*ఇటీవల సమంత, నందినిరెడ్డిల కాంబినేషన్ లో వచ్చిన ‘ఓ బేబీ’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం వీరిద్దరూ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీరికి హైకోర్టు షాక్ ఇచ్చింది.అయితే ఆ షాక్ ‘ఓ బేబీ’ సినిమాకి సంబంధించినది కాదు.. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘జబర్దస్త్’ సినిమాకు సంబంధించిన విషయం. 2013లో నందిని రెడ్డి రూపొందించిన ‘జబర్దస్త్’ అనే సినిమా విడుదలైంది. ఇందులో సమంత లీడ్ రోల్ పోషించింది. సినిమా విడుదలైన తరువాత ఓ వివాదం వీరిని చుట్టుముట్టింది.2010లోరణవీర్ సింగ్, అనుష్క శర్మ జంటగా నటించిన ‘బ్యాండ్ బాజా బరాత్’ సినిమాను ఎలాంటి రైట్స్ తీసుకోకుండా తెలుగులో ‘జబర్దస్త్’ పేరుతో రూపొందించారని బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ కోర్టులో కేసు పెట్టింది.ఆరేళ్ల తరువాత కోర్టు నిర్మాణ సంస్థకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ‘జబర్దస్త్’ సినిమాకి సంబంధించి ఎలాంటి ప్రదర్శన చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసింది.
* ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా అధిక రేట్లు వసూలు చేసినందుకు ఈ జరిమాన విధించారు9 మంది మీ సేవ నిర్వాహకులకు, ఒక్కొక్కరికి లక్ష రూపాయలు అపరాధ రుసుం విధించి 15 రోజులలో ఆ సొమ్ము చెల్లించాలని ఆదేశించారు. సొమ్ము కట్టకపోతే ఆ కేంద్రాలను మూసివేస్తారు.
* టీడీపీ నిజనిర్ధారణ కమిటీకి షాక్..
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పొనుగోడు గ్రామం వద్ద టీడీపీ నిజనిర్ధారణ కమిటీని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలోకి టీడీపీ నేతలు వెళితే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందని, అందుకే అడ్డుకుంటున్నామని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు ఊర్లోకి వెళ్లేందుకు తాము అనుమతించలేమని తేల్చిచెప్పారు. పొనుగోడులో టీడీపీ మద్దతుదారుల ఇళ్లకు వెళ్లే రోడ్డుకు అడ్డంగా వైసీపీ నేతలు గొడ కట్టారు. ఈ విషయమై బాధితులు ఫిరంగిపురం పోలీసులను ఆశ్రయించడంతో దాన్ని ఆపేశారు.ఈ విషయమై మీడియాలో కథనాలు రావడంతో నేతలు డొక్కా మాణిక్య వరప్రసాద్, బచ్చుల అర్జునుడు, మద్దాల గిరిధర్, అశోక్ బాబు, శమంతకమణిలతో టీడీపీ అధినేత చంద్రబాబు నిజనిర్ధారణ కమిటీని నియమించారు. తాజగా ఈ కమిటీ సభ్యులనే పోలీసులు ఊర్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే పోలీసుల సమక్షంలోనే తాము గ్రామంలో పర్యటిస్తామనీ, ఎలాంటి శాంతిభధ్రతల సమస్య తలెత్తదని టీడీపీ నేతలు వారికి హామీ ఇచ్చారు. అయినా పోలీసులు మెత్తబడకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు.
*మొయిన్ ఖురేషీ కేసులో హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామిక వేత్త సానా సతీశ్‌ను ఈడీ, సీబీఐ పలు కేసుల్లో విచారిస్తూ వస్తున్నాయి. ఈ విచారణలో భాగంగా అతను కొందరు ఉన్నతాధికారులకు ముడుపులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.ఖురేషి అక్రమాస్తుల కేసులో సతీశ్ సాక్షిగా ఉన్నాడు. ఆయనపై మనీలాండరింగ్ నియంత్రణ చట్టం కింద శనివారం అరెస్ట్ చేశారు. ఇవాళే సతీశ్ బాబును సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు.. దీంతో ఆయనకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
* ఫిలిఫ్పైన్స్‌లో భూకంపం…సునామీ ప్రమాదం లేదు…
ఫిలిఫ్పైన్స్‌లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. ఫిలిఫ్పైన్స్ దేశంలోని బటానేస్ ప్రాంతంలో శనివారం ఉదయం సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 7.3 అని యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం ఇట్బాయత్ మున్సిపాలిటీ కేంద్రంగా వచ్చింది. దీనివల్ల ఎంత ఆస్తి నష్టం సంభవించిందో తెలియలేదు. ఈ భూకంపం వల్ల సునామీ ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఫిలిప్ఫీన్స్ దేశం అగ్నిపర్వతాలు పేలడం, భూకంపాలతో అతలాకుతలమైంది.
