Politics

కాపు రిజర్వేషన్ అంశాన్ని తేల్చేసిన జగన్

YS Jagan Decides Reservation For Kapus

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కాపు రిజ‌ర్వేష‌న్ల విష‌యాన్ని తేల్చేసారు.

కేంద్ర ప్ర‌భుత్వం విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఆర్థికంగా వెనకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌)కు చెందిన వారికి 10 శాతం రిజర్వేషన్‌ అమలుపై రాష్ట్ర ప్ర‌భుత్వం స్పష్టత ఇస్తూ ఉత్తర్వులను జారీచేసింది.

దీని ద్వారా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తామిచ్చిన హామీ మేర కు ఈడబ్ల్యూఎస్ రిజ‌ర్వేన్ల‌లో అయిదు శాతం కాపుల‌కు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణ‌యం అమ‌లు చేయ‌టం లేద‌ని ఏపీ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

5% రిజర్వేషన్‌ అమలు చేయలేమ‌ని తేల్చేసింది. ఈడబ్ల్యూఎస్‌లో విభజన కుదరదు అని జీవ‌లో పేర్కొంది.

దీంతో..ఇప్పుడు ఆ ప‌ద‌వి శాతం ఈడబ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్లు అంద‌రికీ అమ‌ల‌య్చేలా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

దీనికి సంబంధించి విధి విధానాల‌ను ఖ‌రారు చేసింది.