రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని, దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. గుంటూరులో విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆమె విద్యుత్ సరఫరా వేళలను వివరించారు. గృహ అవసరాలకు నిరంతరాయంగా, వ్యవసాయానికి 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు సుచరిత తెలిపారు. వర్షాకాలంలో చెట్లు పడిపోవడం, తీగలు తెగిపోవడం వంటి కారణాలతో స్వల్ప అంతరాయం ఏర్పడుతోందని.. వీటిని విద్యుత్ కోతలుగా భావించరాదని చెప్పారు. విద్యుత్ అంతరాయ శాతాన్ని గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే గణనీయం తగ్గించగలిగామని ఆమె అన్నారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 200 యూనిట్లలోపు ఉచితంగా విద్యుత్ అందిస్తోందని.. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయని వివరించారు.
ఏపీలో విద్యుత్ కోతలు లేనే లేవు
Related tags :