అమెరికా-చైనాల మధ్య బుధవారం షాంగైలో వాణిజ్య చర్చలు జరిగాయి. గత నెలలో వాణిజ్య యుద్ధవిరామంపై ఇరుదేశాధినేతలు అవగాహనకు వచ్చాక నిర్వహిస్తున్న తొలి చర్చలు ఇవే. ఇరు దేశాలు పరస్పరం విధించుకొన్న టారీఫ్‌ల విలువ 360 బిలియన్ డాలర్లను దాటేసిన విషయం తెలసిందే. కొన్నాళ్ల క్రితం చైనా కంపెనీలకు అమెరికా సాంకేతికత పరిజ్ఞానం అందజేయకుండా చర్యలు తీసుకొంది. అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లిట్జర్, ట్రెజరీ సెక్రటరీ స్టీవ్ మ్నూచిన్‌లు చైనా వైస్ ప్రీమియర్ ల్యూహిని కలిశారు. అత్యంత రహస్యంగా నాలుగు గంటలపాటు కొనసాగింది. ఈ చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా నుంచి చిన్న బృందమే వచ్చింది. వీరు కూడా అనుకున్న సమయం కంటే ముందే వచ్చారు. కేవలం గ్రూప్‌ఫొటోకు మాత్రమే విలేకర్లకు కనిపించారు. చర్చల అనంతరం మీడియాతో మాట్లాడకుండే నేరుగా విమానాశ్రయానికి చేరుకొన్నారు.
ఏమి చర్చించుకున్నారో తెలీదు
Related tags :