1. సెప్టెంబరు 30 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు – ఆద్యాత్మిక వార్తలు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 8 వరకు నిర్వహించనున్నట్లు తితిదే తెలిపింది. స్వామివారి వాహన సేవల వివరాలు, తేదీలను శనివారం వెల్లడించింది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు స్వామివారి వాహనసేవలు జరుగుతాయని వివరించింది. గరుడ వాహన సేవను రాత్రి 7 గంటలకే ప్రారంభించనున్నట్లు పేర్కొంది. సెప్టెంబరు 5న స్వామివారికి స్వర్ణ రథోత్సవం ప్రత్యేకంగా జరుగుతుందని తెలిపింది. ఉత్సవాల నేపథ్యంలో ఆలయ శుద్ధిలో భాగంగా సెప్టెంబరు 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తామని, 29న ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని వివరించింది. 30న సాయంత్రం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమం జరుగుతుందని పేర్కొంది. వాహనసేవల వివరాలు
2. జ్యోతిర్లింగం కింద నుంచి ఉబికిన జలధార
భారీవర్షాలతో నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్ తడిసిముద్దయింది. ప్రఖ్యాత త్రయంబకేశ్వర్ ఆలయ గర్భగుడిలో జ్యోతిర్లింగం అడుగుభాగం నుంచి జలధార ఉబికి వచ్చినట్లు ఆలయ ట్రస్టు ప్రతినిధులు తెలిపారు. గోదావరి నదీపాయ త్రయంబకేశ్వర లింగం కిందుగా ప్రవహిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
3. దిల్లీలో శ్రీసత్యనారాయణ స్వామి కల్యాణం
అన్నవరం శ్రీసత్యనారాయణ స్వామి కల్యాణ వేడుకలను దిల్లీ గోల్మార్కెట్లోని బాలాజీ దేవస్థానం ప్రాంగణంలో శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. దేశరాజధానిలో నివసిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు స్వామి వారి కల్యాణానికి తరలివచ్చారు. ఉదయం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఇందులో పెద్ద సంఖ్యలో దంపతులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు, కల్యాణానికి అవసరమైన ఏర్పాట్లను తితిదే తరఫున చేశారు. ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
4. లాల్ దర్వాజ అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు
బోనాల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సింహవాహినీ లాల్ దర్వాజ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పట్టువస్త్రాలు సమర్పించారు. బోనాల సందర్భంగా హైదరాబాద్లోని పాతబస్తీ అంతటా ఆధ్యాత్మిక వాతావారణం నెలకొంది.
5. బుల్లి జగన్నాథ రథానికి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు
ఒడిశాలోని బ్రహ్మపుర నగరానికి చెందిన యువ కళాకారుడు సత్యనారాయణ మహరణ రూపొందించిన అతి చిన్న జగన్నాథ రథం ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సు’లో చోటు దక్కించుకుంది. పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా కొద్దిరోజుల కిందట సత్యనారాయణ కర్ర పుల్లలతో అతి చిన్న రథం (వెడల్పు 1.4, ఎత్తు 1.3 అంగుళాలు) తయారు చేశారు. అనంతరం రథం ఆకృతి, తయారు చేసేందుకు పట్టిన సమయం తదితర వివరాలను వీడియో రూపంలో ఫరీదాబాద్లోని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సు కార్యాలయానికి పంపారు. వాటిని పరిశీలించిన సంస్థ ప్రతినిధులు.. అతి చిన్న జగన్నాథ రథానికి రికార్డ్సులో స్థానం కల్పిస్తున్నట్లు ఆదివారం మెయిల్ పంపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ బుల్లి రథం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం పొందడం ఆనందంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని కళాఖండాలను రూపొందిస్తానని చెప్పారు.
