రిలయన్స్ ఇండస్ట్రీస్ 12వ తేదీన కీలక ప్రకటన చేయవచ్చని బ్యాంక్ ఏఎం-మెరిల్ లించ్ పేర్కొంది. జియో ఫైబర్ ప్రారంభం, ప్యాకేజీ ధరల వివరాలను ఏజీఎంలో వెల్లడించే అవకాశం ఉందని తెలిపింది. ‘‘జియో ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ వ్యాపారానికి సంబంధించిన కీలక సమాచారాన్ని 42వ వాటాదారుల వార్షిక సమావేశంలో వెల్లడించనున్నారని భావిస్తున్నాం. రిలయన్స్ కూడా జియో ఫైబర్ వాణిజ్య ప్రారంభానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తోంది. ’’ అని బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్ లించ్ పేర్కొంది. ఈ విషయాన్ని వినియోగదారులకు రాసిన లేఖలో వెల్లడించాయి. మొత్తం మూడు ప్లాన్లను రిలయన్స్ వెల్లడించే అవకాశం ఉందని ఈ అమెరికా బ్రోకరేజీ సంస్థలు పేర్కొన్నాయి. ఈ ప్యాకేజీల్లో భాగంగా 100 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్, డిష్ టీవీ, ఐవోటీ పరికరాలు, ఉచిత ల్యాండ్‌లైన్‌ను ఈ ఫైబర్ ప్యాక్‌లో ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే జియోతో పోలిస్తే డిస్కౌంట్లు తక్కువగా ఉంటాయని పేర్కొంది.
100Mbps వేగంతో జియో ఫైబర్
Related tags :