DailyDose

ఎరిక్సన్ కు మరో షాక్-వాణిజ్య-07/31

Swedish Company Ericsson In Hot Waters In India - ఎరిక్సన్ కు మరో షాక్-వాణిజ్య-07/31

* టెలికాం రంగంలో ఇప్పటికే సంచలనం సృష్టించిన జియో… తాజాగా మరో చరిత్ర సృష్టించబోతోంది. కేవలం రూ. 600కే మూడు రకాల సేవలందించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 12వ తేదీన జియో గిగా ఫైబర్ సేవలను ప్రారంభించబోతోంది. ఈ గిగా ఫైబర్ సర్వీసులతో ల్యాండ్ లైన్ కనెక్షన్, 1GBPS స్పీడ్ తో బ్రాడ్ బ్యాండ్, 600 టీవీ ఛానళ్లను అందిస్తుంది. OST డివైస్ కోసం రూ. 4,500 చెల్లించాల్సి ఉంటుంది. కనెక్షన్ వద్దనుకున్నప్పుడు ఈ మొత్తన్ని వెనక్కి ఇచ్చేస్తారు. పేమెంట్ కోసం ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ఆప్షన్లు కూడా ఉంటాయి.
* సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా అనిల్ అంబానీ టెలికం కంపెనీ ఆర్‌‌కామ్‌‌ నుంచి రావాల్సిన పాతబాకీ రూ.580 కోట్లు వసూలు చేసుకున్న స్వీడన్‌‌ కంపెనీ ఎరిక్సన్‌‌కు మరో ఇబ్బంది తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ డబ్బును తమకే చెల్లించాలని ఆర్‌‌కామ్‌‌కు అప్పులు ఇచ్చిన లెండర్లు ఎరిక్సన్‌‌ను కోరనున్నారు. ఈ మేరకు త్వరలోనే డిమాండ్ నోటీసు పంపుతారని తెలుస్తోంది. ఎరిక్సన్‌‌ చెల్లింపు దివాలా చట్టంలోని ‘ప్రిఫరెన్షియల్‌‌ ట్రాన్సాక్షన్‌‌’ కిందకు వస్తుంది కాబట్టి అది తమకే దక్కాలని ఆర్‌‌కామ్‌‌ కమిటీ ఆఫ్‌‌ క్రెడిటర్స్‌‌ (సీఓసీ) స్పష్టం చేసింది. దీని ప్రకారం వచ్చే రుణం మొత్తాన్ని మొదట ఫైనాన్షియల్‌‌ క్రెడిటర్‌‌కు లేదా సీఓఓకి మాత్రమే చెల్లించాలి. ఎరిక్సన్‌‌ ఆపరేషనల్‌‌ క్రెడిటర్‌‌ అవుతుందని సీఓసీ వాదిస్తోంది. ఎస్‌‌బీఐ నాయకత్వంలోని లెండర్ల కన్సార్షియం ఈ మేరకు త్వరలోనే ఎరిక్సన్‌‌కు లేఖ రాయనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్‌‌కామ్‌‌ దివాలా కేసు ఎన్సీఎల్టీకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎరిక్సన్‌‌ డబ్బు కట్టడానికి తిరస్కరిస్తే కోర్టుకు వెళ్లే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోంది. దీనిపై ఎరిక్సన్‌‌ ప్రతినిధి స్పందిస్తూ ఆర్‌‌కామ్‌‌ లెండర్ల నుంచి తమకు ఎలాంటి నోటీసూ రాలేదని చెప్పారు. ఎస్‌‌బీఐ కూడా ఈ విషయమై మాట్లాడేందుకు ఒప్పుకోలేదు. ఆర్‌‌కామ్‌‌, దీని అనుబంధ సంస్థ రిలయన్స్ టెలికాం, రిలయన్స్ ఇన్‌‌ఫ్రాటెల్‌‌ తమకు రూ.85 వేల కోట్లు అప్పు ఉన్నారని సీఓసీ ప్రకటించింది.
* ఫుడ్‌ డెలివరీకి హిందూయేతర వ్యక్తిని పంపినందుకు ఆర్డర్‌ రద్దు చేసిన కస్టమర్‌కు జొమాటో ఇచ్చిన రిప్లై నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాను ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ను హిందూయేతర వ్యక్తితో డెలివరీ చేయడంతో జొమాటో ఆర్డర్‌ను క్యాన్సిల్‌ చేశానని, వారు డెలివరీ బాయ్‌ను మార్చమని, క్యాన్సిలేషన్‌పై రిఫండ్‌ కూడా ఇవ్వమని చెప్పారని ట్విటర్‌ యూజర్‌ అమిత్‌ శుక్లా ట్వీట్‌ చేశారు. డెలివరీ తీసుకోవాలని తనను ఒత్తిడి చేయరాదని, తనకు రిఫండ్‌ మొత్తం కూడా అవసరం లేదని ఆ యూజర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.
*వాహన రంగానికి ఇచ్చిన రుణాల విషయంలో నష్టభయాన్ని తగ్గించుకునే చర్యలను చేపడుతున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) పేర్కొంది.
*జేపీ ఇన్ఫ్రాటెక్కు రుణ పరిష్కార గడువును మరో 90 రోజులు పొడిగిస్తున్నట్లు ద నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) పేర్కొంది.
* ఐటీ సేవలు, పరిష్కారాలను అందిస్తోన్న హైదరాబాద్కు చెందిన వాకింగ్ ట్రీ టెక్నాలజీస్ ముంబయి కేంద్రంగా కొనసాగుతోన్న టెక్ఈజ్ సిస్టమ్స్ను స్వాధీనం చేసుకుంది.
*కంపెనీల సవరణ బిల్లు 2019ని పార్లమెంటు మంగళవారం ఆమోదించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిబంధనలను కఠినతరం చేయడం, జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)పై కేసుల భారం తగ్గించడం లక్ష్యంగా కంపెనీల చట్టానికి ఈ బిల్లు ద్వారా సవరణలు చేశారు.
*భారత్లో డిజిటల్ నైపుణ్యాలపై 2025 నాటికి 10 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు అమెరికా నెట్వర్కింగ్ దిగ్గజ సంస్థ సిస్కో ప్రకటించింది.
*కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రత్యేక అండర్గ్రాడ్యుయేట్ కోర్సును ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రారంభించింది.
*ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) రూ.243 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
*స్థానిక ఔషధ సంస్థ అయిన గ్రాన్యూల్స్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.83 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక టర్నోవర్ రూ.595 కోట్లు ఉంది.
*ఐటీ సంస్థ టెక్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.959.30 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
*ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్టాండలోన్ ప్రాతిపదికన రూ.1,370.08 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో బ్యాంకు ఆర్జించిన నికర లాభం రూ.701.09 కోట్లతో పోలిస్తే ఇది 95.4 శాతం ఎక్కువ.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో హీరో మోటోకార్ప్ ఏకీకృత నికరలాభం రూ.1256.69 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే మూడు నెలల కాలంలో లాభం రూ.924.74 కోట్లతో పోలిస్తే ఇది 35.89 శాతం ఎక్కువ. అయితే సమీక్షిస్తున్న త్రైమాసికంలో ఒకే సారి కలిగిన రూ.737.48 కోట్ల అసాధారణ ప్రయోజనాలు ఇందుకు కారణం.