DailyDose

జనసేనకు జేడీ గుడ్ బై-తాజావార్తలు–07/27

జనసేనకు జేడీ గుడ్ బై-తాజావార్తలు–07/27-JD Lakshminarayana Leaving Janasena-Telugu Breaking News Today-July272019

* సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ జనసేనను వీడే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేన అభ్యర్థిగా సిబిఐ మాజీ జెడీ లక్ష్మినారాయణ విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జనసేనకు కాస్తా దూరంగానే ఉన్నట్లు తెలుస్తోంది.వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు ద్వారా లక్ష్మినారాయణ హీరో అయ్యాడు. ఆయనకు గ్లామర్ పెరిగింది కూడా ఆ కేసులతోనే. ఆ తర్వాత ఆయన మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. తన పదవికి రాజీనామా చేసి ఆయన నిరుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన సొంత పార్టీ పెడుతారని, లోకసత్తాకు నాయకత్వం వహిస్తారని అప్పట్లో ప్రచారం సాగిందిఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం కూడా సాగింది. కానీ, చివరికి అనూహ్యంగా పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. విశాఖపట్నం లోకసభ స్థానానికి పోటీ చేసిన లక్ష్మినారాయణ మాత్రమే కాకుండా ఆ లోకసభ నియోజకవర్గం పరిధిలోని గాజువాక శాసనసభ స్థానానికి పోటీ చేసిన పవన్ కల్యాణ్ కూడా ఓటమి పాలయ్యారు
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం సమీపంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం సైట్ క్లియరెన్స్ ఇచ్చింది. తెలంగాణా స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు సైట్ క్లియరెన్స్ అనుమతి ఇచ్చినట్లు పార్లమెంటులో పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి లిఖితపూర్వకంగా తెలియచేశారు. ఇది తొలి దశకు సైట్ క్లియరెన్స్ అని, రెండో దశకు అనుమతి ఆమోదం పొందాల్సి ఉందని మంత్రి తెలిపారు. రెండో దశ అనుమతి డీపీఆర్, ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉంటుంది.
* తెదేపా అధినేత చంద్రబాబునాయుడు వైద్యపరీక్షల కోసం అమెరికా వెళ్లనున్నారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన ఈ నెల 28న(ఆదివారం) అమెరికా వెళ్తారు. ఆగస్టు 1న తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు.
*ఆంధ్రప్రదేశ్ ధార్మిక, హిందూమత సంస్థల, ఎండోమెంట్ల సవరణ బిల్లు, విద్యుత్తు చట్ట సవరణ బిల్లుకు శుక్రవారం శాసనమండలి ఆమోదం తెలిపింది. తెదేపా సభ్యులు వాకౌట్ చేసిన అనంతరం సభలో ఈ బిల్లులను మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్ ప్రవేశపెట్టారు.
*భూమి హక్కులు- పట్టాదారు పాసుపుస్తకాల చట్టం 2019 ఈ నెల 23 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.
* ముంబై మునిగిపోతోంది. రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న నగరంలోని చాలా ప్రాంతాలు జలమలమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 18 సెంటిమీటర్ల వర్షం పడింది. చాలా ప్రాంతాల్లో 15 సెంటిమీటర్ల వాన కురిసింది. గాంధీ మార్కెట్, సైన్ ఏరియాను వరద ముంచెత్తింది. మతుంగా, పతాలిపడ, శాంతా క్రజ్ , వసాయి, బాదల్ పూర్, అంబర్ నాథ్, కల్యాణ్ , కుర్లా, థానే ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. 2005 నాటి వరద పరిస్థితులు వచ్చేలా కనిపిస్తున్నాయి. 2005 జూలై 26న 24 గంటల్లోనే ముంబైలో 94 సెంటిమీటర్ల వర్షం కురిసింది. ఇవాళ కూడా కుండపోత వాన కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ హెచ్చరికలతో.. ముంబై వాసులు భయంతో వణికిపోతున్నారు.
