భారత నౌకాదళంలో మరో కొత్త నౌక వచ్చి చేరింది. ఇండియన్ నేవీలో సేవలందించేందుకు విశాఖ నేవల్ డాక్ యార్డు నుంచి ఐఎన్ ఎల్సీయూఎల్-56 సముద్రంలోకి ప్రవేశించింది. తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ ఎల్సీయూల్-56 నౌకను ప్రారంభించారు. పోర్టు బ్లెయిర్ కమాండ్‌లో ఈ నౌక సేవలందించనుంది. తీర ప్రాంత భద్రతలో కీలకంగా పని చేయనుంది. జవాన్లు, యుద్ధ ట్యాంకులను ఒక చోటు నుంచి మరోచోటికి చేర్చడంలోను, అత్యవసర సమయాల్లో సహాయక చర్యలు అందించడంలోనూ ఎల్సీయూల్-56 సేవలను వినియోగించుకోనున్నారు.
భారత నావికాదళంలోకి నూతన అస్త్రం

Related tags :