Movies

బేస్ బాగుంటే….

Rashi Khanna Goes By Your Base Standards Of Ethics - బేస్ బాగుంటే....

‘‘మన మూలాలు స్ట్రాంగ్గా ఉంటే, మనం దేని గురించీ ఆలోచించాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు రాశీ ఖన్నా. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆమె కుటుంబంతో గడిపే సమయం విషయంలో రాజీపడరు. ఇటీవల ఓ చిన్నపిల్లాడిని సైకిల్ మీద కూర్చోపెట్టి తిప్పుతున్న ఫొటోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ‘‘ఏ చెట్టుకైనా వేర్లు చాలా కీలకం. వేర్లు బలంగా ఉంటే ఎంత గాలి వీచినా చెట్టుకు వచ్చే నష్టం ఉండదు. అలాగే మన కుటుంబం, వారితో మనకున్న అనుబంధం చాలా ముఖ్యం. ఫ్యామిలీ ఇచ్చే సపోర్ట్ గట్టిగా ఉంటే, బయట ఎన్నిరకాల వార్తలు వినిపించినా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు’’ అని అన్నారు రాశీ ఖన్నా. ఆమె ప్రస్తుతం తెలుగులో ‘వెంకీ మామ’, ‘ప్రతిరోజూ పండగే’లో నటిస్తున్నారు. తమిళంలోనూ చేతినిండా సినిమాలున్నాయి.