గుంటూరు జిల్లా పిడుగురాళ్ళకి చందిన నరసింహారావు అదే ప్రాంతానికి చెందిన ఏజెంట్ సైదారావ్ చేతిలో మోసపోయి మూడు నెలలుగా మలేషియా లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈనాడు దినపత్రిక ఈ విషయాన్ని ప్రచురించడంతో ఇది వెలుగులోనికి వచ్చినది. ఈ విషయం తెలుసుకున్న మలేషియా మైగ్రేట్ వింగ్ ముఖ్య కార్యవర్గ సభ్యులు ప్రతీక్ కుమార్ , శ్రీనివాస్, సందీప్ గౌడ్ , మధు కలిసి ఆదివారం రోజున నరసింహారావు కి సంబందించిన అన్ని వివరాలు సేకరించి సోమవారం నాడు ఇండియన్ హైకమిషన్ కి సమర్పించి వచ్చే వారం 7వ తారీకు న చెన్నై వెళ్లే విధముగ అన్ని ఏర్పాట్లను చేసారు అదే విధముగా దీనికోసం అయిన ఫ్లైట్ చార్జీలను మలేషియా తెలంగాణ అసోసియేషన్ పూర్తిగా భరించింది అని మలేషియా తెలంగాణ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సహకరించిన మలేషియా తెలంగాణ అసోసియేషన్ సభ్యులకూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
గుంటూరు యువకుడిని ఇంటికి పంపిన మలేషియా తెలంగాణా సంఘం
Related tags :