తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని తెరాస కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నారై పాలసీ కోసం వినతి పత్రాన్ని అందించారు. గల్ఫ్ మరియు కువైట్ లో ఉంటున్న కార్మికులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. మృత్యువాత పడుతున్నారు అని వీరందరికీ తప్పకుండా గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ త్వరలో అమలు చేయాలి అని కోరారు. టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలని అభిలాష వివరించారు. కేటీఆర్ ఎన్నారై తెరాస కువైట్ విభాగానికి అభినందనలు తెలిపారు.
కేటీఆర్‌తో కువైట్ ఎన్నారై తెరాస అధ్యక్షురాలు భేటీ
Related tags :