* సివిల్ సర్వీసు ఎగ్జామ్‌‌లో ర్యాంకుతో పాటు యూనిఫైడ్ ఫౌండేషన్ కోర్సులో ప్రతిభ ఆధారంగానే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) అభ్యర్థులకు సర్వీసులను ఇవ్వనుంది. ఈ మేరకు నరేంద్ర మోడీ సర్కారు డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ), యూపీఎస్సీకి సర్క్యూలర్లు జారీ చేసింది. వాటి ప్రకారం సివిల్ సర్వీసెస్‌‌కు అర్హత సాధించిన ప్రతి అభ్యర్థి కచ్చితంగా ఫౌండేషన్ కోర్సును పూర్తి చేయాలి. దీనికి 10 శాతం వెయిటేజీని కేంద్రం కేటాయించింది. ఎగ్జామ్స్, ఇంటర్వ్యూలో మార్కులు, కోర్సులో ప్రతిభ ఆధారంగానే సర్వీసుల కేటాయింపు జరపాలని పేర్కొంది.
* 29వ తేదీ నుంచి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమావేశాలు
* ఎన్కౌంటర్లో జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన టాప్ కమాండర్ మున్నా లాహోరీ అలియాస్ బిహారీ సహా మరో ఉగ్రవాదిని భద్రత బలగాలు మట్టుబెట్టాయి. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి
* ప్రేమ పేరుతో మోసపోయాను సర్ న్యాయం చేయండంటూ ఓ యువతి కేటీఆర్‌ దగ్గర కనీళ్లు పెట్టుకుంది. తనను కొనాళ్ళ పాటు ప్రేమించి పెళ్లి చేసుకుంటనాని చేప్పి ఇప్పుడు మొహం చాటేశాడని కేటీఆర్‌కు వివరించింది. కృష్ణా జిల్లాకు చెందిన అశోక్‌ అనే యువకుడు తనని ప్రేమించి మోసం చేశడాని వాపోయింది. 20 రోజుల్లో తనను పెళ్లి చేసుకుంటానని కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఒప్పుకొని ఏడాది గడుస్తున్న ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదాని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ యువతి ఆవేధనను విన్న కేటీఆర్ ఆ అమ్మాయి సమస్య పరిష్కారానికి సహకరించాలని తెరాస మహిళా విభాగానికి చెప్పారు.
* కందుకూరు పట్టణంలోని కోవూరు రోడ్డులో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. వ్యభిచార వృత్తిలో చిక్కుకున్న ఇద్దరు యువతులతోపాటు నాలుగురు నిర్వాహకులను కూడా పట్టుకున్నారు.
*ఒడిశాలోని బాలియపాల్‌ పోలీసు స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్‌ ఇంచార్జి ప్రభు కల్యాణ్‌ ఆచార్యపై ఉలుదా గ్రామస్తులు దాడి చేశారు. శుక్రవారం ఉదయం ఓ మైనర్‌ బాలుడి మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది.
* విశాఖ జిల్లా అనకాపల్లి రూరల్‌ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు పడింది. అక్రమ ఇసుకకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై జిల్లా ఎస్పీ ఇద్దరు కానిస్టేబుళ్లు ఈశ్వరరావు, శ్రీనివాసరావులను సస్పెండ్‌ చేశారు.
* పశ్చిమబెంగాల్ కోస్తా తీర ప్రాంతాల్లోని వాయవ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణ మీదుగా నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. మరోవైపు పశ్చిమబెంగాల్ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని, దీని ప్రభావం రాష్ట్రంపై కూడా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు. అల్పపీడనం కారణంగా శని, ఆదివారాల్లో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కొన్నిప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వానలు కురుస్తాయని తెలిపారు.
* హయత్‌నగర్ బీ ఫార్మసీ విద్యార్థిని సోనీ కిడ్నాప్ అయి ఐదు రోజులు గడుస్తున్నా ఆమె ఆచూకీ మాత్రం నేటికీ లభించలేదు. నిందితుడిని ఐతం రవిశేఖర్‌గా గుర్తించిన పోలీసులు అతను కర్నూల్ వైపు వెళ్లినట్టు విచారణలో తెలుసుకున్నారు. నిందితుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కావడంతో సోని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా రవి శేఖర్ కుమారుడు ఐతం రాజాను, అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని ఓ రహస్య ప్రదేశంలో ఏపీ, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా విచారణ నిర్వహిస్తున్నారు.
* ఉద్యోగాలు ఊడుతున్న సంఘటనలు కోకొల్లలుగా వెలుగు చూస్తున్నప్పటికీ ప్రభుత్వోద్యోగులు మాత్రం టిక్‌టాక్‌ను వదలడం లేదు. రాత్రికి రాత్రి సెలబ్రిటీలు అయిపోవాలన్న ఆకాంక్షతో విధుల్లో ఉండగానే టిక్‌టాక్ చేసి అడ్డంగా బుక్ అవుతున్నారు. ఈ జాడ్యం తాజాగా ఏపీలోని శక్తి టీమ్స్‌కు కూడా అంటుకుంది. టిక్‌టాక్‌ మోజులో పడి శక్తి టీమ్స్‌ విధులను గాలికొదిలేశాయన్న ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి.
