* కాపు రిజర్వేషన్లతో పాటు తన సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయంపై కాపు నేత ముద్రగడ పద్మనాభం.. సీఎం జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖ సంచలనం సృష్టిస్తోంది.ఆ లేఖలో జగన్ విధానాలపై మండిపడిన ముద్రగడ… అయ్యా జగన్ గారు.. తాను కూడా మీ సోదరి షర్మిల లాంటి వాడినేనని తెలిపారు. కొద్దిరోజుల క్రితం సోదరి షర్మిల మీద సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఆమె బాధతో, ఆవేదనతో హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసే పరిస్ధితి వచ్చింది. అలాగే తనపై సైతం కాపు ద్రోహి, స్వార్థపరుడు, గజ దొంగ, అమ్ముడుపోయాడు, మునిగిపోయిన ముద్రగడ అంటూ ఎన్నో తప్పుడు వార్తలను అన్ని పార్టీల వారు రాయిస్తున్నారని పద్మనాభం గుర్తు చేశారు. వాటికి బెదిరిపోవడానికి.. తానేమీ ఎన్ఆర్ఐని కాదని గుర్తుంచుకోండి అంటూ జగన్‌కు సూచించారు.కాగా ఈ లేఖలో ఈబీసీ కోటాలో 5 శాతం రిజర్వేషన్లపై … ఏ కోర్టు స్టే ఇచ్చిందో సీఎం జగన్ చెబితే సంతోషిస్తానన్నారు. న్యాయస్థానం స్టే ఉంటే తిరిగి ఎన్నికలు వచ్చే వరకు కాపుల హక్కులు, డిమాండ్లను అడగకుండా నోటికి ప్లాస్టర్ వేసుకుంటానని ముద్రగడ ఘాటుగా పేర్కొన్నారు.ఈ లేఖపై కథనాలు వెలువడిన కొద్దిసేపట్లోనే కాపు రిజర్వేషన్లపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు. ఈ కమిటీలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కన్నబాబు, అంబటి రాంబాబు ఉంటారు.కాపు రిజర్వేషన్లు, కేంద్ర చట్టంపై ఈ కమిటీ అధ్యయం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. కాపు రిజర్వేషన్లపై వైసీఎల్పీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం భేటీ అయ్యారు.కాపు రిజర్వేషన్లతో పాటు పాటు ఈబీసీ బిల్లుపై వారు చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, తి శ్రీనివాస్‌తో పాటు ఎమ్మెల్యే అంబటి రాంబాబు తదితర కాపు నేతలు హాజరయ్యారు.అనంతరం కాపు నేతలు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. వీరిని ఉద్దేశించి మాట్లాడిన జగన్.. కాపు రిజర్వేషన్లపై రాష్ట్రప్రభుత్వ వైఖరిని కోరుతూ.. ఏప్రిల్ 4న కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖను ప్రస్తావించారు. అయితే ఆ లేఖకు నాటి సీఎం చంద్రబాబు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని నేతలు తెలిపారు.
* రాష్ట్రంలో సీనియర్, జూనియర్ హోదా స్థాయిల్లో ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సీనియర్ హోదాలో నలుగురు, జూనియర్ హోదాలో ఏడుగురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. హోంగార్డ్స్ అదనపు డీజీగా హరీష్ కుమార్ గుప్తా, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్టేషన్ ఏడీజీగా కృపానంద్ త్రిపాఠి ఉజేలా, ఎస్పీఎఫ్ డీజీగా టీఏ త్రిపాఠి, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్‌గా కాంతారావులను బదిలీ చేసింది. అలాగే.. జూనియర్ హోదా స్థాయిలో నర్సీపట్నం ఏఎస్పీగా వై.రిషాంత్ రెడ్డి బదిలీ కాగా.. రంపచోడవరం ఓఎస్డీగా ఆరిఫ్ హఫీజ్ నియామితులయ్యారు. రంపచోడవరం ఏఎస్పీగా వకుల్ జిందాల్, గ్రేహోండ్స్ స్క్వాడ్రన్ కమాండర్‌గా రాహుల్ దేవ్ సింగ్, విశాఖపట్నం అదనపు ఏఎస్పీ అడ్మిన్‌గా అజితా వేజెండ్ల, బొబ్బిలి ఏఎస్పీ గ్రేడ్ వన్‌గా గౌతమి శాలిని, పార్వతీపురం ఏఎస్పీ గ్రేడ్ వన్‌గా గరుడ్ సుమిత్ సునీల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
*ఆంధ్రప్రదేశ్‌లో ఏడుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. బదిలీ అయిన వారు.. నర్సీంపట్నం ఏఎస్పీగా రిషాంత్ రెడ్డి, రంపచోడవరం ఓఎస్డీగా ఆరిఫ్ హఫీజ్, రంపచోడవరం ఏఎస్పీగా వకుల్ జిందాలు ఉన్నారు. వీరితో పాటు గ్రేహోండ్స్ స్వ్కాడ్రన్ కమాండర్‌గా రాహుల్ దేవ్ సింగ్, విశాఖపట్నం అదనపు ఏఎస్పీ అడ్మిన్‌గా అజితా వేజెండ్ల, బొబ్బిలి ఏఎస్పీ గ్రేడ్‌వన్‌గా గౌతమి శాలిని, పార్వతీపురం ఏఎస్పీ గ్రేడ్ వన్‌గా సుమిత్ సునీల్ బదిలీ అయ్యారు.
