* దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యువతకు ఉద్యోగాలు ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టారని… కానీ ఆయన కుమారుడు సీఎం జగన్ మాత్రం ప్రజల పొట్టగొడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ నేతలు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను అనంతపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారం బీజేపీదేనని కన్నా ధీమా వ్యక్తం చేశారు. రాజన్న పాలన తెస్తామంటూ జగన్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండటం లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడలేకపోవడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని మండిపడ్డారు. టీడీపీ, జనసేనల నుంచే కాకుండా వైసీపీ నుంచి కూడా చాలా మంది నేతలు బీజేపీలో వచ్చి చేరుతున్నారని చెప్పారు.కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక వసతులు కల్పించాల్సి ఉందని… ఆ విషయంలో చంద్రబాబు చేసిన జాప్యం వల్లే అనంతపురం సెంట్రల్ యూనివర్శిటీ వెనుకబడిందని చెప్పారు. అనంతరం కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు మాట్లాడుతూ… బీజేపీలో చేరడానికి అన్ని పార్టీల నేతలు ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. టీడీపీ నుంచి రాబోయే కాలంలో ఇంకొంత మది మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేరనున్నారని చెప్పారు. టీడీపీ ఇప్పుడు చచ్చిన పాములాంటిదని అభిప్రాయపడ్డారు. గోదావరి జలాలను తెలంగాణకు తరలించాలన్న ప్రతిపాదన బాగున్నప్పటికీ.. ఏపీ నష్టం జరిగితే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు.
* జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన నారా లోకేష్
మద్యపాన నిషేధం అంశంలో వైసీపీ ప్రభుత్వ వైఖరిపై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ మద్యపాన నిషేధం అమలు చేస్తారంటే ఏదో అనుకున్నాం కానీ.. ప్రభుత్వమే మద్యం షాపులు తెరుస్తుందని ఊహించలేదని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ‘‘గతం కంటే ఆదాయం మరో రూ.2,297 కోట్లు గడిస్తారని, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బేవరేజెస్ కార్పొరేషన్ రిపోర్ట్‌కి మీ పార్టీ కలర్ వేయిస్తారని అర్థం చేసుకోలేకపోయాం’’ అంటూ తీవ్ర పదజాలంతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘మీరు చేస్తున్నది మధ్యపాన నిషేధమా..? లేక ‘నిషా’దమ్మా..? అని లోకేష్ ధ్వజమెత్తారు.
*డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేల సంతకాలు ఫోర్జరీ…
మధ్యప్రదేశ్లో అధికార కాంగ్రెస్పార్టీ సాక్షాత్తూ అసెంబ్లీ సాక్షిగా 8 నుంచి12 మంది ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేసిందని ప్రతిపక్ష బీజేపీ మండిపడింది. అసెంబ్లీలో క్రిమినల్లా (మధ్యప్రదేశ్అమెండ్మెంట్) బిల్లు, 2019పై ఓటింగ్ సందర్భంగా కాంగ్రెస్ఎమ్మెల్యేలు గైర్హాజరు అయినా, సభకు హాజరై ఓటింగ్లో పాల్గొన్నట్లు చూపేందుకు ముఖ్యమంత్రి కమల్నాథ్ ప్రభుత్వం వాళ్ల సంతకాలను ఫోర్జరీ చేసిందని ఆదివారం ప్రతిపక్ష నేత గోపాల్భార్గవ ఆరోపించారు. క్రిమినల్ లా(మధ్యప్రదేశ్అమెండ్మెంట్) బిల్లు, 2019పై బుధవారం ఓటింగ్నిర్వహించగా, ప్రభుత్వానికి అనుకూలంగా 122 ఓట్లు పడ్డాయి.
*విద్వేషాలు రెచ్చగొట్టి గెలవలేరు: మోడీ
‘‘కాశ్మీర్లో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు, అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న వారు ఎన్నటికీ గెలవలేరు. ఎందుకంటే బాంబులు, బుల్లెట్ల కన్నా ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు బలమెక్కువ” అని ప్రధాని నరేంద్ర మోడీ ‘‘గత జూన్లో జమ్మూకాశ్మీర్లో ‘బ్యాక్ టు విలేజ్’ పేరుతో ఓ ప్రోగ్రామ్ నిర్వహించాం. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై స్థానికులతో చర్చించేందుకు ప్రభుత్వ అధికారులు అక్కడికి వెళ్లారు. దానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. చాలా సెన్సిటివ్, రిమోట్ ఏరియాల్లోని ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్లో పాల్గొనేందుకు ప్రజలు ఎంత ఆసక్తి చూపుతున్నారో చెప్పేందుకు ఇదే నిదర్శనం.
