నిజామాబాద్ పసుపు పంట రైతుల సమస్యలపై జరిగిన సమావేశం అనంతరం ఎంపీ ధర్మపురి అర్వింద్ మీడియాతో మాట్లాడారు. రైతుల సమస్యలపై కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులతో ఒక సమగ్ర సమావేశం జరిగిందని, పసుపు పంట క్వాలిటీని పెంచేందుకు రైతులు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధికారులు వారికి సలహాలు సూచనలు ఇచ్చారని తెలిపారు.పసుపు రైతులకు మంచి గిట్టుబాటు ధర కల్పించి పునర్వైభవం సాధించే లాగా ఎటువంటి చర్యలు చేపట్టాలి అనేదానిపై సమావేశంలో చర్చించారన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు పై రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించే విషయంపై కూడా చర్చ జరిగిందని ఎంపీ అన్నారు. పసుపు రైతుల సమస్యలపై ఒక సమగ్ర నివేదికను త్వరలో అధికారులు కేంద్ర ప్రభుత్వానికి అందిస్తారని అర్వింద్ ఈ సందర్భంగా తెలిపారు.
పసుపు రైతుల్లారా…నివేదికలు సిద్ధం అవుతున్నాయి
Related tags :