1. శ్రీవారి భక్తులకు శుభవార్త – ఆద్యాత్మిక వార్తలు – 07/27
తిరుమల శ్రీవారి భక్తులకు ఇది నిజంగానే శుభార్త. ఇప్పటి వారకు స్వామి వారిని దర్శించుకోవాలంటే.. గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు అలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
దివ్య, సర్వదర్శన స్లాటెడ్ టోకెన్ల భక్తుల సౌకర్యార్థం నారాయణగిరి ఉద్యానవనంలో రూ.25 కోట్ల వ్యయంతో టీటీడీ చేపట్టిన అధునాతన కాంప్లెక్స్‌ల నిర్మాణం రెండు నెలల్లో పూర్తికానుంది. సెప్టెంబరు నెలాఖరులో ప్రారంభమయ్యే వార్షిక బ్రహ్మోత్సవాల సమయానికి వీటిని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు టీటీడీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.స్లాటెడ్ టోకెన్లు పొందిన భక్తులు తమకు కేటాయించిన స్లాట్‌తో నిమిత్తం లేకుండా కాస్త ముందుగా శ్రీవారి దర్శనం ముగించుకోవాలనే ఆలోచనతో నారాయణగిరి ఉద్యానవనాల వద్ద ముందుగా గుమికూడుతున్నారు. ఇలాంటి వారిని క్యూలైన్ ప్రవేశం వద్ద సిబ్బంది అడ్డుకుని టోకెన్‌పై ఉన్న సమయానికి గంట ముందుగా రావాలని తిప్పి పంపాల్సి వస్తోంది.
అయినా భక్తులు తిరిగివెళ్లక గంటలకొద్ది రోడ్లపై, చెట్లకింద గడుపుతూ నానా అవస్థలు పడుతున్నారు. ఒక్కో రోజు ఆ ప్రాంతంలో రద్దీ పెరిగి తోపులాటలు చోటుచేసుకుంటున్నాయి. ఆ సమస్యకు పరిష్కారంగా ఈ భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ భవనాలు పూర్తైతే.. క్యూలైన్ లలో నిలబడే బదులు ఆ గదుల్లో విశ్రాంతి తీసుకొని తర్వాత స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది.
2. శాశ్వత ప్రాతిపదికన మేడారం జాతర ఏర్పాట్లు
మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఏర్పాట్లన్నీ శాశ్వత ప్రాతిపదికన ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే మేడారం మహాజాతరకు ఏర్పాట్లు శాశ్వత ప్రాతిపదికన ఉండేలా చూడాలన్నారు. గురువారం ములుగు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఏటూరునాగారం ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణితో హన్మకొండలోని తన నివాసంలో ఆయన సమావేశమయ్యారు. గత జాతర గణాంకాలను పరిశీలిస్తే ఈసారి భక్తుల సంఖ్య కోటికి పైగా వచ్చే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని సూచించారు. వన జాతర ఏర్పాట్లలో అటవీ సంరక్షణ కూడా ముఖ్యమేనని, అందుకోసం అడవులకు నష్టం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.తాగునీరు, పారిశుద్ధ్యంతో పాటు మహిళా భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. మేడారం, చుట్టుపక్కల గ్రామాల శాశ్వత అవసరాలను పరిగణనలోకి తీసుకుని తుది ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. జనవరి ఒకటిలోపు పనులన్నీ పూర్తి కావాలన్నారు. జాతర ఏర్పాట్లలో భాగస్వాములయ్యే అధికారులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేద్దామని చెప్పారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ జాతరను విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.
3. ఆగస్టులో శ్రీవారికి రెండుసార్లు గరుడవాహన సేవ
తిరుమల శ్రీవారికి ఆగస్టులో రెండుసార్లు గరుడవాహన సేవ జరగనుంది. ఆగస్టు 5న గరుడ పంచమి, 15న శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా ఆయా రోజుల్లో రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీనివాసుడు గరుడవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు.
4. వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పవిత్రోత్సవాలు
శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మమణ్యేశ్వరస్వామి పవిత్రోత్సవాలు రెండో రోజు వైభవంగా నిర్వహించారు. గురువారం ఉదయం గోపూజతో కార్యక్రమాలను ప్రారంభించారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మూల మంత్ర అనుప్టానములతో పవిత్రములకు పూజలు చేశారు. హోమ క్రతువులు నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగపురం నుంచి తీసుకువచ్చిన మూడు రకాల పట్టు పవిత్రాలతో విశేష పూజలు చేశారు. ఆలయ ఈవో లీలాకుమార్, పర్యవేక్షకుడు మధుసూదనరావు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
5. 29న నమో వేంకటేశాయ రథయాత్ర
కలియుగదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి కోట్ల జపంలో భాగంగా సప్త దశ (17) పర్యాయంగా నమో వేంకటే శాయ రథయాత్ర కార్యక్రమం హబ్సి గూడ లోని కాక తీయనగర్ నుంచి ఈ నెల 29వ తేదీన ప్రారంభమవుతుందని శ్రీ వెంకటేశ్వర మహామంత్ర పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు పుల్లగూర్ల సాయిరెడ్డి గురువారం ఒక ప్రక టనలో తెలిపారు.శ్రీవారికి ఈ ఏడాది సమర్పించబోయే 7 కోట్ల జపంలో వీలైనంత ఎక్కువ మంది భక్తులను భాగస్వాములుగా చేయా లనే సంకల్పంతో రథయాత్రకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఉభయ తెలుగు రాష్ర్టాలలోని వివిధ ప్రాంతాలలో తిరిగి ఆగస్టు 22న తిరుపతికి చేరు కుంటుందని, 23న గోకులాష్టమి రోజున ఎస్వీ డైరీ ఫాంలో జపహోమా దులు నిర్వహించి దివ్య మహామంత్ర స్థూపంలో స్వామివారికి సమర్పించ బడుతుందని వివరించారు. ఆసక్తి గల వారు ఈ యాత్రలో పాల్గొన్న వచ్చని వివరాల కోసం 9348212354 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.
6. తిరుమల శ్రీవారికి రూ.2.40 కోట్ల విరాళం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఓ అజ్ఞాత భక్తుడు శుక్రవారం రూ.2.40 కోట్ల విరాళం సమర్పించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వై.వి.సుబ్బారెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. తితిదేకు చెందిన వివిధ ట్రస్టుల కింద ఈ మొత్తాన్ని జమ చేయాలని దాత సూచించారు. భగవంతునికి విరాళం ఇచ్చినందున తన పేరు వెల్లడించడానికి ఇష్టంలేదని, బహిర్గతం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
7. వీఐపీ బ్రేక్ దర్శన విధానాన్ని తీసుకొస్తాం
తిరుమలలో వీఐపీ దర్శనాలను ఎల్1, ఎల్2, ఎల్3లుగా వర్గీకరించడాన్ని ఉపసంహరించుకుంటూ తితిదే పాలనాపరమైన నిర్ణయం తీసుకుందని, పాత పద్ధతిలో ఉన్న వీఐపీ బ్రేక్ దర్శన విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించిందని తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేశారు. తితిదేకు చెందిన కొత్త పాలకమండలి(బోర్డు) ఏర్పడ్డాక ఈ నిర్ణయాల్ని బోర్డు ముందు ఉంచుతామన్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో సాధారణ భక్తుల ప్రాథమిక హక్కుల్ని హరిస్తున్నట్లు పిటిషనర్ చేస్తోన్న వాదన సరికాదన్నారు. సాధారణ భక్తుల పట్ల ఎలాంటి వివక్ష చూపడం లేదన్నారు. ఈ నేపథ్యంలో పిల్‌ను కొట్టివేయాలని అభ్యర్థించారు. శుక్రవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం.. తీర్పును వాయిదా(రిజర్వు) వేసింది. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలువరించాలని అభ్యర్థిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన జాగర్లమూడి వెంకటసుబ్బారావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.
8. శుభమస్తు
తేది : 27, జూలై 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శనివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : దశమి
(నిన్న రాత్రి 7 గం॥ 52 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 7 గం॥ 40 ని॥ వరకు)
నక్షత్రం : కృత్తిక
(నిన్న రాత్రి 6 గం॥ 53 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 7 గం॥ 25 ని॥ వరకు)
యోగము : గండము
కరణం : వణిజ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 7 గం॥ 9 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 47 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 57 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 35 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 7 గం॥ 36 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 27 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 7 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 44 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 53 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 30 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 59 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 36 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 53 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 51 ని॥ లకు
సూర్యరాశి : కర్కాటకము
చంద్రరాశి : వృషభము
9. చరిత్రలో ఈ రోజు/జూలై 27* *సలీం అలీ*
1955 : ఆస్ట్రేలియా కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు అలాన్ బోర్డర్ జననం.
1967 : భారతదేశ నటుడు, రచయిత, దర్శకుడు, సామాజిక కార్యకర్త మరియు రగ్బీ యూనియన్ ఆటగాడు రాహుల్ బోస్ జననం.
1970 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు, కేరళ ముఖ్యమంత్రి గా పనిచేసిన పీ.ఏ.థాను పిల్లై మరణం (జ.1885).
1987 : విఖ్యాత పక్షిశాస్త్రవేత్త, పద్మవిభూషణుడు, రాజ్యసభ సభ్యుడు సలీం అలీ మరణం (జ.1896).
2002 : భారత ఉప రాష్ట్రపతి గాను, ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గానూ పనిచేసిన కృష్ణకాంత్ మరణం (జ.1927).