6. ఘనంగా లాల్దర్వాజా బోనాలు
లాల్దర్వాజా బోనాల పండుగ ఆదివారం ఘనంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా సింహవాహిని మహంకాళి దేవాలయంలో ఆదివారం తెల్లవారుజామున బలిగంప కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జరిగిన మహాభిషేకంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు టి.వీరేందర్గౌడ్ కుటుంబసభ్యులు పాల్గొని అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. డప్పు వాయిద్యాల మధ్య మహిళలు పసుపు, కుంకుమ, వేపమండలతో అలంకరించిన బోనం కుండలను సంప్రదాయబద్దంగా తలపై పెట్టుకుని ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సతీసమేతంగా విచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సైతం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. లాల్దర్వాజా అమ్మవారికి ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు బంగారు బోనాలు సమర్పించారు. కేంద్ర సహాయమంత్రి జి.కిషన్రెడ్డి, రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
7. ఎస్వీబీసీ ఛైర్మన్గా పృథ్వీరాజ్ బాధ్యతల స్వీకరణ
శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) ఛైర్మన్గా, డైరెక్టరుగా పృథ్వీరాజ్ బాలిరెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయానికి చేరుకొని బాధ్యతలు స్వీకరిస్తూ దస్త్రంపై సంతకం చేశారు.
8. 11 నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 11 నుంచి 3 రోజులపాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. వేడుకలకు ఆగస్టు 10న అంకురార్పణ చేయనున్నారు.
9. హస్తినలో ముగిసిన సత్యదేవుని వ్రతాలు
అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ దేవస్థానం తరపున ఢిల్లీ ఏపీ భవన్ ఆధ్వర్యంలో టీటీడీ ధ్యానమందిరంలో నిర్వహించిన సత్యదేవుని వ్రతాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ప్రకాష్ మాట్లాడుతూ ప్రసాద పథకం ద్వారా అన్నవరం ఆలయ అభివృద్ధికి త్వరలో రూ.40 కోట్ల నిధులు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు.
10. శుభమస్తు
తేది : 29, జూలై 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : సోమవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : ద్వాదశి
(నిన్న రాత్రి 6 గం॥ 44 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 5 గం॥ 3 ని॥ వరకు)
నక్షత్రం : మృగశిర
(నిన్న రాత్రి 7 గం॥ 13 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 6 గం॥ 17 ని॥ వరకు)
యోగము : వ్యాఘాతము
కరణం : కౌలవ
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 7 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 9 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 21 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 47 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 38 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 14 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 31 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 8 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజుమద్యాహ్నం 1 గం॥ 59 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 36 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 44 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 21 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 54 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 50 ని॥ లకు
సూర్యరాశి : కర్కాటకము
చంద్రరాశి : వృషభము
11.చరిత్రలో ఈ రోజు/జూలై 29*
1883: ఇటలీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు ముస్సోలినీ జననం (మ.1945).
1891: ప్రసిద్ధ సంఘసంస్కర్త, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ మరణం (జ.1820).
1904: భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు తొలి విమాన చోదకుడు జె.ఆర్.డి.టాటా జననం (మ.1993).
1931: సినారె గా ప్రసిద్ధుడైన డా.సింగిరెడ్డి నారాయణరెడ్డి జననం.
1975: శ్రీలంక కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు లంక డిసిల్వా జననం.
1976: వరంగల్లు లో కాకతీయ విశ్వవిద్యాలయము ను నెలకొల్పారు.
2004: ఇండియన్ మోడల్ మరియు 1997 మిస్ ఇండియా యూనివర్స్ విజేత నఫీసా జోసెఫ్ మరణం (జ.1979).
010: అంతర్జాతీయ పెద్ద పులుల దినోత్సవం గా ప్రకటించారు.