* టిక్‌టాక్.. కరీంనగర్‌లో ముగ్గురిపై వేటు
విధులు మరిచి టిక్‌టాక్ రూపొందించి ఉద్యోగాలను కోల్పోతున్న సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో టిక్‌టాక్‌లో నటించిన వైద్య విద్యార్థులను సస్పెండ్ చేసిన మరుసటి రోజే కరీంనగర్‌లోనూ అలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులు టిక్‌టాక్‌లో నటిస్తూ క్రమశిక్షణ తప్పడంతో ఉన్నతాధికారులు ముగ్గురిపై వేటు వేశారు. వైద్య ఆరోగ్యశాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న దివ్యమణి, సమత, ల్యాబ్ అసిస్టెంట్ జయలక్ష్మి టిక్‌టాక్‌లో నటించినట్లు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం నిన్నరాత్రి వెలుగులోకి రాగా.. ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని తొలుత నిర్ణయించారు. ఆనోటా ఈనోటా రచ్చకెక్కడంతో చివరికి ఈ ముగ్గురిపైనా ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. వీరు ముగ్గురూ కారుణ్య నియామకాల్లో భాగంగా ఉద్యోగం పొందిన వారు కావడం గమనార్హం.
* ఢిల్లీ ఐఐటీ ఆవరణలోని ఫ్లాటులో నివాసముంటున్న ల్యాబ్ టెక్నీషియన్ కుటుంబంలో ముగ్గురు సభ్యులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. ల్యాబ్ టెక్నీషియన్ గుల్షన్‌దాస్, భార్య సునీత, తల్లి కాంతలు వేర్వేరు గదుల్లో సీలింగ్ ఫ్యాన్లకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
పోలీసులు తలుపులు పగులగొట్టి మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. గుల్షన్ దాస్ కు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వివాహమైంది. ముగ్గురి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.
* కడప నగర శివారులోని పాలకొండ ప్రాంతంలో తేనె తీయడానికి వెళ్లిన ఇందిరానగర్ కు చెందిన నలుగురు యువకులు…తేనెటీగల దాడిలో యువకుడికి తీవ్ర గాయాలతో కొండపై నుంచి కింద పడడంతో యువకునికి కాళ్లు విరిగాయి రిమ్స్ పోలీసులకు సమాచారం అందడంతో…హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై విద్యాసాగర్ తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్ కు తరలింపు.
* నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి)లో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. గ్రామానికి చెందిన నలుగురిపై దాడి చేసింది. ఎలుగు దాడిలో రాజు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఎలుగుబంటి పొదల్లో దాక్కుంది. ఎలుగుబంటిని పట్టుకునేందుకు హైదరాబాద్ నుంచి రెస్క్యూటీం ధర్మారం వెళ్లింది. పొదల నుంచి ఎలుగుబంటిని బయటకు రప్పించేందుకు రెస్క్యూ బృందం యత్నిస్తోంది. తీవ్రంగా గాయపడిన రాజును జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు.
* భారత సైన్యం ఉగ్రమూకల ఏరివేతలో జోరు పెంచింది. శనివారం దక్షిణ కశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో భారత సైన్యం జరిపిన ఎన్ కౌంటర్లో పాకిస్థాన్ కు చెందిన జైషే మహ్మద్ సంస్థ కమాండర్ మున్నా లాహోరి హతమయ్యాడు.
* చిత్తూరు వి.కోట మండలం జే.బి.కొత్తూరు గ్రామానికి చెందిన రాణి(16) అనే యువతి చెరువులో పడి మృతి చెందింది.గ్రామస్తుల ఫిర్యాదుతో వి.కోట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే రాణి కనిపించడం లేదంటూ ఇప్పటికే ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాణి చెరువులో శవమై కనిపించడంతో ఆమె కుటుంబంలో విషాదం నెకలొంది.రాణి మృతికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేసి న్యాయం చేయాలని మృతురాలి బంధువులు కోరుతున్నారు.
