ప్రముఖ బాలీవుడ్ నటుడు రాహుల్‌బోస్ ట్విటర్‌లో పోస్ట్ చేసిన అరటిపండ్ల వివాదంలో హోటల్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. సీజీఎస్టీలోని సెక్షన్ 11 నిబంధనలను అతిక్రమించి పండ్లను అధిక ధరకు విక్రయించినందుకు గానూ ఆ హోటల్‌కు రూ.25వేలు జరిమానా విధించారు. ఛండీగఢ్ వాణిజ్య పన్నుల శాఖ ఉపకమిషనర్ మణిదీప్ భర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన ఆ శాఖ సహాయ అధికారి రాజీవ్ చౌదరి హోటల్ యాజమాన్యం నిబంధనలు అతిక్రమించిందని తేల్చడంతో జరిమానా విధించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు రాహుల్‌బోస్ జులై 22న షూటింగ్‌లో భాగంగా ఛండీగఢ్ వెళ్లారు. అక్కడ ఒక ఫైవ్‌స్టార్ హోటల్ బస చేసిన ఆయన రెండు అరటిపండ్లు తీసుకురమ్మని హోటల్ సిబ్బందికి చెప్పారు. పండ్లు తీసుకువచ్చిన సిబ్బంది అతడికి రెండు పండ్లపై రూ.442.50 బిల్లు వేసి ఇచ్చారు. దీంతో కంగుతిన్న నటుడు అరటిపండ్లు ఆరోగ్యానికి హానికరం అంటూ వ్యంగ్యంగా వీడియో తీసి పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. దీనిపై ఛండీగఢ్ ఎక్సైజ్, పన్నుల శాఖ కమిషనర్ దృష్టి సారించి విచారణకు ఆదేశించారు.
అరటిపళ్ల హోటల్ దవడ పగలగొట్టిన అధికారులు-₹25వేలు జరిమానా
Related tags :