*అధికారంలోకి వచ్చినా ‘ఫేక్’ బతుకు మారలేదు : నారా లోకేష్
జగన్ సర్కారుపై వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్. రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. వైసీపీ నేతలు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామనుకుంటున్నారంటూ ట్విటర్ ద్వారా ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ‘ఫేక్’ బతుకు మారలేదని.. అసత్యాలతో కాలం నెట్టుకొస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని దెబ్బతీయడానికి అనవసర ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు…తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎదిగిన చరిత్ర వైసీపీ నాయకుడిదంటూ పరోక్షంగా సీఎం జగన్‌నుద్దేశించి విమర్శలు చేశారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా ఏరోజూ అటువైపు చూడకుండా స్వచ్ఛమైన మనసు, నీతి, నిజాయతీతో నందమూరి బాలకృష్ణ ఎదిగారన్నారు . అలాంటి వ్యక్తి రాజధానిలో భూములు కొన్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని, దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు లోకేష్. నిరూపించలేకపోతే రాజధాని రైతులకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారాయన…మరోవైపు… స్టిక్కర్ ముఖ్యమంత్రి అంటూ… జగన్మోహన్‌రెడ్డిని సంబోధించారు లోకేష్. స్టిక్కర్ ముఖ్యమంత్రి గారి బృందం వారి మాటలు నిజంగా ఓ పెద్ద కామిడీలో ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. తన ట్విట్టర్‌లో. పొలిటికల్ కామిడీ వీడియోను పోస్ట్ చేశారు లోకేష్.. మొత్తానికి లోకేష్….. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత… తన పదునైనా బాణాల్లాంటి ట్వీట్లతో… జగన్ సర్కారును విమర్శిస్తున్నారు లోకేష్.
*కాపు రిజర్వేషన్లపై జగన్ ఫోకస్: కాపు నేతలతో భేటీ………
కాపు కార్పోరేషన్‌కు నిధులు, అగ్రవర్ణ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి వైసీపీలోని కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ భేటీకి కాపు నేతలు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, ఆళ్ల నాని, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాయుడు సహా పలువురు నేతలు హాజరయ్యారు.కాపు రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వడంతో పాటు అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వం ఇచ్చిన జీవోపై నేతలు చర్చించారు. దీనితో పాటు కాపు కార్పోరేషన్‌కు రూ. 2 వేల కోట్లు కేటాయించినట్లుగా మంత్రులు నేతలతో దృష్టికి తీసుకెళ్లారు. భేటీ అనంతరం సీఎం జగన్‌తో కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.
*ఉత్తమ్ తో మంతనాలు… మాజీ ఎంపీ వివేక్ యూటర్న్?
మాజీ ఎంపీ వివేక్ యూటర్న్ తీసుకోనున్నారా? ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. ఇలాంటి సందేహాలే అందరికీ కలుగుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఏ పార్టీలో చేరకుండా సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న వివేక్…. ఇటీవలే బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు. బీజేపీ జాతీయాధక్షుడు అమిత్ షాతో భేటీ అయ్యి.. త్వరలో పార్టీలో చేరతానని కూడా ప్రకటించారు. కాగా… తాజాగా ఆయన టీపీసీసీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు.ఆదివారం ఉత్తమ్..వివేక్ ఇంటికి వెళ్లి మరీ దాదాపు గంటపాటు మంతనాలు జరిపారు. తమ పార్టీలో చేరాల్సిందిగా ఉత్తమ్ వివేక్ ని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరడం ఖాయమని అందరూ భావించిన సమయంలో ఇలా ఉత్తమ్ తో చర్చలు జరపడం రాజకీయంగా ఆసక్తి రేకెత్తించాయి. అయితే… వివేక్ కాంగ్రెస్ లో చేరతారా..? బీజేపీ వైపు మెగ్గు చూపుతారో తేలాల్సింది. మరో రెండు, మూడు రోజుల్లో ఈ విషయంపై స్పష్టత రానుంది.