12. తిరుమల, ఆగస్టు 3వ తేదీన పురుశైవారి తోట ఉత్సవం
శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువడిపురం శాత్తుమొరను పురస్కరించుకుని ఆగస్టు 3వ తేదీన తిరుమలలో పురుశైవారి తోట ఉత్సవం ఘనంగా జరుగనుంది.పురాణాల ప్రకారం పాండ్య దేశంలో పరమ విష్ణుభక్తుడైన శ్రీ విష్ణుచిత్తుడికి చెందిన తులసీవనంలో ఆషాడ శుక్ల చతుర్థి నాడు పూర్వఫల్లునీ నక్షత్రంలో భూదేవి అంశగా ఆండాళ్(గోదాదేవి) అమ్మవారు ఆవిర్భవించారు. ఈ కారణంగా కటక మాసం పూర్వఫల్గుని నక్షత్రంలో ఆండాళ్ తిరువడిపురం శాత్తుమొర నిర్వహిస్తారు. ఈ పవిత్రమైనరోజు సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు పురుశైవారితోటకు వేంచేపు చేస్తారు. అక్కడ నివేదనల అనంతరం స్వామి, అమ్మవార్లు బయల్దేరి పొగడ చెట్టు వద్దకు రాగానే హారతి ఇస్తారు. హారతి, పుష్పసరము, శ్రీ శఠారి పొగడ చెట్టునకు సమర్పిస్తారు. శ్రీ శఠారికి అభిషేకం అనంతరం తిరిగి తిరుచ్చిపై ఉంచుతారు. అక్కడ నుంచి స్వామి, అమ్మవార్లు ఆలయ మాడ వీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు.
13. జగన్మాత సేవలో సారె బృందాలు..!
జగన్మాత దుర్గమ్మ ఆశీస్సుల కోసం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం 31 భక్త బృందాలు సంప్రదాయ బద్ధంగా సారెను సమర్పించాయి. వారికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. రాజగోపుర ప్రాంగణంలో నృత్య కళాకారిణుల బృందం, కోలాట బృందాలు చేసిన ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. సారె తీసుకువచ్చిన భక్తులతో రాజగోపుర ప్రాంగణం కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో క్యూలైన్లలో భక్తులు బారులుదీరారు. సారె సమర్పించేందుకు ఒక్కో బృందానికి 2 గంటల సమయం పట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుంచి లక్ష్మీదుర్గ భక్తబృందం, కృష్ణా జిల్లా నూజివీడు నుంచి రాధాకృష్ణ భజన మండలి, విజయవాడలోని చెరువు సెంటరు, కొత్తపేట, దేవినగర్, మురళీనగర్, రామవరప్పాడు, వైఎస్‌ఆర్ కాలనీ నుంచి భక్త బృందాలు సారెను సమర్పించాయి. మల్లికార్జునపేట బ్రాహ్మణ వీధిలోని సద్గురు రాఘవేంద్ర స్వామి బృందావన సేవాసమితి ఆధ్వర్యంలో నృత్య కళాకారిణులు, సేవా సమితి సభ్యులు… మల్లికార్జున మహామండపంలోని ఆరో అంతస్తులో అర్చకులకు సారెను అందజేశారు. సారెను సమర్పించిన మహిళలకు మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, దేవస్థానం సిబ్బంది ప్రసాదాలను అందజేశారు.
14. జగన్మాత సేవలో మంత్రి ధర్మాన కృష్ణదాస్
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆదివారం దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆయనను ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారికి కుటుంబ సమేతంగా మంత్రి ప్రత్యేక పూజలు చేయించారు. ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించారు. మంత్రికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను ఏఈవో అమృతరావు, వేదపండితులు అందజేశారు.
15. గుంటూరు జిల్లాలో ఘనంగా బోనాలు-నాలుగేళ్లుగా బోనం సమర్పిస్తున్న భక్తులు
ఏపీలోని గుంటూరు జిల్లాలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరులోని మహంకాళి అమ్మవారి ఆలయంలో భక్తులు బోనం సమర్పించారు. రంగిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత నాలుగేళ్లుగా బోనాలు జరుగుతున్నాయి. అమ్మవారి సన్నిధిలో పొంగళ్లు చేసే భక్తులకు పొంగళ్లు కిట్ లను రంగిశెట్టి జగదీశ్ బాబు, రంగిశెట్టి రమేశ్ బాబు ఉచితంగా పంపిణీ చేశారు. బోనాల సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు.
