ఇంగ్లండ్లో బ్రిటిష్ చిన్నారుల కంటే తక్కువ వయసులోనే భారత్, చైనా సంతతి బుడతలు విద్యాభ్యాసం పూర్తిచేస్తున్నారట! ఈ విషయంలో బ్రిటన్ చిన్నారులు బాగా వెనుకబడిపోతున్నట్టు ‘ది ఎడ్యుకేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ (ఈపీఐ)’ వెల్లడించింది. విద్యా ప్రమాణాలపై మంగళవారం ఆ సంస్థ తాజా నివేదికను విడుదల చేసింది. శ్వేత, ఇతర జాతీయుల నడుమ విద్యా సంబంధ అగాధాలు, ప్రమాణాలను ఈపీఐ ఇందులో తులనాత్మకంగా విశదీకరించింది. ఆ ప్రకారం…
* బ్రిటిష్ చిన్నారులతో పోలిస్తే చైనా సంతతి పిల్లలు 12 నెలలు, భారత సంతతి చిన్నారులు 7 నెలలు ముందుగానే ప్రాథమిక పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేస్తున్నారు.
* ఇక సెకెండరీ స్కూల్ (జనరల్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్- జీసీఎస్ఈ) విద్యాభ్యాసాన్ని శ్వేత చిన్నారులకంటే చైనా, భారత్ సంతతి పిల్లలు వరుసగా సగటున 24.8, 14.2 నెలలు ముందే ముగిస్తున్నారు.
* నల్లజాతి కరేబియన్ విద్యార్థులు బ్రిటిష్ విద్యార్థులకంటే 2.2 నెలలు మాత్రమే వెనుకబడుతున్నారు.
**560 ఏళ్లు పడుతుంది…
కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు విద్యార్థుల ప్రతిభపై కచ్చితమైన ప్రభావం చూపుతున్నాయని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉందని నివేదిక ఉద్ఘాటించింది. విద్యార్థుల మధ్య ప్రతిభా సంబంధ అగాధాలను రూపుమాపేందుకు ప్రతిభావంత చర్యలు అవసరమని ఉద్ఘాటించింది. లేనిపక్షంలో, ప్రస్తుత విధానాల ప్రకారం 560 ఏళ్లకుగాని విద్యార్థులంతా సమానంగా చదువుల్లో రాణించే పరిస్థితిని చూడలేమని ఈపీఐ పేర్కొంది.
బ్రిటీష్ పాఠశాలల్లో ఆసియా పిల్లలే ఎక్కువ
Related tags :