అమెరికాలోని ఒహాయో రాష్ట్రానికి చెందిన ప్రవాసాంధ్రుడు పంగులూరి రామారావు తాను విద్యనభ్యసించిన కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలనులోని కోట మార్కండేయ జడ్పీ ఉన్నత పాఠశాలకు అభివృద్ధి కార్యక్రమాల కింద నిధులు అందజేశారు. ఈ నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారాన్ని శుక్రవారం నాడు ఆయన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వుమ్మా శేషి రెడ్డితో కలిసి ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధికి తనవంతుగా మరిన్ని నిధులు అందజేస్తానని, విద్యార్థుల భవిష్యత్తుకు తనవంతుగా సాయపడతానని రామారావు తెలిపారు.
పెనుగొలను జడ్పీ పాఠశాలకు ప్రవాసాంధ్రుడు పంగులూరి విరాళం
Related tags :