ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు కుడా చొరవ చూపితే ప్రతి పాఠశాల మెరుగైన ఫలితాలు సాధిస్తుందని పెనమలూరు ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థి పెనమలూరు ప్రవాసుల సంఘ అధ్యక్షుడు మలినేని ఠాగూర్ పేర్కొన్నారు. పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన సోమవారం నాడు విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ…ప్రతి ఒక్కరికి బాల్యం గొప్పదని… జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి బాల్యం నుంచే సరైనా ప్రణాళిక ఉండాలని అప్పుడే ప్రతి ఒక్కరూ మంచి విజయాన్ని అందుకుంటారని ఆయన తెలిపారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి మలినేని ఠాగూర్-శ్రీలక్ష్మి దంపతులు మలినేని భాస్కరరావు చేతుల మీదుగా ₹లక్ష రూపాయలు పాఠశాలకు విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు జాస్తి ఆశాలత, విద్యాదాత కిలారు శివకుమార్, విశ్రాంత ఉపాద్యాయులు ఉప్పలపాటి పూర్ణచంద్రరావు, యాజమాన్య కమిటీ ఛైర్మన్ నాగిడి విజయకుమార్, సభ్యులు తెన్నేటి ప్రకాష్, జిఎంకె ప్రసాద్, ఉపాద్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పెనమలూరు ప్రభుత్వ పాఠశాలకు ₹లక్ష విరాళం
Related tags :