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. బదిలీ అయిన వారి వివరాలు.. నర్సీపట్నం ఏఎస్పీగా వై.రిషాంత్ రెడ్డి, రంపచోడవరం ఓఎస్డీగా కె.అరీఫ్ హఫీజ్, రంపచోడవరం ఏఎస్పీగా వకుల్ జిందాల్, గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్‌గా రాహుల్ దేవ్ సింగ్, విశాఖపట్నం అడిషనల్ ఎస్పీగా(అడ్మిన్) అజిత వేజెండ్ల, బొబ్బిలి ఏఎస్పీ గ్రేడ్-1గా గౌతమి సాలిని, పార్వతీపురం ఏఎస్పీ గ్రేడ్-1గా గరుడ్ సుమిత్ సునీల్‌ను ప్రభుత్వం నియమించింది.
*ఒంగోలు కలెక్టరేట్‌లో ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. కలెక్టరేట్‌లో జరుగుతున్న స్పందన కార్యక్రమంలో రమణయ్య అనే వృద్ధుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన పోలీసులు వెంటనే రమణయ్యను రిమ్స్‌కు తరలించారు.
* కైకలూరు బొమ్మ సెంటర్ వద్ద ఉన్న ఒరింటల్ ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ సోమవారం సందర్శించారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో మాట్లాడి, పాఠశాలల్లో బోధన, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు రెండు క్లాసు రూమ్‌లను మంజూరు చేశారు.
* రాష్ట్ర ఆస్తులను ధారాదత్తం చేస్తామంటే తెలుగుదేశం పార్టీ సహించదని ఆ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అన్నారు. ట్విటర్ లో ఆయన స్పందిస్తూ బందరు పోర్టుపై ఏళ్ల తరబడి నిర్లక్ష్యం కొనసాగుతోందన్నారు. మచిలీపట్నం డీప్ వాటర్ పోర్టుకు తెదేపా ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్ అభివృద్దికి టీడీపీ ప్రభుత్వం కృషి చేసిందన్నారు.
* కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నియమితులయ్యారు. జక్కంపూడి రాజాను కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల కాలపరిమితితో జక్కంపూడి రాజాను ఈ పదవిలో నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
* పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ,పెనుమంట్ర M.R.O ఆఫీస్ లో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అధికారులను కలసి తమస్యలు చెప్పుకునేందుకు…. అర్జీ దారులు బారులు తీరారు.స్పందన కార్యక్రమం లో పాల్గొన్న మండల అధికారులు ప్రజలనుంచి వినతిపత్రాలు స్వీకరించారు.
* భారత సంస్కృతి, సంప్రదాయాలకు సంబందించిన చిహ్పాలు విశ్యవ్యాప్తంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఖ్యంగా ఆద్యాత్మితకు మారు పేరైన భారత్ లాంటి దేశంలో భక్తి భావాలకు ప్రాముఖ్యత ఎక్కువాగా ఉంటుంది. ఇందులో బాగంగా గుడులు, గోపురాలు, దేవాలయాలు ఎక్కువాగా నిర్మించి నిత్యం పూజలు చేస్తుంటారు. ప్రజలు కూడా హిందూ దేవుళ్ల పట్ల అపార నమ్మకంతో నిత్యం పూజలు, హోమాలు, యజ్ఞాలు నిర్వహించి భక్తి భావాలను చాటుకుంటారు.
