బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గూగుల్ ఈ ఏడాది భారతీయ చిన్నారుల కోసం డూడుల్ పోటీ నిర్వహించనుంది. విజేతకు రూ. 5 లక్షల ఉపకారవేతనం, ఆ విద్యార్థి పాఠశాలకు రూ.2 లక్షల సాంకేతిక ప్యాకేజీతో పాటు మరిన్ని బహుమతులు ఇస్తుంది. ‘నేను పెరిగి పెద్దవాడినయ్యేటప్పటికి ఎలా ఉండాలంటే..’ అనే నేపథ్యాన్ని(థీమ్) అందమైన ఊహల్లో చిన్నారులు చెప్పాలి. ఉదాహరణకు కాలుష్యరహిత ప్రపంచం, చందమామపై మానవ జీవితం తదితర అంశాలను స్కెచ్ లేదా పెయింటింగ్‌లో చిత్రీకరించాలి. ప్రతి గూగుల్ డూడుల్‌పై ఉన్నట్లే గూగుల్ అని ఉండాల్సిందే.
పిల్లలూ…గూగుల్ డూడుల్ పోటీకి సిద్ధమా?
Related tags :