* పంచ్ డైలాగ్‌లతో టిక్‌టాక్ చేస్తూ హల్‌చల్ చేస్తున్నారు. జబర్దస్త్ పంచులతో కామెడీ పండిస్తూ లేడీ కానిస్టేబుల్స్ చేస్తున్న టిక్‌టాక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పోలీసు వాహనంలోనే టిక్‌టాక్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. టిక్‌టాక్‌ వీడియోలను స్టేటస్‌లో పెట్టుకుని తెగ వైరల్‌ చేస్తున్నారు. దీంతో రక్షణను గాలికొదిలేశారంటూ మహిళా ఖాకీలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
* శబ్ద కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో లౌడ్‌ స్పీకర్లపై నిషేధం విధిస్తూ పంజాబ్‌ హర్యానా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆలయాలు, మసీదులు, గురుద్వారాల్లో కూడా లౌడ్‌ స్పీకర్లపై నిషేధం విధించింది. ముందస్తు అనుమతి లేకుండా వాటిలో లౌడ్‌ స్పీకర్లను ఉపయోగించకూడదని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.
* శాసనసభలో ఉన్న వైకాపా మహిళా శాసనసభ్యులపై ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన పునుగుపాటి రమేష్ అనే వ్యక్తిపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా శాసనసభ్యులను అగౌరవ పరిచేలా వ్యాఖ్యలు పెట్టారంటూ శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాసనసభ కార్యదర్శి ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు రమేష్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శాసనసభ్యులపై రమేష్ చేసిన వాఖ్యల ఫొటోలు, ఆయన ఫేస్‌బుక్‌ ఖాతా ఫొటోను పోలీసులకు అందజేశారు. రమేష్ కోసం గాలిస్తున్నామని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. గతంలో అనంతపురం జిల్లాలోనూ రమేష్ పై ఇదే తరహా కేసు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఫేస్‌బుక్‌లో రమేష్ పోస్టింగ్‌ను అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం తీవ్రంగా పరిగణించారు.
* జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్న ట్విటర్‌ను అత్యధికంగా ఫాలో అవుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారిక ట్విటర్‌ GHMCOnline కు లక్ష మంది ఫాలోవర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ట్విటర్‌ ద్వారా వచ్చే పలు ఫిర్యాదులపై కమిషనర్ దాన కిషోర్‌తో పాటు ఇతర అధికారులు తక్షణమే స్పందిస్తుండడంతో ఫాలోవర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటి వరకు అత్యధికంగా ట్విటర్‌ ఫాలోవర్లు కలిగిన కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ నిలిచింది.
* దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల త్యాగాలు మర్చిపోలేనివని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ చాంద్రాయణగుట్టలోని సీఆర్‌పీఎఫ్‌ కేంద్రంలో 81వ రైజింగ్‌ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సీఆర్‌పీఎఫ్‌ అమరజవాన్ల స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ఆయనకు గౌరవవందనం సమర్పించాయి.
* చిత్తూరు జిల్లా పలమనేరు ఆర్టీవో చెక్ పోస్ట్ లో అర్ధరాత్రి నుండి ఏసీబీ దాడులు జరుగుతున్నాయి, గత కొంతకాలంగా పలు ఆరోపణలతో ఫిర్యాదులు అందడంతో ఏసీబీ ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ ప్రైవేట్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దనుండి రూ.46200 రూపాయలను లెక్కకు మించిన డబ్బులను స్వాధీనం చేసుకున్నారు.
* విశాఖ జిల్లా అనకాపల్లి రూరల్‌ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు పడింది. అక్రమ ఇసుకకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై జిల్లా ఎస్పీ ఇద్దరు కానిస్టేబుళ్లు ఈశ్వరరావు, శ్రీనివాసరావులను సస్పెండ్‌ చేశారు.ఏసీబీ ఆకస్మిక దాడులు …
* కృష్ణా జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖాధికారులు శనివారం స్కూళ్లను తనిఖీలు చేస్తున్నారు. అనుమతి లేని స్కూళ్లకు నోటీసులు అంటిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లను కూడా సీజ్‌ చేస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అనుమతులు లేవంటూ.. రామవరప్పాడులో ఇటీవలే.. ప్రారంభించిన ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్‌ ను అధికారులు సీజ్‌ చేసి, స్కూల్‌ ముందు బ్యానర్‌ కూడా కట్టారు. అకస్మాత్తుగా స్కూల్‌ను మూసేస్తే తమ పిల్లల పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. స్కూల్‌ ను తెరిపించాలంటూ ధర్నాకు దిగారు.
