Fashion

వర్షంలో జుట్టు ఆరోగ్యానికి ఫ్యాషన్ చిట్కాలు

Fashion tips to protect your hair in rainy season - వర్షంలో జుట్టు ఆరోగ్యానికి ఫ్యాషన్ చిట్కాలు

తరచూ వర్షంలో తడిసేవారు జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. వర్షాకాలంలో తేమ స్థాయి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కుదుళ్లు బలహీనపడి జుట్టు రాలిపోతుంది.తలస్నానం చేసేటప్పుడు యాంటీబ్యాక్టీరియల్ షాంపూలు, క్లీనర్లు వాడాలి. ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి ఇవి ఎంతగానో ఉపకరిస్తాయి. వర్షపు నీటిలో దుమ్ము ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆమ్లసహితం కూడా. దీని నుంచి రక్షణ పొందాలంటే లీవ్ ప్రాడక్టులు వాడాలి. ఇవి జుట్టుపై రక్షణాత్మక పొరను ఏర్పరుస్తాయి.-జుట్టు తడిగా ఉన్నప్పుడు జడ లేదా ముడి వేసుకోవద్దు. దీనివల్ల జుట్టు పాడవడమే కాకుండా దుర్వాసన కూడా వస్తుంది. ఒకవేళ మీ జుట్టు తడిస్తే, టవల్తో రుద్దిరుద్ది తుడవకండి ఇలా చేయడం వల్ల జుట్టు రాలిపోతుంది. దీనికి బదులు జుట్టుకు టవల్ను చుట్టిపెడితే మంచిది.-జుట్టు రాలిపోవడానికి తడి జుట్టు కూడా కారణం. అందుకే జుట్టు పూర్తిగా ఆరిపోయే వరకూ దువ్వెన వాడొద్దు. చాలా మంది చిక్కుతియ్యడానికి ఏ దువ్వెన పడితే అది వాడుతుంటారు. అలా కాకుండా పెద్ద పళ్లు ఉన్న దువ్వెన ఉపయోగిస్తే మంచిది.-జుట్టు రాలే సమస్య నుంచి తప్పించుకోవడానికి మంచి ఆహారం తీసుకోవాలి. విటమిన్ సి, విటమిన్ బి ఎక్కువగా ఉండే ఆహారం, పండ్లు తీసుకుంటే జుట్టుకు మంచిది. వర్షాకాలంలో దప్పిక వేయకపోయినా నీళ్లు తాగుతూ ఉండాలి. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. జుట్టు పెరగడానికి కూడా కారణమవుతుంది.