2003 : ప్రపంచ ప్రసిద్ధి చెందిన హాస్యజీవి, రేడియో, టీవీ, సినిమా, రంగస్థలం వంటి అన్ని రంగాల్లోనూ హాస్యం అందరికీ పంచి నిండుగా నూరేళ్ళు జీవించిన ధన్యజీవి బాబ్ హోప్ మరణం (జ.1903).
2015 : భారత దేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త మరియు 11 వభారత రాష్ట్రపతి ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ మరణం (జ.193
10. *ప్రహ్లాద సమేత స్వయంభూగా వేలశి యున్నక్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము*
కదిరి పట్టణము – 515591, అనంతపురము జిల్లా., ఆంధ్రప్రదేశ్
ఫోన్ నెం : 08494 – 221066, 221366
email: ac_eo_kadiri@yahoo.co.in
27.07.2019 వతేది, *శనివారము ఆలయ సమాచారం*
_శ్రీస్వామి వారి దర్శన వేళలు_* ఉదయము 5.30 గంటలకు అలయము శుద్ది, మొదటి మహాగంట, నివేదన, బాలబోగ్యం త్రికల నైవేద్యాములు సమర్పణ. పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నివేదనసమర్పణ..
స్వామి వారి దర్శనము ఉదయము 6.00 గంటల నుండి 7.30 గంటలకు వుండు
అనంతరము ఉదయం 7.30 గం|| నుండి స్వామివారికి అర్జిత అభిషేక సేవ ప్రారంభమగును.
స్వామి వారికి *_ఆర్జిత అభిషేకము_* సేవా, సహస్రనామర్చన, పుష్ప అలంకరణ, మహా మంగళ హారతితో పాటు నివేదిన, ప్రసాదము నైవేధ్యము సమర్పణ కార్యకమమును ( ఉదయము 7.30 గంటలనుండి 9.30 గంటల వరకు ) నిర్వహించెదరు…
తిరిగి సర్వ దర్శనము ఉదయము 10.00 గంటల నుండి మ. 12.00 వరకు వుండును..
రెండవ మహాగంట నివేదనమ.12.00 నుండి 12.30 లోపు, బాలబోగ్యం త్రికల నైవేద్యాము సమర్పణ..
మ. 12.40 నుండి 1.30 వరకు సర్వదర్శనము.. అనంతరము ఆలయము తలుపులు మూయబడును..
తిరిగి సాయంత్రము శ్రీస్వామి వారి దర్శనార్థము 4.30 గంటలనుండి రా.6.00 వరకు వుండును..
మూడవ మహా గంట ఆలయ శుద్ది, నివేదన రా.6.30 నుండి 7.00 లోపు, బాల బోగ్యం త్రికల నైవేద్యాదులు సమర్పణ. మహ మంగళ హారతి, పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నైవేద్యాములు సమర్పణ..
తిరిగి శ్రీస్వామి వారి దర్శనార్థము రాత్రి 7.00 గంటల నుండి రా.8.30 వరకు వుండును..
రాత్రి 8.30 గంటల పైన ఆలయ శుద్ది అనంతరము, స్వామి వారికి ఏకాంత సేవాతో స్వామి వారి దర్శనము పరిసమప్తం అగును, తదుపరి ఆలయము తలుపులు ముయాబడును..
*ఆర్జిత సేవాల వివరములు*
_*27.07.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) ఆర్జిత అభిషేకము సేవా టిక్కెట్లు బుకింగ్: 46*_
_*27.07.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) అర్జిత స్వర్ణకవచ సేవా టిక్కెట్లు బుకింగ్: 7*_
11. తిరుమల సమాచారం**ఓం నమో వేంకటేశాయ*
ఈరోజు శనివారం *27-07-2019* ఉదయం *5* గంటల సమయానికి.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ……
శ్రీవారి దర్శనానికి *అన్ని* కంపార్ట్ మెంట్లు నిండి క్యూ లైన్ లో వేచి వున్న భక్తులు…..
శ్రీవారి సర్వ దర్శనానికి *15* గంటల సమయం పడుతోంది…..
ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి *5* గంటల సమయం పడుతుంది….
నిన్న జూలై *26* న *74,262* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు *4.01* కోట్లు.
12. ప్రహ్లాద సమేత స్వయంభూగా వేలశి యున్నక్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము*
కదిరి పట్టణము – 515591, అనంతపురము జిల్లా., ఆంధ్రప్రదేశ్
ఫోన్ నెం : 08494 – 221066, 221366
email: ac_eo_kadiri@yahoo.co.in
*_శ్రీవారి ఆర్జిత కళ్యాణోత్సవము సేవా
ఆగస్టు మాసము-2019 బుకింగ్ చేసుకొనుటకు గాను.
