Movies

జాన్వీ కష్టాలు

Jahnvi Kapoor Spends 6Days 3Hour Each In - జాన్వీ కష్టాలు

యాక్టర్లు పాత్రకు తగ్గట్టు బరువు తగ్గుతూ, పెరుగుతూ ఉండాల్సి ఉంటుంది. కానీ ఒకేసారి బరువు తగ్గుతూ, పెరుగుతూ జిమ్లో శ్రమిస్తున్నారు జాన్వీ. ప్రస్తుతం జాన్వీ ‘కార్గిల్ గాళ్, రూహీఅఫ్జా’ సినిమాలను ఏకకాలంలో చేస్తున్నారు. ‘కార్గిల్ గాళ్’ ఏమో గుంజన్ సక్సేనా బయోపిక్. ఈ పాత్రలో కొంచెం బొద్దుగా కనిపించనున్నారు జాన్వీ. ‘రూహీ అఫ్జా’ అనేది హారర్ కామెడీ చిత్రం. ఈ సినిమాలో నాజూకుగా కనిపించాలి. ‘కార్గిల్ గాళ్’ సినిమా షూటింగ్ మొదట ప్రారంభించారు. పాత్ర కోసం జాన్వీ సుమారు 6 కిలోల బరువు పెరిగారు. ఆ తర్వాత ‘రుహీ అఫ్జా’ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయింది. ఇందులోని పాత్ర కోసం 10 కిలోల బరువు తగ్గారామె. ఇప్పుడు ‘కార్గిల్ గాళ్’ కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. దాంతో మళ్లీ బరువు పెరగనున్నారని తెలిసింది. ‘‘కొత్త షెడ్యూల్కి ఆరు వారాల సమయం ఉంది. ఈ గ్యాప్లో వారానికి ఆరుసార్లు జిమ్ చేస్తూ, రోజుకి 3 గంటలు జిమ్లోనే గడుపుతున్నారు. రోజుకి ఇంట్లో తయారు చేసిన లడ్డూలు మూడు నాలుగు లాగించేస్తున్నారు’’ అన్నారు జాన్వీ ట్రైనర్ నమ్రత.