16. సూర్య/ చంద్రుల ఉదయాస్తమయాలు
సూర్యోదయం: 05:58:12
అభిజిత్: 12:23:34
సూర్యాస్తమయం : 18:47:56
చంద్రోదయం: 02:48:16
చంద్రాస్తమయం : 16:16:37
దినప్రమాణం: 12:49:44
సూర్య చంద్రుల రాశి స్థితి
సూర్య రాశి కర్క రాశి (సూర్యోదయాన)
చంద్ర రాశి వృష రాశి (సూర్యోదయాన)
గడిచిన అమావాస్య: 3-7-2019 00:47:10
రాబోవు అమావాస్య: 1-8-2019 08:43:55
పంచాంగ వివరములు
కలియుగ వత్సరాలు 5120
శక సంవత్సరం 1941
విక్రమ శకం 2076
కలియుగ గత దినములు 1870228
జూలియన్ దినములు 2458694
సంవత్సరం: వికారి
ఆయనం: దక్షిణాయణం
ఋుతువు: గ్రీష్మ ఋుతువు
మాసము: ఆషాడం
వారము: సోమవారం
దిశ శూల: తూర్పు
తిథి సూర్యోదయాన తిథి:కృష్ణ-ద్వాదశి
కృష్ణ-ద్వాదశి ఈ రోజు 17:11:40 వరకు, ఆ తర్వాత
కృష్ణ-త్రయోదశి రేపు 14:51:52 వరకు
నక్షత్రం మృగశిర ఈ రోజు 18:23:30 వరకు ఆ తర్వాత
ఆరుద్ర రేపు 16:48:42 వరకు
రాశి వృష రాశి ఈ రోజు 06:56:43 వరకు ఆ తర్వాత మిథునరాశి
యోగము ధృవ ఈ రోజు 04:24:22 వరకు ఆ తర్వాత
వ్యాఘాత రేపు 01:46:18 వరకు
హర్షణ రేపు 22:38:01 వరకు
కరణం కౌలవ ఈ రోజు 06:06:15 వరకు
తైతుల ఈ రోజు 17:11:40 వరకు
శుభ సమయములు
అమృత ఘడియలు 09:55:02 to 11:31:02
ఈ రోజు యోగములు
దగ్ధ యోగము 17:11:40 వరకుNone
అశుభ సమయములు
రాహు కాలం 07:34:17 నుంచి 09:10:23 వరకు
గుళికా కాలం 13:59:40 నుంచి 15:35:45 వరకు
యమగండ కాలం 10:46:29 నుంచి 12:23:34 వరకు
దుర్ముహూర్తం 11:57:57 నుంచి 12:48:12 వరకు
దుర్ముహూర్తం 15:22:56 నుంచి 16:13:11 వరకు
వర్జ్యం 00:41:25 నుంచి 02:17:25 వరకు
దిన విభాగములు
ప్రాతః కాలము: 05:58:12 నుంచి 08:32:57 వరకు
సంగవ కాలము: 08:32:57 నుంచి 11:06:42 వరకు
మధ్యాహ్న కాలము: 11:06:42 నుంచి 13:39:26 వరకు
అపరాహ్న కాలము: 13:39:26 నుంచి 16:13:11 వరకు
సాయంకాలము: 16:13:11 నుంచి 18:47:56 వరకు
రాత్రి విభాగములు
ప్రదోష కాలము: 18:47:56నుంచి 21:21:38 వరకు
నిశీథి కాలం: 24:46:33 నుంచి 25:37:46 వరకు
అర్ధ రాత్రి: 23:54:19 నుంచి 26:28:00 వరకు
17. ప్రహ్లాద సమేత స్వయంభూగా వేలశి యున్న క్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము*
కదిరి పట్టణము – 515591, అనంతపురము జిల్లా., ఆంధ్రప్రదేశ్
ఫోన్ నెం : 08494 – 221066, 221366
email: ac_eo_kadiri@yahoo.co.in
