తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన ఎన్నికల్లో నిర్మాత సి. కల్యాణ్ ‘మన ప్యానెల్’ విజయం సాధించింది. ప్రొడ్యూసర్ సెక్టార్‌కి సంబంధించి ప్యానెల్‌కు జరిగిన ఈ ఎన్నికల్లో ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, సి.కల్యాణ్ ప్యానెల్‌లు పోటీ పడ్డాయి. శనివారం ఉదయం పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 12 మంది ఈసీ సభ్యులలో సి. కల్యాణ్ ‘మన ప్యానెల్’కు చెందిన వారు 9 మంది, దిల్‌రాజు ‘యాక్టివ్ ప్యానెల్’కు చెందిన వారు ఇద్దరు గెలుపొందారు. 20 మంది సెక్టార్ సభ్యులలో మొత్తం 16 మంది సి. కల్యాణ్ ప్యానెల్ నుంచి గెలుపొందారు. నలుగురు దిల్‌రాజు ప్యానెల్ నుంచి విజయం సాధించారు. ఈసీ సభ్యులుగా దిల్‌రాజు, దామోదర్ గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా మోహన్ గౌడ విజయం సాధించారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల ఫలితాలు
Related tags :