* ఢిల్లీ ఐఐటీ ఆవరణలోని ఫ్లాటులో నివాసముంటున్న ల్యాబ్ టెక్నీషియన్ కుటుంబంలో ముగ్గురు సభ్యులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. ల్యాబ్ టెక్నీషియన్ గుల్షన్‌దాస్, భార్య సునీత, తల్లి కాంతలు వేర్వేరు గదుల్లో సీలింగ్ ఫ్యాన్లకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తలుపులు పగులగొట్టి మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. గుల్షన్ దాస్ కు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వివాహమైంది. ముగ్గురి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ కూడా లేదు. సునీత తల్లి కృష్ణాదేవి సంఘటన స్థలానికి వచ్చారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* బ్యాగులో గంజాయి ఉంది చెక్ చేయాలని ఓ బంగారం వ్యాపారిని బోల్తా కొట్టించి నకిలీ పోలీసులు అతని వద్ద ఉన్న బంగారాన్ని అపహరించారు. ఒంగోలుకి చెందిన నరసింహులు అనే వ్యాపారి బంగారు షాపుల్లో బంగారం సరఫరా చేసి వెళుతుండగా మీ బ్యాగులో గంజాయి ఉంది సోదాలు చేయాలని నలుగురు నకిలీ పోలీసులు చెప్పారు. దీంతో నరసింహులు తన బ్యాగును చూపించడంతో దానిలో ఉన్న 392 గ్రాముల బంగారాన్ని దుండగులు అపహరించారు. వెంటనే తేరుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు
* ఢిల్లీ ఐఐటీ ఆవరణలోని ఫ్లాటులో నివాసముంటున్న ల్యాబ్ టెక్నీషియన్ కుటుంబంలో ముగ్గురు సభ్యులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. ల్యాబ్ టెక్నీషియన్ గుల్షన్‌దాస్, భార్య సునీత, తల్లి కాంతలు వేర్వేరు గదుల్లో సీలింగ్ ఫ్యాన్లకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తలుపులు పగులగొట్టి మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. గుల్షన్ దాస్ కు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వివాహమైంది. ముగ్గురి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ కూడా లేదు. సునీత తల్లి కృష్ణాదేవి సంఘటన స్థలానికి వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*మాంసం ఎగుమతిదారుడు మొయిన్ ఖురేషీ అక్రమాస్తుల కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న హైదరాబాద్‌కు చెదిన సాన సతీష్ బాబును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఖురేషీ అక్రమాస్తుల కేసులో సతీశ్ సాక్షిగా ఉన్నాడు. శుక్రవారం అర్ధరాత్రి ఆయన దిల్లీలోని ఓ కీలక ప్రదేశంలో ఉండగా ఈడీ అధికారులకు చిక్కారు.
*సోషల్ మీడియాలో విద్వేషపూరిత పాటను అప్‌లోడ్ చేసిన నలుగురు యూపీ వ్యక్తులను లక్నో పోలీసులు అరెస్టు చేశారు.
*పోలీసు దుస్తుల్లో వచ్చిన ముష్కరులు… సుమారు రూ.275.50 కోట్ల (40 మిలియన్ డాలర్ల) విలువైన 750 కిలోల బంగారం, ఇతర ఖరీదైన లోహాలను కాజేశారు! దక్షిణ అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే గురులోస్ (జీఆర్యూ) విమానాశ్రయంలో చోటుచేసుకుందీ ఘటన.
*పోలీసు దుస్తుల్లో వచ్చిన ముష్కరులు… సుమారు రూ.275.50 కోట్ల (40 మిలియన్ డాలర్ల) విలువైన 750 కిలోల బంగారం, ఇతర ఖరీదైన లోహాలను కాజేశారు! దక్షిణ అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే గురులోస్ (జీఆర్యూ) విమానాశ్రయంలో చోటుచేసుకుందీ ఘటన.
*ఆసుపత్రులు, వైద్యపరికరాల విక్రయ దుకాణాలపై తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో దాడులు రెండోరోజూ కొనసాగాయి. నిబంధనలు పాటించని సంస్థలపై 203 కేసులు నమోదు చేసినట్లు ఆ శాఖ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
*ఉయ్యూరులోని నారాయణ పాఠశాలలో పలువురు ఉపాధ్యాయులు ఓ విద్యార్థిని చితకబాదిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది.
*వైద్యపరికరాల గరిష్ఠ అమ్మకపు ధర, తయారీ తేదీలకు సంబంధించి ఆసుపత్రులు, అనుబంధ ఫార్మసీల్లో తూనికలు, కొలతలశాఖ గురువారం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించింది.
*శక్తి గ్రూపు కార్యాలయాలు, ఆ సంస్థ నిర్వాహకుల నివాసాల్లో ఐటీ అధికారులు గురువారం మెరుపు సోదాలు నిర్వహించారు.
*దుకాణంలోని బిస్కెట్ ప్యాకెట్లు ఎత్తుకెళ్లిన కోతి వెంటపడి ఓ యువకుడు అనూహ్యంగా విద్యుదాఘాతానికి గురై దుర్మరణం చెందాడు. అనంతపురం జిల్లా ముదిగుబ్బలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.