*అందుకే యోగిని సీఎం చేశాం: అమిత్ షా………
‘యోగికి పాలనా పరంగా ఎలాంటి అనుభవంలేదు.. నిజమే. వర్క్పట్ల కమిట్మెంట్ మాత్రం చాలా ఎక్కువ. ఆ కమిట్మెంటే యోగిని సీఎం చేసింది’ అని కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆదివారం వెల్లడించారు. లక్నోలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ను యూపీ సీఎంగా ఎన్నుకోవడానికి సంబంధించిన విషయాలను షా ప్రస్తావించారు. ‘2017లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ప్రధాని మోడీని యూపీ ప్రజలు ఎంత గా నమ్ముతున్నారో ఈ విజయం చెప్పింది.
*మేమంటే ఎందుకంత కసి: జగన్‌పై జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలు..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడానికి కాపులు కూడా కారణమని.. కానీ జగన్ మాత్రం కాపు సామాజిక వర్గంపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన పది శాతం రిజర్వేషన్‌లో 5 శాతం కాపుకు వర్తింపజేస్తూ టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన తీర్మానాన్ని నెహ్రూ గుర్తు చేశారు.కానీ జగన్ మాత్రం కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యపడదని కసి తీర్చుకోవడమేనని ఆయన దుయ్యబట్టారు. టీడీపీ కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ అమలు జరిగేలా వైసీపీ ప్రభుత్వం.. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నెహ్రూ డిమాండ్ చేశారు.
*రమాదేవికి క్షమాపణలు చెప్పిన ఆజంఖాన్…….
బీజేపీ ఎంపీ రమాదేవిపై తాను చేసిన వ్యాఖ్యలపై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్ క్షమాపణలు చెప్పారు. రమాదేవి తనకు సోదరి లాంటి వారనీ.. తప్పుగా మాట్లాడుంటే క్షమించాలని కోరారు.సోమవారం లోక్‌సభ ప్రారంభానికి ముందు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆజమ్‌ఖాన్‌లు లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లాను కలిశారు. కాగా … లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆజంఖాన్… డిప్యూటీ స్పీకర్ రమాదేవిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ సహా ఇతర పార్టీల మహిళా ఎంపీలు ఆజంఖాన్‌పై మండిపడ్డారు.
* ఎంత కాలం ఉంటారో చూస్తాం: యడియూరప్పపై సిద్దూ……..
అధికారంలో మీరు ఎంతకాలం ఉంటారో మీకే తెలియదని సీఎం యడియూరప్పను మాజీ సీఎం సిద్దరామయ్య సెటైర్లు వేశారు. కర్ణాటక అసెంబ్లీలో సోమవారం నాడు సీఎం యడియూరప్ప విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై కాంగ్రెస్ పక్ష నేత మాజీ సీఎం సిద్దరామయ్య ప్రసంగించారు.ఏనాడూ కూడ ప్రజల తీర్పు మేరకు యడియూరప్ప సీఎం కాలేదని సిద్దరామయ్య విమర్శించారు. 2008, 2018 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును సిద్దరామయ్య ప్రస్తావించారు. యడియూరప్ప సీఎంగా ప్రమాణం చేసిన సమయంలో సభలో 222 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. బీజేపీకి 112 మంది ఎమ్మెల్యేల మెజారిటీ ఉందా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి కేవలం 105 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఇది ప్రజల తీర్పా అని ఆయన ప్రశ్నించారు.ప్రజా సమస్యల పరిష్కారంలో అందరిని కలుపుకుపోతామని సీఎం యడియూరప్ప చేసిన వ్యాఖ్యలను ఆయన స్వాగతించారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని సిద్దరామయ్య సూచించారు.రైతుల సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయని సిద్దరామయ్య గుర్తు చేశారు. కుమారస్వామి విశ్వాస పరీక్ష సమయంలో నాలుగు రోజుల పాటు చర్చించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.ఈ విషయమై తాను లేవనెత్తబోనన్నారు. యడియూరప్ప సీఎంగా ఎన్నికైన పరిస్థితులపైనే మాట్లాడుతానని సిద్దరామయ్య చెప్పారు.ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యాయమని సిద్దరామయ్య అభిప్రాయపడ్డారు. ప్రజల కోసం తాను, కుమారస్వామి కూడ శక్తివంచన లేకుండా ప్రయత్నించిన విషయాన్ని సిద్దరామయ్య గుర్తు చేశారు. కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వం కామన్ మినిమమ్ ప్రోగ్రాం ను అమలు చేసేందుకు పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
