*పెట్టుబడుల పరిమితి పెంచిన ట్రంప్ సర్కార్-నవంబరు 21 నుంచి అమలు
అమెరికాలో శాశ్వతనివాసానికి వీలు కల్పించే ఈబీ-5 వీసాల పెట్టుబడి పరిమితిని ట్రంప్ సర్కార్ భారీగా పెంచింది. ఇప్పటి వరకు ఇందుకోసం విదేశీ పెట్టుబడిదారులు కనీసం 5 లక్షల డాలర్లు (సుమారు రూ.3.45 కోట్లు) పెట్టుబడి పెడితే సరిపోయేది. ఈ ఏడాది నవంబరు 21 నుంచి ఈ మొత్తాన్ని 9 లక్షల డాలర్లకు (సుమారు రూ.6.21 కోట్లు) పెంచారు. ద్రవ్యోల్బణం ఆధారంగా నిర్ణయిం చే ప్రామాణిక కనీస పెట్టుబడుల పరిమితినీ 10 లక్షల డాలర్ల(రూ.6.9 కోట్లు) నుంచి 18లక్షల డాలర్లకు (రూ.12.42 కోట్లు) పెంచారు.
*ఈబీ-5 వీసా అంటే?
అమెరికాలో నిరుద్యోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉద్యో గ అవకాశాలు పెంచేందుకు 1993లో ఈబీ-5 వీసా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద కనీసం 10 ఉద్యోగాలు కల్పించేలా 5 లక్షల డాలర్ల కనీస పెట్టుబడి పెట్టే విదేశీయుల కు ఈ వీసాల కింద గ్రీన్కార్డు జారీ చేస్తారు. ఆ గ్రీన్కార్డు ద్వారా పెట్టుబడిదారులు అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పా టు చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక్కో దేశానికి 700 వీసాల పరిమితితో ఏటా 10,000 ఈబీ-5 వీసాలు జారీ చేస్తారు.
*భారతీయులపైనా ప్రభావం
చైనా, వియత్నాం, భారతీయుల నుంచి ఈ వీసాలకు డి మాండ్ ఎక్కువగా ఉంది. హెచ్-1బీ వీసాల ద్వారా గ్రీన్కార్డు లభించడం ఇటీవల పదేళ్లకుపైనే పడుతోంది. అదే ఈబీ-5 వీసా ద్వారా దరఖాస్తు చేస్తే 3-5 ఏళ్లలోనే గ్రీన్కార్డు లభిస్తుంది. దీంతో సంపన్న భారతీయులతో పాటు హెచ్-1బీ వీసాలపై వెళ్లి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయు ల్లో ఎక్కువ మంది ఈ వీసాలపై ఆసక్తి చూపిస్తున్నారు. తాజా నిర్ణయంతో నవంబరు నుంచి ఈ వీసాలకు భారతీ యుల దరఖాస్తులు 10-15ు తగ్గుతుందని భావిస్తున్నారు.
EB5 కూడా కష్టతరం చేసిన అమెరికా
Related tags :