*రోగులకు ఉచితంగా వైద్యం అందించాల్సిన ప్రభుత్వ వైద్యుడు లంచాల బాట పట్టాడు. చేతిలో డబ్బు పెడితే కానీ.. రోగిపై స్టెతస్కోప్‌ పెట్టడు ఆ డాక్టర్‌. లంచం ఇవ్వాలని రోగులను ఇబ్బంది పెడుతున్న ఆ వైద్యుడిని ఓ రోగి ఏసీబీ అధికారులకు పట్టించాడు.
*పర్యావరణ అనుమతుల సమ్మతి నివేదికలు సమర్పించనందుకు రాష్ట్రంలోని 2,680 గనులు, పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి(ఏపీపీసీబీ) నోటీసులు జారీ చేసింది. కేటగిరీ-బీ ప్రాజెక్టుల కోసం ఆరునెలలకు ఒకసారి ఈ నివేదికలు ఇవ్వాల్సి ఉండగా వరుసగా రెండు సార్లు సమర్పించనందుకు ఈ నోటీసులు జారీ చేసినట్లు ఏపీపీసీబీ తెలిపింది.
*మాతృభాషల పరిరక్షణ, అభివృద్ధి, ఆధునికీకరణ లక్ష్యంగా కృష్ణాజిల్లా రచయితల సంఘం సహకారంతో విజయవాడలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో డిసెంబరు 27, 28, 29 తేదీల్లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగనున్నాయి.
* విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృతంగా ఉన్న అంశాల తాజా పరిస్థితిని తెలియజేసే పత్రాన్ని (స్టేటస్ నోట్) రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం శాసనసభకు సమర్పించింది. అనగాని సత్యప్రసాద్ తదితర తెదేపా సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా 60 పేజీల పత్రాన్ని ప్రభుత్వం సభకు సమర్పించింది.
*దేశంలో ఐఐటీల తర్వాత ఇంజినీరింగ్ విద్యకు ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలతోపాటు కేంద్ర ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థ(సీఎఫ్టీఐ)ల్లో వందల సంఖ్యలో సీట్లు భర్తీకాకుండా మిగిలిపోయాయి.
*గ్రామసచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నియామకానికి ఏపీ ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. అన్ని రకాల విభాగాల్లో మొత్తం 1,28,589 పోస్టులను భర్తీ చేయనుంది. గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు సంబంధించి 95,088 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 9 విభాగాలకు సంబంధించి 33,501 పోస్టులు భర్తీ చేయనుంది. నేటినుంచి ఆగస్టు 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
*దిల్లీ, ముంబాయి, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగుళూరుల్లో రెండో విమానాశ్రయం రావాల్సిన అవసరం ఉందని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గురుప్రసాద్ మహాపాత్ర తెలిపారు.
*దేశంలో రాష్ట్రాల మధ్య తలెత్తే నదీ జలాల వివాదాలను దశాబ్దాలపాటు కొనసాగనివ్వరాదని, నిర్ణీత కాలవ్యవధిలో వాటిని పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కార బిల్లును తీసుకొచ్చింది.
*భావితరాల కోసమే గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్లకు మళ్లించాలనుకుంటున్నామని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి మంచి జరుగుతుందనుకుంటేనే ముందడుగు వేస్తామని, లేదనుకుంటే ఒక్క అడుగు కూడా వేయబోమని చెప్పారు.
*దేశంలో బాలలపై లైంగిక నేరాలు ఆందోళనకర రీతిలో పెరిగిపోతుండటాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది.
*కేంద్రం ఇచ్చే పింఛన్లు పెరగాల్సి ఉన్నట్టుగా వివిధ కమిటీలు, సుప్రీంకోర్టు స్పష్టం చేయటంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆ కోణంలో కసరత్తు చేపట్టింది. ఇటీవల ఒక భేటీని ఏర్పాటు చేసి రాష్ట్రాల అభిప్రాయాలనూ తెలుసుకొంది.
*రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఐడీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ సందర్భంగా వెలుగు చూసిన లోపాల ఆధారంగా నివేదిక రూపొందించనున్నారు. మూడేళ్ల క్రితం నమోదైన ఈ కేసుకు సంబంధించి ఇటీవల అభియోగపత్రం దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
*తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు ఏడుగురు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్న ఏడుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా సిఫార్సు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణలతో కూడిన కొలిజియం కేంద్రానికి గురువారం ప్రతిపాదనలు పంపింది.
* పొరుగు రాష్ట్రాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు నుంచి ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు 9,504 మంది విద్యార్థులు మైగ్రేషన్ ధ్రువపత్రాలు పొందారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే.. బోర్డు వీటిని మంజూరు చేస్తుంది. విద్యార్థులు ఆగస్టు వరకు దరఖాస్తు చేసుకుంటారని అధికారులు చెబుతున్నారు. 2018-19లో 12,138 మంది, 2017-18లో 10,123 మంది, 2016-17లో 10,414 మంది మైగ్రేషన్ ధ్రువపత్రాలు తీసుకున్నారు.
*అండమాన్ దీవుల సందర్శన కోసం భారతీయ రైల్వే పర్యటక, ఆతిథ్య సంస్థ (ఐఆర్సీటీసీ) ఆరు రోజుల కాల వ్యవధి కలిగిన ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. సెప్టెంబరు 6న మొదలయ్యే ఈ యాత్ర 11న ముగుస్తుందని తెలిపింది. పోర్ట్బ్లెయిర్, రాస్, ఉత్తర ద్వీపం, హ్యావ్లాక్ ద్వీపం, బరాతంగ్ ప్రాంతాల పర్యటన ఈ ప్యాకేజీలో ఉంటుంది. ఐఆర్సీటీసీ బుకింగ్ కేంద్రాలను సంప్రదించాలని ఆ సంస్థ సూచించింది.
*వచ్చే ఏడాది మే నెలలోగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈవీఎంలను భద్రపరచడానికి గోదాములు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. గోదాముల నిర్మాణంపై ఎన్నికల సంఘం సీనియర్ కన్సల్టెంట్ భన్వర్లాల్, తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ రజత్కుమార్ గురువారం సచివాలయంలో ప్రధాన కార్యదర్శిని కలిశారు.
* రాష్ట్రంలో ఇప్పటి వరకు 27,64,744 హెక్టార్లలో పంటలు సాగయ్యాయని సీఎస్ ఎస్కే జోషి పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులు, పంటలసాగు, రైతుబీమాపై గురువారం ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
* రాష్ట్రంలో పురపాలక సంఘాల్లో వార్డుల పునర్విభజనపై అభ్యంతరాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు 17 పట్టణ స్థానిక సంస్థల నుంచి హైకోర్టులో కేసులు దాఖలయ్యాయి. తాజాగా గురువారం గజ్వేల్ పురపాలక సంఘంలో కూడా వార్డుల పునర్విభజన సక్రమంగా జరగలేదని కొందరు హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఎన్నికలపై స్టే ఇచ్చింది. సమయం తక్కువగా ఉండటం, సిబ్బంది కొరత కారణంగా హడావుడిగా చేయడంతోనే వార్డుల పునర్విభజనలో సమస్యలు వచ్చాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు
*తమ ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే దాన్ని దెబ్బతీస్తోందని, ప్రజలు, రైతులతో వైరం పెంచుతోందని తెలంగాణ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేంద్రరావు అన్నారు.
*బీసీల డిమాండ్లను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్కు విన్నవించాయి.
*ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఈ నెల 16 నుంచి 20 వరకు జరిగిన ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ పోటీలో రాష్ట్ర పోలీసులు సత్తా చాటారు. మూడు బంగారు పతకాలు, రెండు కాంస్య పతకాలు, ఒక రజత పతకం, రెండు విన్నర్ ఛాంపియన్ షిప్ ట్రోపిలు సాధించారు.
*పశ్చిమబెంగాల్ ఉత్తర భాగం, దాని పరిసర ప్రాంతంలో 7.6 కి.మీ. ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావంతో పశ్చిమబెంగాల్లోని కోస్తాతీర ప్రాంతంలో శుక్రవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణతో పాటు రాష్ట్రంలోని కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
*రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వైస్ ఛైర్మన్, ఎండీగా ఐఎఫ్ఎస్ అధికారి గెడ్డం శేఖర్బాబును ప్రభుత్వం నియమించింది. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి మధుసూదన్రెడ్డి ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.