Politics

విశ్వాస పరీక్షలో నెగ్గిన యడియూరప్ప

yadyurappa wins no confidence motion in karnataka assembly - విశ్వాస పరీక్షలో నెగ్గిన యడియూరప్ప

కర్ణాటక అసెంబ్లీలో సీఎం యడియూరప్ప విజయం సాధించారు. విశ్వాస పరీక్షకు అనుకూలంగా 106 మంది ఓట్లు వేశారు.106 మంది ఎమ్మెల్యేలు యడియూరప్పకు అనుకూలంగా ఓటు వేశారు. అసెంబ్లీలో బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడ బీజేపీకి మద్దతుగా నిలిచారు. దీంతో యడియూరప్పకు 106 మంది ఓట్లు దక్కాయి. సోమవారం నాడు అసెంబ్లీ ప్రారంభం కాగానే సీఎం యడియూరప్ప విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ఈ తీర్మానం సందర్భంగా యడియూరప్ప చేసిన వ్యాఖ్యలపై జీ ముఖ్యమంత్రులు సిద్దరామయ్య, కుమారస్వామిలు స్పందించారు. ఈ చర్చ తర్వాత సీఎం యడియూరప్ప బలపరీక్షలో విజయం సాధించారు. మూజువాణి ఓటు ద్వారా బల పరీక్ష నిర్వహించారు.ఈ పరీక్షలో సీఎం యడియూరప్పకు అనుకూలంగా 106 ఓట్లు వచ్చాయి.