NRI-NRT

డల్లాస్ మహిళల లాహిరి లాహిరి లాహిరిలో

డల్లాస్ మహిళల లాహిరి లాహిరి లాహిరిలో....-Dallas Telugu NRI Ladies Go On Special Cruise

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) జూలై 28న లూయిస్ విల్ లేక్ లో ఏర్పాటు చేసిన “లాహిరి, లాహిరిలో… నౌకావిహారం” అనే కార్యక్రమం అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, వనితా వేదిక కమిటీ తరుపున శ్రీలక్షి మండిగ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సంస్థ 2019 అధ్యక్షులు చినసత్యం వీర్నపు అందరికి స్వాగతం పలికి, టాంటెక్స్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించి, టాంటెక్స్ కార్యవర్గ సభ్యులను పరిచయం చేసి, వారి సహాయ సహకారాలతోనే ఇటువంటి మంచి కార్యక్రమాలను మీ ముందుకు తీసుకురాగగుతున్నాం అని చెప్పారు. తరువాత లూయిస్ విల్ లేక్ బోట్ యాజమాన్యం టాంటెక్స్ సభ్యులు అందరిని బోట్ లోనికి ఆహ్వానించి 4:30 నిమిషాలకి లాహిరి లాహిరి లాహిరిలో…అనే పాటతో ప్రయాణం మొదలు పెట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీలు మండిగ చక్కటి ఆటలను మహిళలకోసం మంచి ప్రణాళికతో బింగో, అంత్యాక్షరి, డం షరేడెస్, ఆట పాటలు మరియు ఇంకెన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించి 4 గంటలు పాటు సరస్సు మధ్యలో విహరిస్తూ అందరిని ఆనందడోలికల్లో ముంచెత్తారు. ఇండియా నుంచి అమెరికా పిల్లలను చూడడానికి వచ్చిన తలిదండ్రులు కూడా ఈకార్యక్రమంలో పాల్గొని, ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా బాగుంది అని, వారిని కూడ భాగస్వాములను చేసినందుకు ఆనందంగా వుందని, ఇటువంటి మంచి కార్యక్రమాలను చేపడుతున్న టాంటెక్స్ వారిని అభినందించారు. టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు సరస్సు మధ్యలో విహరిస్తున్న అంతసేపు కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు అందరికి కావలసిన ఏర్పాట్లలో ఎటువంటి లోటు పాట్లు లేకుండ సహాయ సహకారలు అందించారు. టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమం ప్రత్యేకంగా మహిళల కోసం నిర్వహించడం చాలా ఆనందంగా వుందని, ముందు ముందు మహిళల కోసం ఇంకా మంచి కార్యక్రమాలను తీసుకురావడంలో కృషి చేస్తుందని హామి ఇచ్చారు. మీడియా పరంగా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విశేషాలను ప్రసారం చెయ్యడానికి సహకారం అందించిన TV5 మరియు Mana TV ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సుందర్ తురుమెల్ల గారికి ప్రత్యెక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు అందరికి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రసార మాధ్యమాలైన టివి5, మన టివి, టీవీ9, టి.ఎన్.ఐ, ​​ఫన్ ఏషియా, దేసిప్లాజ, తెలుగు టైమ్స్, ఐఏసియాలకు, పసందైన ఫలహారలను అందించిన బశేరా రెస్టారెంట్ వారికి కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, ఉపాధ్యక్షులు పాలేటి లక్ష్మి, కార్యవర్గ సభ్యులు సతీష్ బండారు, వెంకట్ బొమ్మ, కళ్యాణి తాడిమేటి, సౌమిత్రి తుపురాని, వసుంధర కాకి, సౌమ్య మాదాల, ఇండియా నుంచి వచ్చిన వీరమ్మ మాదాల, శశిరేఖ పట్నాయక్ మరియు పలు ప్రముఖులు పాల్గొన్నారు. ఎంతో కృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్ కార్యవర్గ సభ్యులకు మరియు వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలోని ఛాయాచిత్రాలను ఈ లంకెలో చూడవచ్చును.