29.07.2019 వతేది, *సోమ వారము ఆలయ సమాచారం*
*_శ్రీస్వామి వా దర్శన వేళలు_*
ఉదయము 5.30 గంటలకు అలయము శుద్ది, మొదటి మహాగంట, నివేదన, బాలబోగ్యం త్రికల నైవేద్యాములు సమర్పణ. పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నివేదనసమర్పణ..స్వామి వారి దర్శనము ఉదయము 6.00 గంటల నుండి 7.30 గంటలకు వుండుఅనంతరము ఉదయం 7.30 గం|| నుండి స్వామివారికి అర్జిత అభిషేక సేవ ప్రారంభమగును. స్వామి వారికి *_ఆర్జిత అభిషేకము_* సేవా, సహస్రనామర్చన, పుష్ప అలంకరణ, మహా మంగళ హారతితో పాటు నివేదిన, ప్రసాదము నైవేధ్యము సమర్పణ కార్యకమమును ( ఉదయము 7.30 గంటలనుండి 9.30 గంటల వరకు ) నిర్వహించెదరు…*_దేవస్థానమునకు అనుభంద ఆలయము శ్రీఉమామహేశ్వర స్వామి (శివాలయము) ఉదయము 7.30 గంటలకు రూద్రాబిషేకము, పంచామృత అభిషేక సేవా, ప్రసాద వితరణ కార్యక్రము ప్రారంభమగును_* తిరిగి సర్వ దర్శనము ఉదయము 10.00 గంటల నుండి మ. 12.00 వరకు వుండును..రెండవ మహాగంట నివేదనమ.12.00 నుండి 12.30 లోపు, బాలబోగ్యం త్రికల నైవేద్యాము సమర్పణ..మ. 12.40 నుండి 1.30 వరకు సర్వదర్శనము.. అనంతరము ఆలయము తలుపులు మూయబడును..తిరిగి సాయంత్రము శ్రీస్వామి వారి దర్శనార్థము 4.30 గంటలనుండి రా.6.00 వరకు వుండును.. మూడవ మహా గంట ఆలయ శుద్ది, నివేదన రా.6.30 నుండి 7.00 లోపు, బాల బోగ్యం త్రికల నైవేద్యాదులు సమర్పణ. మహ మంగళ హారతి, పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నైవేద్యాములు సమర్పణ.. తిరిగి శ్రీస్వామి వారి దర్శనార్థము రాత్రి 7.00 గంటల నుండి రా.8.30 వరకు వుండును.. రాత్రి 8.30 గంటల పైన ఆలయ శుద్ది అనంతరము, స్వామి వారికి ఏకాంత సేవాతో స్వామి వారి దర్శనము పరిసమప్తం అగును, తదుపరి ఆలయము తలుపులు ముయాబడును..
*ఆర్జిత సేవాల వివరములు*
_*29.07.019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) ఆర్జిత అభిషేకము సేవా టిక్కెట్లు బుకింగ్:20*_
*29.07.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) అర్జిత స్వర్ణకవచ సేవా టిక్కెట్లు బుకింగ్: 3*_
18. మహానీయుని మాట
అందరినీ నమ్మడం లేదా ఎవ్వరినీ నమ్మకపోవడం రెండూ ప్రమాదకరమే ”
19. నేటి ఆణిముత్యం
భుజము తడుము కొనకు బుద్ధి మంచిదియైన
బురద జల్లవలదు బుధులమీద
తాను తీయు గోయి తనకుకీడొసగురా
తప్పు మోపకెపుడు ముప్పు తెచ్చు!
