దర్శకుడు కథ చెబుతుండగానే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాననే మాట నటుల నుంచి తరచూ వినిపిస్తుంటుంది. కొన్ని కథలు, పాత్రలు నటులకి ఆ స్థాయిలో కనెక్ట్ అవుతుంటాయి. అయితే పాత్రల్లో ఒదిగిపోవడం ఎంత ముఖ్యమో, వాటి ప్రభావం నుంచి బయటికి రావడం అంతకంటే ముఖ్యమని చెబుతోంది కీర్తిసురేష్. ‘‘నటులు రోజూ ఒక కొత్త పాత్రతో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఒక పాత్రలోనే ఉండిపోతే సమస్యలొస్తాయి. కొన్ని పాత్రలు వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం చూపుతుంటాయి.ఆ విషయాన్ని కెరీర్ ఆరంభంలోనే పసిగట్టాను. అందుకే సెట్ నుంచి బయటికి వస్తుండగానే స్విచ్చాఫ్ చేసినట్టుగా ఆ పాత్రని అక్కడే కట్టిపెట్టి ఇంటికి రావడం అలవాటు చేసుకొన్నా. నా కెరీర్లో ఒకే ఒక్కసారి, ‘మహానటి’ విషయంలో మాత్రమే అది సాధ్యం కాలేదు. సినిమా తర్వాత కూడా కొన్నాళ్లపాటు ఆ కథ, పాత్ర నన్ను వెంటాడాయ’’ని చెప్పింది కీర్తి. ఆమె త్వరలోనే ‘మన్మథుడు 2’తో సందడి చేయబోతోంది. తెలుగు, తమిళం, హిందీల్లో అవకాశాలు అందుకొంటున్న కీర్తి ఇటీవల బరువు తగ్గి నాజూగ్గా మారింది.
సావిత్రిగారు వెంటాడారు

Related tags :