*షాద్నగర్ జంట హత్యల కేసును గురువారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. తాము దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ అవసరం లేదని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు కోరగా, వారి వినతిని దేశ సర్వోన్నత న్యాయస్థానం మన్నించింది. త
*చాక్లెట్ ఇస్తానని మాయమాటలు చెప్పి నాలుగేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
* తాను చేస్తున్న వ్యాపారంలో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ప్రతి నెల రూ.20 వేల ఆదాయం వస్తుందని గుంటూరు పట్టణానికి చెందిన తిరుమలశెట్టి రాఘవ (26) పలువురిని నమ్మించి దాదాపు రూ.62 కోట్లు వసూలు చేశాడని పోలీసులు తెలిపారు.
*యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ (యూఐఆర్సీ)లో శిక్షణకు వచ్చిన మహిళలను అధిక లాభాల పేరుతో మోసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
*నిబంధనలకు విరుద్ధంగా నైజీరియా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆహార పదార్థాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
*అధిక వడ్డీల పేరిట ఘరానా మోసానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ పాతబస్తీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకునే వాళ్లే లక్ష్యంగా నిందితులు ఈ మోసానికి పాల్పడ్డారు.
*ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి యత్నించిన ఓ వ్యక్తి, తనపై ఇతరులు దాడి చేశారని తప్పుడు సమాచారం ఇవ్వడంతో స్థానికంగా గందరగోళం నెలకొంది. అనుమానం వచ్చి పోలీసులు నిలదీయడంతో తానే ఇబ్బందులు కారణంగా బ్లేడ్తో గాయపర్చుకున్నానని అంగీకరించాడు.
*చాక్లెట్ ఇస్తానని మాయమాటలు చెప్పి నాలుగేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
* ఓ అధికారి అత్యాశ.. అక్షరాలా రూ.70లక్షల కష్టార్జితాన్ని గంగపాలు చేసింది.. గుడ్డిగా నమ్మిన ఓ అసత్య సమాచారం ఆయనను నిలువునా ముంచేసింది.
*ఓ బాలికను వ్యభిచార కూపంలోకి దింపేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో ఇద్దరు యువతులపై బంజారాహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
* హయత్నగర్లో యువతి అపహరణ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ గుర్తు తెలియని వ్యక్తి బుధవారం ఓ యువతితో పరారయ్యాడు.
* కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. భార్యను కత్తెరతో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేసన్ పరిధిలో చోటు చేసుకున్నది.
*బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి కోర్టు 14 నెలల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. మారేడ్పల్లి ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు కథనం ప్రకారం.. బంజారాహిల్స్ ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన వెంటరాంరెడ్డి (43) కూలీ. 2013లో దీపావళి పండుగ రోజు బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించగా.. మారేడ్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 6 సంవత్సరాల అనంతరం నాంపల్లిలోని భరోసా కోర్టు న్యాయమూర్తి సునీత నిందితుడికి 14 నెలల జైలు శిక్షతో పాటు రూ.500ల జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు.
* నారాయణపేట జిల్లా కోస్గి మండలం. చంద్రవంచ గెట్ సమీపంలో, ఎదురుగా వస్తున్న లారీ ని తప్పిచ బోయి, ముందుగా వస్తున్న లారీ ని ఢీ కొని, అల్లిఖాన్ పల్లి గ్రామానికి చెందిన, మేకలి రాములు (21) లారి కింద పడి మృతి..
* హైదరాబాద్ నగరంలోని డీడీ కాలనీలో ఇవాళ ఉదయం 10 గంటలకు గొలుసు దొంగతనం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును ఇద్దరు దుండగులు బైక్ వచ్చి దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గొలుసు దొంగతనం జరిగిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
* సోషల్ మీడియాలో విద్వేషపూరిత పాటను అప్‌లోడ్ చేసిన నలుగురు యూపీ వ్యక్తులను లక్నో పోలీసులు అరెస్టు చేశారు.
* రోగులకు ఉచితంగా వైద్యం అందించాల్సిన ప్రభుత్వ వైద్యుడు లంచాల బాట పట్టాడు. చేతిలో డబ్బు పెడితే కానీ.. రోగిపై స్టెతస్కోప్ పెట్టడు ఆ డాక్టర్. లంచం ఇవ్వాలని రోగులను ఇబ్బంది పెడుతున్న ఆ వైద్యుడిని ఓ రోగి ఏసీబీ అధికారులకు పట్టించాడు. మహారాష్ట్ర సంగ్లీ జిల్లాలోని కుర్‌లాప్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో నితిన్ చివటే అనే వ్యక్తి డాక్టర్‌గా సేవలందిస్తున్నాడు.
సమంత నందినిరెడ్డిలకు హైకోర్టు షాక్-నేరవార్తలు–07/27
Related tags :