భావం:
నీ బుద్ధి మంచిది అయినప్పుడు ఎవరైన ఏదైన చెబితే అది నాకోసమే చెప్పాడని భుజాలు తడుముకోవడం అవివేకం.నీలో లోపం పెట్టుకుని బుద్ధి గలవారిమీద బురదజల్లవద్దు.ఎప్పటికైనా తాను తీసుకున్న గోతిలో తానేపడి నాశనం అవుతాడు.ఇతరులమీద నేరం మోపకు.అది నీకు ముప్పు ను తప్పక తెస్తుంది….జాగ్రత్త
20. నేటి జాతీయాలు
కాకులు దూరని కారడవిచాలా దట్టమైన అడవి అని అర్థం.కాగడావేసి వెతకడం సునిశితంగా పరిశీలించడం వెతకటం
21. మన ఇతిహాసాలు -మంధర
చరిత్రలో కొందరి జీవితాలను నిశితంగా పరిశీలిస్తే, వారిపైకి కనిపించే స్వభావస్వరూపాల ఆంతరంగిక ఆలోచనలోనితత్తం విభిన్నమై అర్థంకాని వృత్యాసంతో మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మంచీ చెడుల సందిగ్థావస్థను మనకొదిలేసి, తాను నిలువెత్తు చెడుకు ప్రతిరూపంగా నిలిచి, లోక కళ్యాణానికి ముఖ్య హేతువయ్యింది మంధర.మంధర ఎవరో, ఎక్కడ పుట్టిందో ఎవ్వరికీ తెలియదు. కైకేయి పుట్టింటి నుంచి అరణంగా తెచ్చుకున్న దాసి మంధర. కైకేయికి గూనిదైనా మంధరంటే మహా ఇష్టం. అయోధ్య రాజ్యంలో దాసీ అయినా కైకేయి వల్ల ఓ వెలుగు వెలుగుతూ ఉండేది మంధర. కైకేయిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. కైకేయి కూడా సలహాలూ, సంప్రదింపులూ మంధరతోనే చేసేది. కైకేయి మీద ఈగ వాలినా సహించేది కాదు మంధర. పుట్టింటి నుంచి తనతో రావటం వల్ల కైకకూ మంధరంటే వల్లమాలిన అభిమానం. అందుకేనేమో రామకథలో ఓ ప్రధాన ఘట్టానికి నాంది పలికింది మంధర.రామాయణంలో కైకేయి జీవితాన్ని తన ఆలోచనలతో ప్రభావితం చేస్తున్నట్లు కనిపించే మంధర గర్వంతో విర్రవీగుతూ అతి సామాన్యమైన పాత్రలా మిగిలిపోయింది. కానీ అసలు రామకథను మలుపు తిప్పడంలో ప్రధానపాత్ర తనదే.తెల్లవారితే రామాభిషేకం అనగా మంధర ఒక కిటికీలోంచి అయోధ్యపుర ప్రజల హడావుడి చూసింది. కౌసల్యాదేవి ఆనందంతో ప్రజలందరికీ దానధర్మాలు చేయడం చూసి జీర్ణించుకోలేకపోయింది. మరో దాసిని పిలిచి ఏమిటీ హడావుడని అడుగుతుంది మంధర. ఆమె పట్టలేని సంబరంతో శ్రీరామ పట్టాభిషేకమని చెబుతుంది. అంతే, మంధర మొహం వివర్ణమైంది. పళ్ళు పటపటా కొరుకుతూ కైకేయి మందిరం వైపు కదిలింది. నిద్రకు ఉపక్రమిస్తున్న కైకేయి ప్రశాంతతను భంగం చేస్తూ.. కైకాదేవీ! నీ వైభవాన్ని చూసి విర్రవీగేదాన్ని. నీ పుట్టింటి దాసిగా నీ భోగాన్ని తలుచుకుంటూ నీతో వచ్చినందుకు నా జీవితానికి లోటు లేదని భావించిన నాకు ఇది జరగాల్సిందే. ఎండాకాలంలో ఏరు ఎండిపోయినట్టు అడుగంటి పోతుంది నీ అదృష్టం అంటూ భోరున ఏడ్వడం మొదలుపెట్టింది. ఆ మొసలి కన్నీళ్ళ వెనుక అగాథమైన తుఫాను దాగుంది.