోక్శర్మ, రిషి సునాక్లను జాన్సన్ మంత్రి మండలిలో చేర్చుకున్నారు. ప్రీతీ పటేల్కు హోంమంత్రిత్వశాఖ, అలోక్శర్మకు అంతర్జాతీయ అభివృద్ధి విభాగ(డీఎఫ్ఐడీ) మంత్రిత్వశాఖను అప్పగించారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్కు ఆర్థికశాఖ సహాయమంత్రి పదవి దక్కింది.
*న్యాయబద్ధ వలసవిధానం: ప్రీతిపటేల్
బ్రిటన్ హోంమంత్రిగా ప్రీతిపటేల్ (47) ఆ దేశ అంతర్గత భద్రత, వలస, వీసా విధానాలను పర్యవేక్షిస్తారు. ఐరోపా నుంచి బయటకు వచ్చాక తమ దేశ వలస విధానం న్యాయబద్ధంగా ఉంటుందని, ప్రపంచంలో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
*సవాళ్లను అధిగమిస్తాం: అలోక్శర్మ
బ్రెగ్జిట్ను సమర్థించే అలోక్ శర్మ(51) మాజీ ప్రధాని థెరిసా మే మంత్రివర్గంలో ఉపాధిశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. జాన్సన్ మంత్రి వర్గంలో కేబినెట్ హోదాతో పాటు అంతర్జాతీయంగానూ ప్రాధాన్యం గల డీఎఫ్ఐడీని దక్కించుకున్నారు. అంతర్జాతీయ సవాళ్లైన వాతావరణ మార్పులు, విపత్తులు, వ్యాధుల నిర్మూలనలో కీలకపాత్ర పోషిస్తామని పేర్కొన్నారు.
*స్వేచ్ఛావాణిజ్యానికి ప్రాధాన్యం: రిషి సునాక్
ప్రీతీ పటేల్ మాదిరిగా న్యాయబద్ధమైన వీసా విధానానికి రిషి సునాక్(39) అనుకూలురు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. బ్రిటన్లోని చిన్న వ్యాపార సంస్థలు బ్రెగ్జిట్ అనంతరం బాగా అభివృద్ధి చెందుతాయని, స్వేచ్ఛావాణిజ్యం, వినూత్న ఆవిష్కరణలు ఇందుకు దోహదపడతాయని రిషి ఆశాభావం వ్యక్తం చేశారు.
బ్రిటన్ క్యాబినెట్‌లో ముగ్గురు భారతీయులు
Related tags :