ScienceAndTech

ముత్తులక్ష్మిని గుర్తుచేసిన గూగుల్ డూడుల్… ఇదే ఆమె ఘనత!

.Google tribute to muthulakshmi

భారతదేశ తొలి మహిళా ఎమ్మెల్యే , తొలి వైద్యురాలు డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి 133వ జన్మదినం సందర్భంగా సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఆమెను గుర్తుచేస్తూ డూడుల్ రూపొందించింది. ఈ రోజు ముత్తులక్ష్మి రెడ్డి 133వ జన్మదినం. ఆమె 1886 జూలై 30న మద్రాస్‌లో జన్మించారు. బాల్యంలో అనేక కష్టాలను ఎదుర్కొంటూనే చదువుకున్నారు. ముత్తులక్ష్మి తొలిసారిగా బాయిస్ స్కూల్‌లో అడ్మిషన్ పొందిన ఘనత దక్కించుకున్నారు. తరువాతి కాలంలో దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యేగా, వైద్యురాలిగా పేరొందారు. స్వాతంత్ర్య ఉద్యమంలోనూ ముత్తులక్ష్మి పాల్గొన్నారు. తండ్రి ప్రోత్సాహంతో ఆమె చదువు సాగించారు. యువతిగా మారాక ఆమె పాఠశాలకు వెళ్లడం మానేయాల్సివచ్చింది. దీంతో తండ్రి ట్యూషన్ టీచర్‌ను ఏర్పాటుచేసి, కుమార్తె విద్యాభ్యాసం కొనసాగేలా చూశారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో చదువుకున్న ఆమె చెన్నైలోని మహారాజా కాలేజీ ప్రిన్సిపల్‌గానూ, తొలి మహిళా హౌస్ సర్జన్‌గానూ వ్యవహరించారు. అసెంబ్లీలో కాలు మోపాక ఆమె మెడికల్ ప్రాక్టీస్‌ను విడిచి‌ట్టారు. ఆమె కాంగ్రెస్ ఉమెన్ ఇండియా అధ్యక్షురాలిగా ఉన్నారు. తొలి ఎమ్మెల్యేగా ఆమె మద్రాస్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. భారత ప్రభుత్వం ముత్తులక్ష్మిని 1956లో పద్మభూషన్ పురస్కారంతో గౌరవించింది. 1968 జూలై 22న ముత్తులక్ష్మిరెడ్డి కన్నుమూశారు.