* నోటికి ప్లాస్టర్ వేసుకుంటా: జగన్‌కు ముద్రగడ ఘాటు లేఖ………
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈబీసీ కోటాలో 5 శాతం రిజర్వేషన్లపై … ఏ కోర్టు స్టే ఇచ్చిందో సీఎం జగన్ చెబితే సంతోషిస్తానన్నారు.న్యాయస్థానం స్టే ఉంటే తిరిగి ఎన్నికలు వచ్చే వరకు కాపుల హక్కులు, డిమాండ్లను అడగకుండా నోటికి ప్లాస్టర్ వేసుకుంటానని ముద్రగడ ఘాటుగా పేర్కొన్నారు. కాపు జాతి ఎటువంటి కోరికలు లేకుండా బానిసలుగా బతకాలా..? అని పద్మనాభం ప్రశ్నించారు.మీరు ఎన్నికల హామీలో చెప్పిన రూ. 2 వేల కోట్లకు ఆశపడి.. కాపులు మీకు ఓటేశారని భావిస్తున్నారా అంటూ ఆయన మండిపడ్డారు. కాగా.. కాపు రిజర్వేషన్లపై వైసీఎల్పీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం భేటీ అయ్యారు.కాపు రిజర్వేషన్లతో పాటు పాటు ఈబీసీ బిల్లుపై వారు చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌తో పాటు ఎమ్మెల్యే అంబటి రాంబాబు తదితర కాపు నేతలు హాజరయ్యారు.
* కాపు రిజర్వేషన్ల సెగ: ముగ్గురు సభ్యులతో కమిటీ వేసిన జగన్……….
కాపులకు రిజర్వేషన్ కల్పించే అంశంపై వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించారు. ఈ కమిటీలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కన్నబాబు, అంబటి రాంబాబు ఉంటారు. కాపు రిజర్వేషన్లు, కేంద్ర చట్టంపై ఈ కమిటీ అధ్యయం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.కాపు రిజర్వేషన్లపై వైసీఎల్పీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం భేటీ అయ్యారు. కాపు రిజర్వేషన్లతో పాటు పాటు ఈబీసీ బిల్లుపై వారు చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌తో పాటు ఎమ్మెల్యే అంబటి రాంబాబు తదితర కాపు నేతలు హాజరయ్యారు.అనంతరం కాపు నేతలు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. వీరిని ఉద్దేశించి మాట్లాడిన జగన్.. కాపు రిజర్వేషన్లపై రాష్ట్రప్రభుత్వ వైఖరిని కోరుతూ.. ఏప్రిల్ 4న కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖను ప్రస్తావించారు. అయితే ఆ లేఖకు నాటి సీఎం చంద్రబాబు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని నేతలు తెలిపారు.
* స్పీకర్ రమేశ్ కుమార్ రాజీనామా
కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. కన్నడనాట కమలనాథులు బల పరీక్షలో నెగ్గిన కాసేపటికే స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్ కృష్ణారెడ్డికి సమర్పించారు. రమేశ్ కుమార్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయానికి సభలోని సభ్యులందరూ షాక్‌కు గురయ్యారు. రాజీనామా పత్రాన్ని ఇచ్చిన అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో ఇప్పటి నుంచి తాత్కాలిక స్పీకర్‌గా కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని సాయంత్రం 5గంటలకు వాయిదా వేశారు. ఈ సందర్భంగా రమేశ్‌కుమార్ భావోద్వేగంతో మాట్లాడారు.
* కాపులకు ద్రోహం చేసిందెవరో మీకు తెలీదా.. జ్యోతుల నెహ్రూ కి విజయసాయి పంచ్….
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ల విషయంపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. కాపులకు అన్యాయం చేశారంటూ… ప్రతిపక్ష నేతలు అధికార వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా… అసలు అన్యాయం చేసింది తాము కాదని… అదంతా టీడీపీ చలవేనంటూ అధికార పార్టీ నేతలు సమర్థించుకుంటున్నారు.కాగా… తాజాగా ఈ విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాపులకు ద్రోహం చేసింది ఎవరో మీ అంతరాత్మనే అడగండి అంటూ టీడీపీ నేత జ్యోతుల నెహ్రూని విజయసాయి ప్రశ్నించారు. పదవి, ప్యాకేజీ కోసం మీరు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది వాస్తం కాదా అని ప్రశ్నించారు. అసాధ్యమనీ తెలిసీ 5శాతం రిజర్వేషన్ ప్రకటిస్తే… చంద్రబాబుని పొగిడింది మీరు కదా అని అన్నారు. ఇప్పుడు ఎవరు ఉసిగొలిపితే… జ్యోతుల ఇలా విమర్శలు చేస్తున్నారో అందరికీ తెలుసునని విజయసాయి పేర్కొన్నారు.