*కర్ణాటక రాష్ట్రంలోని నారాయణపూర్ ప్రాజెక్టు 18 గేట్లను ఎత్తివేశారు. దీంతో జూరాలకు భారీగా వరద నీరు చేరుతోంది. కర్ణాటకలో భారీ వర్షాల వల్ల జూరాలకు నీటి విడుదల చేశారు. లక్ష క్యూసెక్కుల నీటిని కర్ణాటక విడుదల చేసింది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను తెలంగాణ రాష్ట్ర అధికారులు అప్రమత్తం చేశారు.
*కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్(60) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ముఖేష్ గౌడ్.. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముఖేష్ గౌడ్ మృతిపట్ల కాంగ్రెస్ నాయకులు, ఇతరులు సంతాపం ప్రకటించారు. గత 30 ఏండ్ల నుంచి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.
*పశ్చిమ బంగాల్‌కు ఆనుకుని ఉన్న బంగాళఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. వాయువ్య బంగాళాఖాతంలో 76 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తం ఉంది. నైరుతు రుతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయి. వీటి ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురువనున్నాయి..
*దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా వందలాది గ్రామాలు నీట మునిగాయి.. వరణుడి ధాటికి వేలాది ఇళ్లు కూలి పోయాయి. వర్షాలు-వరదల దెబ్బతో దాదాపు 6 వందల మంది మృతి చెందారు. వందలాదిమంది గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రుయులైయ్యారు. అటు వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ బాధితులను ఆదుకోవడాని కి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి..
* ఏపీలో మూతబడ్డ అన్నక్యాంటీన్లు…ఏపీలో అన్న క్యాంటీన్లకు ఆదీలోనే ఎదురు దెబ్బ తగిలింది. కర్నూలు జిల్లా ఆదోనిలో అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. రెండు రోజులుగా అన్న క్యాంటీన్లు తెరవడం లేదు. గతంలో టీడీపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ గడువు ముగియడంతోనే నిలిపి వేసినట్లు చెబుతున్నారు. రూ.5లకే అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మూతపడటంతో పేదలు నిరాశతో వెనుదిరిగి పోతున్నారు. ప్రభుత్వం స్పందించి అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు
*న్యాయస్థానాలు, ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లకు రావాలని ఎవరూ అనుకోరు. అందరూ ప్రశాంతంగా జీవించాలనే కోరుకుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు.
* నీటి పొదుపులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, భూగర్భ జలాలను పెంచే బాధ్యత ప్రజలందరిపై ఉందని గవర్నర్ నరసింహన్ అన్నారు. ధరిత్రిపై పడిన ప్రతి నీటి చుక్క విలువైనదని, సంరక్షించుకోవడం ఎంతో ప్రధానమన్నారు.
* వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులో భారతి సిమెంట్స్ డైరెక్టర్ జెల్లా జగన్మోహన్రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసులో భాగస్వామ్యం ఉందంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలికంగా జప్తు చేసిన ఆయన ఆస్తులను తిరిగి ఇవ్వాలని అప్పిలేట్ ట్రైబ్యునల్ (దిల్లీ) శుక్రవారం తీర్పునిచ్చింది.
* ముంబయిలో భారీ వర్షాల కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. హైదరాబాద్ నుంచి ఈ నెల 28న ముంబయికి వెళ్లాల్సిన హుస్సేన్సాగర్ ఎక్స్ప్రెస్ రద్దయ్యింది. 29న ముంబయి నుంచి హైదరాబాద్కు వచ్చే రైలును కూడా రద్దు చేశారు. రక్సాల్-హైదరాబాద్ ఎక్స్ప్రెస్ను ఆదివారం దారి మళ్లించి నడిపారు.
* భవిష్యత్తులో శాస్త్ర, సాంకేతిక రంగాలు అభివృద్ధిలో కీలకమని, ఆ దిశగా విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని డీఆర్డీవో(భారత రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ) ఛైర్మన్ డాక్టరు జి.సతీష్రెడ్డి ఉద్బోధించారు.
* వృత్తిలో అత్యున్నత విలువలు పాటించడం ద్వారా న్యాయవ్యవస్థ ఉన్నతిని యువ న్యాయవాదులు నిలబెట్టాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్రాయ్, జస్టిస్ డీవీవీఎస్ సోమయాజులు సూచించారు.
* విద్యుత్ రంగంలో ఏ చర్యలు తీసుకున్నా అది ప్రజా ప్రయోజనాల కోసమేనని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉచిత విద్యుత్ పథకం ద్వారా 18.15 లక్షల మంది రైతులకు లబ్ధి కలుగుతుందని వివరించారు.
కాపు రిజర్వేషన్లపై జగన్‌కు ముద్రగడ లేఖ-తాజావార్తలు-07/29
Related tags :