ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో గోల్డెన్ బాబా 26వ కావడి యాత్ర ఆదివారం వైభవంగా సాగింది. పటిష్ఠ పోలీసు భద్రత మధ్య ఒంటి మీద 16 కిలోల బంగారంతో బాబా యాత్రలో పాల్గొన్నారు. యాత్ర సాగుతున్నంత సేపు బాబాను చూడడానికి, ఆయనతో స్వీయచిత్రాలు తీసుకోవడానికి భక్తులు, ప్రజలు పోటీపడ్డారు. శివుడి భక్తుడైన గోల్డెన్ బాబా ఏటా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నుంచి పవిత్ర జలం తీసుకొచ్చి దిల్లీలోని దేవాలయంలో సమర్పిస్తారు. 30 రోజులపాటు ఈ యాత్ర సాగుతుంది. సాధారణంగా 21 కిలోల బంగారంతో యాత్ర చేసే బాబా.. ఈ సారి 16 కిలోల బంగారం మాత్రమే ధరించారు. ‘‘ఇది నా 26వ కావడి యాత్ర. ప్రస్తుతం ఒంటి మీద 16 కిలోల బంగారం ఉంది. ఈ మధ్య మెడకు రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. వైద్యులు ఎక్కువ బరువు మోయకూడదని సూచించారు’’ అని గోల్డెన్ బాబా చెప్పారు. బాబా 2013 వరకు వస్త్ర, స్థిరాస్తి వ్యాపారం చేసేవారు. 2013లో కుంభమేళాకు వెళ్లి.. అప్పటి నుంచి వ్యాపారాలన్నీ మూసేసి బాబా అవతారం ఎత్తారు. కావడి యాత్ర మాత్రం అంతకుముందు నుంచే చేపడుతున్నారు.
16కిలోల బంగారం వేసుకుని ఊరేగింపు
Related tags :