* జైపాల్ రెడ్డికి సంతాపం: భావోద్వేగానికి గురైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం నాడు భావోద్వేగానికి గురయ్యారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి మృతికి సంతాపం తెలిపే సమయంలో వెంకయ్యనాయుడు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఆదివారం నాడు తెల్లవారుజామున మృతి చెందాడు. సుదీర్ఘకాలం పాటు పార్లమెంట్ సభ్యుడిగా జైపాల్ రెడ్డి పనిచేశారు. జైపాల్ రెడ్డి మృతికి పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం నాడు మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మృతికి సంతాపం తెలిపాయి.రాజ్యసభలో జైపాల్ రెడ్డి సంతాపం తీర్మానం ప్రవేశపెట్టే సమయంలో రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు భావోద్వేగానికి గురయ్యాడు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తామిద్దరం అసెంబ్లీలో సభ్యులుగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.
* ఆ రెండు రాష్ట్రాల్లోనూ ‘ఆపరేషన్ కమల్’!
రాజస్థాన్ రాష్ట్రాల్లో త్వరలో కొత్త ‘మిషన్’ ప్రారంభం అవుతుందంటూ భాజపా ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్వర్గీయ భవిష్యత్తు వ్యూహాలపై సంకేతాలిచ్చారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ సర్కారుకు కర్ణాటక తరహా ముప్పు పొంచి ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆదివారం ఆయన రాజస్థాన్లోని జైపుర్లో విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ భాజపా సరికొత్త ఆపరేషన్ చేపడుతుందని వెల్లడించారు. ‘‘కర్ణాటకలో మంత్రిమండలి పనిపూర్తి కానివ్వండి. తర్వాత కొత్త మిషన్ ప్రారంభం అవుతుంది.’’ అని చెప్పారు.
* ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామనుకుంటున్నారు: లోకేశ్
వైకాపా నేతలు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామనుకుంటున్నారని, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తప్పుడు ప్రచారంతో కాలం నెట్టుకొస్తున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. ‘తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎదిగిన చరిత్ర మీ నాయకుడిది. తండ్రి సీఎంగా ఉన్నా అటు వైపు చూడకుండా బాలకృష్ణ నీతి, నిజాయతీతో ఎదిగారు. అటువంటి వ్యక్తి రాజధానిలో భూములు కొన్నారని ఆయనపై ఆరోపణలు చేశారు.
* మానవ అక్రమ రవాణాపై యుద్ధం చేయాలి -ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు
మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా పోరాటం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, చిట్టచివరి వ్యక్తిని రక్షించేందుకు కృషిచేయాలని సూచించారు. బాధితులను రక్షించడం, వారికి పునరావాసం కల్పించడంతో లక్ష్యం నెరవేరదని, జనజీవన స్రవంతిలో సాధారణ జీవితం గడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు.మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ, మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ‘ప్రజ్వల’ వ్యవస్థాపకురాలు సునీతాకృష్ణన్ రూపొందించిన ‘వ్యభిచారం కోసం అక్రమ రవాణాకు గురైన బాధితుల సంరక్షణ గృహాల నిర్వహణ నిబంధన, నియమావళి’ని కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ సహాయ మంత్రి దేబశ్రీచౌధురి, తెలంగాణ సీఎస్ ఎస్కే జోషి, మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి జగదీశ్వర్తో కలిసి హైదరాబాద్లో ఆదివారం విడుదల చేశారు.
*తొలి వేతనం రైతుల కోసమే
పార్లమెంటు సభ్యునిగా తనకొచ్చే తొలి నెల వేతనాన్ని రైతుల కోసమే ఖర్చు చేస్తానని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు చెప్పారు. నిర్మల్లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పేద రైతు కుటుంబానికి చెందిన తనకు రైతుల సమస్యలు తెలుసని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ప్రతి మండలం నుంచి ఒక ఆదర్శ రైతును భాజపా ఆధ్వర్యంలº ఎంపిక చేసి, వారికి రూ.2,500 చొప్పున అందిస్తానని తెలిపారు.