*శ్రావణ మాసం శు|| షష్టి 06.08.2019 నుండి శ్రావణ మాసం బహుళ || చతుర్థశి 29.08.2019 వరకు* ఈ క్రింద తెలిపిన రోజులలో మాత్రము ఉదయము.11 గంటల నుండి శ్రీస్వామి వారి *_ఆర్జిత కళ్యాణోత్సవము_* సేవా ప్రారంభమగును..
ఒక రోజుకు 5 కళ్యాణములు సేవ టెక్కెట్లు మాత్రమే జారి చేయబడను.
వ.నెం. తేది. వారము
1. 06.08.2019 మంగళవారము
2. 08.08.2019 గురువారము
3. 12.08.2019 సోమవారము
4. 13.08.2019 మంగళవారము
5. 14.08.2019 బుధవారము
6. 19.08.2019 సోమవారము
7. 20.08.2019 మంగళవారము
8. 22.08.2019 గురువారము
9. 26.08.2019 సోమవారము
10. 27.08.2019 మంగళవారము
11. 28.08.2019 బుధవారము
12. 29.08.2019 గురువారము
13. శ్రీరస్తు శుభమస్తు
*తేది : 27, జూలై 2019*
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆషాఢమాసంఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : స్థిర(మంద)వాసరే (శనివారం)
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : దశమి
(నిన్న రాత్రి 7 గం॥ 56 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 7 గం॥ 46 ని॥ వరకు దశమి తిధి తదుపరి ఏకాదశి తిధి)
నక్షత్రం : కృత్తిక
(నిన్న రాత్రి 6 గం॥ 56 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 7 గం॥ 30 ని॥ వరకు కృత్తిక నక్షత్రం తదుపరి రోహిణి నక్షత్రం)
యోగము : (గండ ఈరోజు ఉదయం 7 గం ll 55 ని ll వరకు తదుపరి వృద్ది రేపు ఉదయం 6 గం ll 28 ని ll వరకు)
కరణం : (వణిక్ ఈరోజు ఉదయం 7 గం ll 51 ని ll వరకు)
(విష్టి ఈరోజు రాత్రి 7 గం ll 40 ని ll వరకు)
అభిజిత్ : (ఈరోజు మద్యాహ్నము 12 గం ll 23 ని ll)
వర్జ్యం : (ఈరోజు ఉదయం 7 గం॥ 13 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 51 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు సాయంత్రం 5 గం॥ 3 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 41 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 5 గం॥ 43 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 28 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 10 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 46 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 58 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 34 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 59 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 35 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 54 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 51 ని॥ లకు
సూర్యరాశి : కర్కాటకము
చంద్రరాశి : వృషభము
14. శుభోదయం*
*మహానీయుని మాట*
” ముందు నీ లక్ష్యాన్ని నిర్ణయించుకో, తర్వాత దాన్ని సాధించడం కోసం కృషి చెయ్యి. ”
15. నేటీ మంచి మాట
” ఇంటికప్పులోని రంధ్రం ఎండలో కన్పించకపోవచ్చు కానీ వానలో దాని బండారం తప్పక బయటపడుతుంది.
16. నేటి సుభాషితం
*ప్రయత్నంలోనే సంతృప్తి ఉంది, సాధించడంలో కాదు, పూర్తి ప్రయత్నంలోనే పూర్తి విజయం ఉంటుంది.*
17. నేటి సామెత
*తాడు చాలదని బావిని పూడ్చమన్నాడట*
ఒక పద్ధతిలో పని కాక పోతె వేరొక మార్గంలో ఆలోసించాలి గాని….. అసలు పని మానుకోకూడదని హితవు చెప్పేదే ఈ సామెత.
18. నేటి జాతీయం
*కాకి ముక్కుకు దొండ పండు*
నల్లని కాకిముక్కుకు ఎర్రని దొండ పండు పొంతన కుదరదు. పొంతన లేని వాని గురించి దీన్ని వాడుతారు. ఎక్కువగా సరి జోడి లేని దంపతులనుద్దేశించి ఈ జాతీయాన్ని వాడుతారు.
19. నేటి ఆణిము
నిజకార్యసముద్దరణార్థమై మహిం
బనివడి యల్పమానవునిఁ, బ్రార్థనజేయుట తప్పు గాదుగా
యనఘతఁ గృష్ణజన్మమున, నా వసుదేవుఁ మీఁదుటెత్తుగాఁ
గనుఁగొని గాలిగానికడ, కాళ్ళకు మ్రొక్కఁడె నాఁడు భాస్కరా!
*భావం:*
ఎంత గొప్పవానికైనా, సమయం వచ్చినప్పుడు నీచుని వేడుకొనుట తప్పు కాదు. పూర్వము శ్రీకృష్ణమూర్తి జన్మించినప్పుడు అతని తండ్రి వసుదేవుడు గాడిదకాళ్లు పట్టుకోలేదా?