తొలకరి జల్లులతో ఈ కాలంలో ప్రకృతి పునరుత్తేజం అవుతుంది. ఆకులు తాజాగా ఉంటాయి. పూలూ వికసిస్తాయి. చిరుజల్లులతో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మన మనసు కూడా ఉల్లాసంగా సాగాలి కదా… దానికి దుస్తులూ తోడవుతాయి కాబట్టి… అలాంటి రంగుల్ని ఎలా ఎంచుకోవాలో చెబుతున్నారు డిజైనర్ దీప్తీ గణేష్.వేసవిలో పక్కన పెట్టిన కాంతిమంతమైన రంగుల్ని ఇప్పుడు వాడుకోవచ్చు. ముఖ్యంగా నియాన్ ఛాయల్లో గులాబీ, ఆకుపచ్చా, పీచ్, ఆరెంజ్ వంటివి ఎంచుకోవచ్చు. కొన్ని చర్మతత్వాలకు ఈ రంగులు అంతగా నప్పకపోవచ్చు. అలాంటప్పుడు అచ్చంగా వాటినే ఎంచుకునే బదులు వేరే రంగుల్ని జత చేసి ప్రయత్నించండి. అంటే తెలుపు రంగు ట్యూనిక్‌కి నియాన్ షేడెడ్ కలర్ జాకెట్, స్టోల్ అదిరిపోతుంది. మరీ కొట్టొచ్చినట్లు కనిపించే ముదురు రంగులు నప్పవు అనుకున్నప్పుడు పసుపూ, ఆరెంజ్ వంటివి అలానే ఎంచుకోకుండా పాలిపోయినట్లు ఉన్న రంగుల్లో పూలూ, జామెట్రికల్ ప్రింట్లు ప్రయత్నించొచ్చు. మెరిసిపోయే చర్మతత్వం ఉన్నవారికి నియాన్ షేడ్స్ బాగుంటాయి. ఈ కాలంలో అయితే మరీ అదిరిపోతాయి. అయితే దుస్తులకు భారీ ఎంబ్రాయిడరీ లేకుండా చూడాలి. క్యాజువల్స్ మీదకు మిక్స్ అండ్ మ్యాచ్‌లా చేసుకున్నా బాగుంటుంది.కాస్త పొడుగ్గా లావుగా ఉన్నవారికి ముదురు రంగులు బాగుంటాయి. వీటిల్లో శరీరాకృతి సింపుల్‌గానే కనిపిస్తుంది. చిన్న చిన్న ప్రింట్లలో గులాబీ, ఆకుపచ్చ రంగుల్ని ఎంచుకోవచ్చు. అలానే నీలం, కాషాయం వంటివాటిని మోనో క్రొమాటిక్ షేడ్స్‌లలోనూ వేసుకోవచ్చు. లేదంటే సాదా రంగుల మీద బ్రైట్ స్టోన్స్, బీడ్స్‌తో జ్యూయలరీని మ్యాచ్ చేయొచ్చు. స్టోల్స్ కూడా బాగుంటాయి.
**ఏ సందర్భానికి ఏవి?
హరివిల్లు రంగుల్లో… ఒక్కో రంగుకీ ఒక్కో ప్రాధాన్యం. ఆయా సందర్భాలను బట్టి వాటిని ఎంచుకోగలిగితే ట్రెండీగా ఉంటాయి.
*ఎరుపు
ఈ రంగు వెచ్చదనాన్నీ, సానుకూలతనూ ప్రతిబింబిస్తుంది. అందుకే ఎరుపూ, దాని ఛాయలకు ఈ కాలంలో ప్రాధాన్యం ఇవ్వొచ్చు. పార్టీవేర్‌గా ఎరుపు రంగు గౌను భలే ఉంటుంది. అలానే ఆఫీస్‌వేర్‌లో భాగంగా టీషర్టును ఫార్మల్ ప్యాంట్‌కీ జత చేసుకోవచ్చు.
*కాషాయం
మేఘాలు కమ్ముకున్న రోజు ఈ రంగుని ఎంచుకుంటే సూర్యకాంతే ప్రసరిస్తున్న భావన కలుగుతుంది. స్నేహితుల్ని కలుసుకునే సందర్భాలకు ఇది చక్కని ఎంపిక. అయితే దీన్ని నేరుగా కాకుండా తెలుపుతో జత చేసుకుంటే చూడచక్కగా ఉంటుంది. అలానే లేయర్డ్ గౌన్‌లూ, పార్టీవేర్‌గానూ మెప్పిస్తుంది.
*పసుపు
మబ్బు పట్టిన వాతావరణాన్ని ఉత్సాహంగా మార్చేయాలనుకుంటే సూర్యకాంతిని ప్రతిబింబించే పసుపు రంగు సరైన ఎంపిక. కాలేజీకి పసుపు రంగు స్కర్టు దాని మీదకు నీలం రంగు ఫేడెడ్ డెనిమ్ టాప్ అదిరిపోతుంది. పార్టీవేర్‌గా ఎంచుకోవాలనుకుంటే నిమ్మ పసుపు రంగు గౌన్‌మీదకు త్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ చాలు.
*ఆకుపచ్చ
చినుకులు పడగానే… పచ్చదనం పరుచుకున్నట్లు కనిపిస్తుంది. ఆ ప్రకృతిలో మీరూ కలిసిపోయినట్లు కనిపించాలంటే లేతాకుపచ్చని వాడాల్సిందే. వీటిల్లో పిస్తా గ్రీన్ గత కొన్నేళ్లుగా ట్రెండీగా ఆకట్టుకుంటోంది. దీన్ని కూడా ముదురు గులాబీ, నీలం వంటి రంగుల మేళవింపుతో ఎంచుకుంటే బాగుంటుంది. అలానే ప్లెయిన్ దుస్తులు ఎంచుకున్నప్పుడు కాంట్రాస్ట్‌గా ఆకుపచ్చ రంగు పూసల దండ ఉండేలా చూసుకోవాలి.
*ఇండిగో
ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఉన్నరోజూ, కాలేజీకి వెళ్లేప్పుడు ఈ రంగుల్లో గౌన్‌లూ, టాప్‌లూ ఎంచుకోవచ్చు.
*ఊదా
ప్రయాణాల్లో ఈ రంగు భలే సౌకర్యంగా ఉంటుంది. చిన్న చిన్న విహారయాత్రలూ, ట్రెక్కింగ్, దైవదర్శనాలకూ, దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఈ రంగుల్లో దుస్తులు ఎంచుకోగలిగితే సరి.
*నీలం
ఒత్తిడితో కూడుకున్న రోజూ, మెదడుకి కాస్త ప్రశాంతత అవసరం అనుకున్న రోజూ ఈ రంగుని ఎంచుకోండి. ఈ కాలంలో శరీరం చురుగ్గా ఉండదు. అందుకే ధాన్యం చేసేటప్పుడూ, యోగా, వ్యాయామం చేసేవేళల్లో ఇది ఎంత బాగుంటుందో! బ్లూటాప్‌కి జతగా బ్లాక్ లెగ్గింగ్, బ్లూ స్కర్ట్, షర్ట్ వంటివాటినీ వేసుకోవాలి.
బయటి వాతావరణానికి ఫ్యాషన్‌కి లింక్ ఉంది
Related tags :