*కాంగ్రెస్లోకి తిరిగి రండి
కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్ను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆహ్వానించారు. హైదరాబాద్లో ఆదివారం వివేక్తో ఆయన నివాసంలో ఉత్తమ్ భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు వీరి సమావేశం జరిగింది. పార్లమెంటు ఎన్నికల తర్వాత వివేక్ తెరాసకు రాజీనామా చేశారు. తర్వాత ఏ పార్టీలో చేరలేదు. ఇటీవల భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్షాతో దిల్లీలో భేటీ అయ్యారు. దీంతో ఆయన భాజపాలో చేరతారనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఉత్తమ్.. వివేక్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
*బిల్లులపై విపక్షాల అభ్యంతరం అర్థరహితం: భాజపా
పార్లమెంటరీ కమిటీల పరిశీలనకు పంపకుండానే కేంద్ర ప్రభుత్వం బిల్లులను ఆమోదింపచేసుకుంటోందన్న ప్రతిపక్షాల విమర్శలను భాజపా ఖండించింది. సమగ్ర పరిశీలన జరపకుండానే బిల్లులను హడావుడిగా ఆమోదిస్తున్నారని ఆరోపిస్తూ 17 పార్టీల నాయకులు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు లేఖ రాయడంపై భాజపా ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు భూపీందర్ యాదవ్ స్పందించారు. ప్రతిపక్షాల అభ్యంతరం ఏమిటో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. యూపీఏ ప్రభుత్వం 2009-14 మధ్య కేవలం అయిదు బిల్లులను మాత్రమే పార్లమెంటరీ కమిటీలకు పంపిస్తే తమ ప్రభుత్వం 2014-19 మధ్య 17 బిల్లులను పంపించిందని చెప్పారు.
*నీటి కరవు తీరుతుంది
వచ్చే రెండు నెలలు సమృద్ధిగా వర్షాలు పడతాయని.. తెలంగాణ ఈ ఖరీఫ్లో కరవు బారి నుంచి పూర్తిగా బయటపడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు చేరుతుందని.. పంటలకు ఢోకా ఉండదనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ప్రాజెక్టుల్లోకి నీరు, వర్షాల పరిస్థితిపై ఆదివారం ఆయన తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. జలాశయాలవారీగా నీటిమట్టాల సమాచారాన్ని ఈ సందర్భంగా సీఎం తీసుకున్నారు. జిల్లాలవారీగా వర్షాల స్థితిగతులపై ఆరా తీశారు.
*కత్తి ఝుళిపించిన కర్ణాటక స్పీకర్
కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలకు కారణమైన అసమ్మతి ఎమ్మెల్యేలపై స్పీకర్ కె.రమేశ్కుమార్ కొరడా ఝుళిపించారు. ప్రజాప్రతినిధుల హక్కులను దుర్వినియోగం చేసినట్లు నిర్ధరిస్తూ 15వ విధానసభ కాలపరిమితి ముగిసేంత వరకు 14 మంది సభ్యులపై అనర్హత వేటు వేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2) ప్రకారం కాంగ్రెస్కు చెందిన 11 మంది, జేడీఎస్ సభ్యులు ముగ్గురిపై ఈ చర్య తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆదివారం స్పీకర్ రమేశ్కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనం రేపింది. వారు ఆయా పార్టీల విప్లను ఉల్లంఘించి సభకు గైర్హాజరయ్యారు. గత గురువారం ఇద్దరు కాంగ్రెస్, ఓ స్వతంత్ర శాసనసభ్యుడిని స్పీకర్ అనర్హులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. వీరితో కలిపి మొత్తం 17మందిపై అనర్హత వేటు పడింది. ఇదే సమయంలో సోమవారం విశ్వాస పరీక్షను భాజపా సులువుగా గట్టెక్కే పరిస్థితి కనిపిస్తోంది.
