తెలంగాణకు చెందిన ఎన్నారై అమెరికాలోని టెక్సాస్ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి దిగువసభ సభ్యుడిగా డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీచేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్ వెంకటేశ్ కులకర్ణి కుమారుడైన శ్రీనివాస్ కులకర్ణి హైదరాబాద్లోఎన్నారై కుటుంబసభ్యులను కలిసి మద్దతునివ్వాలని కోరారు. ఆయన ముంబై, బెంగళూరు, చెన్త్నె, తిరుపతి నగరాల్లో ప్రచారం చేస్తూ, హైదరాబాద్ నగరానికి వచ్చి శుక్రవారంనుంచి మూ డ్రోజులు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన శంషాబాద్ మండలం ముచ్చింతలలో చినజీయర్స్వామిని కలిసి ఆశీర్వాదాలు పొందా రు.టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావును కలిసి పోటీచేస్తున్న విష యం తెలిపారు. విద్యానగర్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో అమెరికాలో నివాసముంటున్నవారి సంబంధీకులను కలుసుకుని మద్దతునివ్వాలని కోరారు. అమెరికాలో ప్రవాస భారతీయుల హక్కుల పరిరక్షణకు పోటీచేస్తున్నానని ఆయన చెప్పారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన వెంకటేశ్ కులకర్ణి అమెరికాలోని లూసియానాలో స్ధిరపడగా, 1978లో శ్రీనివాస్ కులకర్ణి జన్మించారు. ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ డిగ్రీ పొందారు. గతంలోనూ దిగువసభకు పోటీచేసి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి చేతిలో స్వల్పతేడాతో ఓడిపోయారు. తాను గెలిచి దిగువసభలో భారత వాణిని వినిపిస్తానని వెల్లడించారు.
అమెరికా ఎన్నికల్లో తెలంగాణా ఎన్నారై పోటీ
Related tags :