కైకేయి ఏమీ పాలుపోక మంధరా జరిగిందేమిటో చెప్పమని సూటిగా అడిగింది. దశరథుడు మంచివాడు కాదు. నీపై ప్రేమ నటిస్తూనే నిన్ను మోసం చేస్తున్నాడు. భరతున్ని కావాలనే మేనమామ ఇంటికి పంపి రామునికి పట్టాభిషేకం చేస్తున్నాడు. ఇక నీవూ, నేనూ అందరూ రాజమాత కౌసల్యకు సేవకులమే అన్న మంధర మాటల్లో కైకేయికి రామపట్టాభిషేకం మాత్రమే వినపడింది. ఆనందంతో పొంగిపోయింది. శుభవార్త చెప్పావంటూ మంధరకు ముత్యాలహారం బహుకరించింది. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఆ ముత్యాలదండను విసిరిగొట్టి మహా సముద్రంలో నిన్ను నీవుగా ముంచేసుకుంటావనీ, నేను చెప్పేవరకూ రామపట్టాభిషేకం విషయం తెలియదంటే నీ విలువేంటో తెలుసుకోమనీ రెచ్చగొడుతుంది.మంధర మాటల ప్రభావం కైకేయిని ఆలోచనల్లో పడేసింది. కైకేయిలో కోపం కట్టలు తెంచుకుంది. మంధర మాత్రం మనసులో నిప్పురాజేశాను. మహా అగ్ని ఆవరించడమే ఆలస్యమని సంతోషించింది. చివరికి కైకేయి ఈ విషయ పరిస్థితిని దాటే ఉపాయం చెప్పమని మంధరను ప్రాధేయపడే స్థాయికి కైకేయిని తీసుకొచ్చింది మంధర. దేవాసుర యుద్ధాన్ని గుర్తుచేసి, దశరథుడు కైకేయికిచ్చిన రెండు వరాలు ఇంకా తీరనే లేదనీ, వాటిని తీర్చుకునే సమయం వచ్చిందనీ ఆ రెండు వరాల్లో ఒకటి భరతునికి పట్టాభిషేకం, రెండవది రాముడి వనవాసంగా కోరుకొమ్మంటుంది. రాముని వనవాసం అతి ముఖ్యమని పదేపదే చెప్పి కైకేయితో అనుకున్నదంతా చేయించిన ఘటకురాలు మంధర.పుట్టింటి దాసీ ధర్మాన్ని పాటించిందని కైకేయి మంధరను మెచ్చుకుంటుంది. గూనివారికి తెలివితేటలు ఎక్కువని పొగుడుతుంది. కానీ మంధర చేసిన రాద్ధాంతం కుటుంబాన్ని విడగొట్టి, అయోధ్యను కకలావికలం చేయడం కోసం కాదు. రావణ సంహారం జరిగి లోక కళ్యాణం జరగాలనే. శబరయోగిని మంధర శరీరంలో ప్రవేశించి కైక చేత వరాలు అడిగేలా ప్రణాళిక ఏర్పడిందనీ మరొక కథనం. మంధర ఆలోచనా దృక్పథాన్ని ఆవిష్కరించినప్పటికీ, మంధర జీవితం పాపాల పుట్టగా, వర్ణించినప్పటికీ ఆమె జన్మ లోకరక్షణే ధ్యేయంగా చెప్పాలి.సంకుచితమైన చిన్న వలయమే ఈ ప్రపంచం. మనలో చాలామంది కొన్ని అడుగుల ఆవల చూడలేకపోవడం వల్ల, మనం దుష్టులం, అవినీతి పరులం అవుతున్నాం. ఇదే మన అశక్తత. ప్రతి దుర్భావం ద్వేషపూరిత ఆలోచన అతి రహస్యంగా ఏ గుహలోనో దాగి తలంచినా ఎప్పుడో ఒకప్పుడు అప్రతిహత శక్తితో బయటపడక తప్పదు. మంధర విషయంలో జరిగిందదే. కాని మంధర దుర్భావం వెనుక అసామాన్యమైన లోక సుభిక్షాకార్యం దాగుంది. దానిని జరిగేలా చూసేందుకు చరిత్ర పుటల్లో చీకటి కోణాన్ని పులుముకొని తన గాథకు నల్లరంగును పూసుకొని మంధర మానవత్వాన్ని పరిమళింపజేసేందుకు తానూ ఓ పుప్పొడి రేణువయ్యింది.
సెప్టెంబరు 30 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
Related tags :