*ప్రవాస నూతన విధానం చేపట్టాలి
తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ప్రవాస విధానాన్ని సత్వరమే చేపట్టాలని తెరాస కువైట్ విభాగం కోరింది. ఈ మేరకు అధ్యక్షురాలు గొడిశాల అభిలాష శనివారం హైదరాబాద్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు వినతిపత్రం సమర్పించారు. ముఖ్యంగా గల్ఫ్, కువైట్ ప్రాంతాల ప్రవాసులు నవీన పద్ధతి కోసమే ఎదురుచూస్తున్నారన్నారు. కొత్త విధానం సర్కారు పరిశీలనలో ఉందని, సీఎం కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని కేటీఆర్ చెప్పారు.
*అవినీతిపరుల కోసమే చట్టంలో మార్పులు: రాహుల్
అవినీతిపరులు దోచుకునేలా సహకరించడం కోసమే కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని బలహీనపరిచిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనిపై శనివారం ఆయన ట్వీట్ చేశారు. పలు సవరణలతో చట్టాన్ని పలచన చేసిందని తెలిపారు. ఇంతజరుగుతున్నా అవినీతిపై గొంతుచించుకునే గుంపులు ప్రస్తుతం ఆకస్మికంగా అదృశ్యమవడం ఆశ్చర్యకరంగా ఉందని వ్యాఖ్యానించారు.
*ప్రతిపక్షాల లేఖలో వాస్తవం లేదు
పార్లమెంటరీ స్థాయీసంఘాల పరిశీలన లేకుండా ప్రభుత్వం హడావుడిగా బిల్లులు ఆమోదించుకుంటోందని 17 ప్రతిపక్ష పార్టీలు సభాధ్యక్షుడు వెంకయ్యనాయుడికి లేఖ రాయడాన్ని రాజ్యసభ సచివాలయ వర్గాలు ఖండించాయి. లేఖలో వాస్తవం లేదన్నాయి. పార్లమెంటులో ఏదో ఒక సభలో ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెడుతుంటుందని, ఏ సభలో బిల్లు పెడితే ఆ సభాధ్యక్షుడు దాన్ని స్థాయీసంఘానికి పంపాలా.. లేదా? అని నిర్ణయించాలని చెప్పాయి.
*జన జీవితాల్ని బాగు చేయడమే స్థానిక ఎన్నికల లక్ష్యం కావాలి: జేపీ
త్వరలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు రాజకీయ పార్టీల కోసమో, వ్యక్తుల కోసమో కారాదని లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. ప్రజల కోసం స్థానిక ఎన్నికలు జరిగితేనే పురపాలన, రోజువారీ జన జీవితాలు బాగుపడతాయని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో లోక్సత్తా పార్టీ పోటీ చేస్తున్న నేపథ్యంలో ‘పురపాలన పురోగతికి ప్రగతి సూత్రాలు- లోక్సత్తా విధానాలు’ పేరుతో తెలంగాణ రాష్ట్ర విభాగం రూపొందించిన గోడపత్రికను శనివారం హైదరాబాద్లో జేపీ ఆవిష్కరించారు.
*అక్బరుద్దీన్ ప్రసంగంలో..రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవు -కరీంనగర్ సీపీ కమలాసన్రెడ్డి వెల్లడి
చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవని న్యాయ నిపుణులు తేల్చినట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి. కమలాసన్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘ఎంఐఎం పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఈ నెల 23న నగరంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పాల్గొన్నారు. ఆయన ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా ప్రసంగించారని మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
*స.హ. చట్టంలో సవరణలతో స్వయంప్రతిపత్తికి భంగం -సురవరం సుధాకర్రెడ్డి
ప్రభుత్వ పాలనలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టంలో సవరణల ద్వారా చట్టం ముఖ్యఉద్దేశాలు దారితప్పే ప్రమాదముందని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి అన్నారు. చట్ట సవరణ వల్ల సమాచార హక్కు కమిషనర్ అధికారాలు తగ్గిపోతాయని చెప్పారు. శనివారం హైదరాబాద్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డితో కలసి ఆయన మాట్లాడారు. కేంద్ర సమాచార హక్కు కమిషనర్కు ఎన్నికల కమిషనర్, భారత ప్రధాన న్యాయమూర్తి తరహాలో స్వతంత్ర ప్రతిపత్తి ఉండేదని..కేంద్రం చేపట్టిన సవరణలతో అది కోల్పోవడమే కాకుండా, స.హ చట్టం కమిషనర్ స్థాయినీ తగ్గించినట్లైందన్నారు.
వైఎస్ అన్నం పెడితే…జగన్ పొట్టకొడుతున్నాడు-రాజకీయ–07/29
Related tags :