*టెలికం రంగంలోని అన్ని కంపెనీల మధ్య న్యాయబద్ధమైన పోటీ ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోందని, గుత్తాధిపత్యాన్ని అనుమతించబోమని కేంద్ర టెలికంశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. సేవల్లో నాణ్యతను మరింత పెంచాలని, 5జీ టెక్నాలజీని అందించడానికి కృషి చేయాలని స్పష్టం చేశారు. ఢిల్లీలో శనివారం మంత్రి టెల్కోల సీఈఓలతో భేటీ అయిన సందర్భంగా ఈ సూచనలు చేశారు. టెల్కోలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సుంకాల తగ్గింపు, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్లు ఇవ్వడం, జీఎస్టీ తగ్గింపు, యూనివర్సల్ సర్వీస్ ఓబ్లిగేషన్ తగ్గింపు వంటి ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు.
*ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ రూ.1188 మధురం ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఇవాళ ప్రవేశపెట్టింది. ఇందులో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఉచిత నేషనల్ రోమింగ్, 5 జీబీ డేటా, 1200 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 345 రోజులుగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ ప్లాన్ కేవలం తమిళనాడు సర్కిల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండగా.. త్వరలోనే ఇతర సర్కిళ్లకు చెందిన వినియోగదారులకు కూడా ఈ ప్లాన్‌ను అందివ్వనున్నారు.
*భారత మార్కెట్లోకి ‘కవాసకీ డబ్ల్యూ800 స్ట్రీట్’
ప్రముఖ మోటార్‌సైకిల్స్ తయారీ సంస్థ కవాసకీ మోటార్స్ సరికొత్త కవాసకీ డబ్ల్యూ800 స్ట్రీట్ రెట్రో స్టైల్డ్ మోటార్ సైకిల్‌ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్ షోరూం)గా ఉంది. దీనికి సంబంధించి బుకింగ్స్ మొదలైనట్లుగా ఇండియా కవాసకీ మోటార్స్ ప్రకటించింది. ఈ మోడల్‌పై అభిప్రాయాలు సేకరించే ప్రక్రియలో భాగంగా 2015లో భారత్‌లో ప్రదర్శించినప్పటికీ భారత మార్కెట్లోకి రావడానికి ఈ మోడల్‌కి నాలుగేళ్లు పట్టింది.
*ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించింది. మిగులు ద్రవ్యం, తగ్గుతున్న వడ్డీరేట్లను ఇందుకు కారణంగా చూపింది. తక్కవ కాలపరిమితి కలిగిన (179 రోజుల్లోపు) డిపాజిట్లపై 50 నుంచి 75 బేసిస్ పాయింట్లను తగ్గించింది.
*దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. వరుస ఆరు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం చెక్ చెప్పినా, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో నేడు భారీగా నష్టపోతున్నాయి. 360 పాయింట్లకు పోయిగా నష్టపోయిన సెన్సెక్స్ ప్రస్తుతం 200 పాయింట్లకు పైగా కోలుకుని 177 పాయింట్లు పతనమై 37,709 వద్ద, నిఫ్టీ 80 పాయింట్ల వెనకడుగుతో 11,203 వద్ద ట్రేడవుతోంది. ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్ష, అమెరికా- చైనా మధ్య వాణిజ్య చర్చలపై సందేహాల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి.
* ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తొలిసారిగా సంప్రదాయ విపణిలోనూ అడుగుపెట్టబోతోంది. ఇందులో భాగంగా బెంగళూరులో తొలి ఫర్నిచర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయబోతోంది.
*విద్యుత్ వాహనాల (ఈవీ) ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు హీరో ఎలక్ట్రిక్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందుకోసం వచ్చే మూడేళ్లలో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. ప్రస్తుతం ఏడాదికి 1 లక్ష విద్యుత్ స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యం ఉండగా, దీన్ని మూడు, నాలుగేళ్లలో 5 లక్షల స్కూటర్లకు పెంచాలని కంపెనీ భావిస్తోంది.
* స్థిరాస్తి విపణి నెమ్మదించినప్పటికీ గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ జేఎల్ఎల్ ఇండియా ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.4000 కోట్లకు పెరిగింది. వృద్ధి జోరు కొనసాగించడానికి వచ్చే ఏడాది చివరికి మరో 2000 మంది ఉద్యోగులను నియమించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
*పసిడి ఫ్యూచర్ కాంట్రాక్టు గత సోమవారం రూ.35,695 వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా జోరు కొనసాగిస్తూ రూ.35,764 వద్ద వారం గరిష్ఠాన్ని చేరింది. అనంతరం అమ్మకాల ఒత్తిడికి లోనై రూ.35,289 స్థాయికి దిగివచ్చింది.
*రాగి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.451.55 కంటే పైన చలిస్తే మరింత ముందుకెళ్లి రూ.457.25ను అందుకోవచ్చు. అందువల్ల రూ.444 దిగువన స్టాప్లాస్ పెట్టుకుని, లాంగ్ పొజిషన్లు కొనసాగించొచ్చు. అదే సమయంలో రూ.454 కంటే పైన మరిన్ని లాంగ్ పొజిషన్లు జతచేసుకోవచ్చు.
*ముడి చమురు ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.3,961 కంటే ట్రేడ్ కాకుంటే మరింత కిందకు దిగిరావచ్చు. రూ.3,183; రూ.3,748 వరకు పడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ రూ.3,988 పైన చలిస్తే రూ.4,048; ర.4,109 వరకు పెరిగేందుకూ ఆస్కారం ఉంది.
*గోరు చిక్కుడు ఆగస్టు కాంట్రాక్టుకు ఈవారం అధిక స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల రూ.4088 వరకు దిగిరావచ్చు. సోయాబీన్ ఆగస్టు కాంట్రాక్టు ఈవారం కూడా రాణించే అవకాశం ఉంది. జీలకర్ర ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.18,298 వరకు పెరిగే అవకాశం ఉంది.
*ఆర్థికంగా బలంగా ఉన్న 3-4 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను (ఆర్ఆర్బీలు) స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే వీటిని పబ్లిక్ ఇష్యూకు తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
*ఆర్థికంగా బలంగా ఉన్న 3-4 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను (ఆర్ఆర్బీలు) స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
5Gకి గెట్ రెడీ-వాణిజ్య-07/29
Related tags :