అర్చకుడికి కారం కలిపిన నీటితో అభిషేకం చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ధర్మపురి జిల్లా నల్లమ్‌పల్లిలో కరుప్పుస్వామి ఆలయంలో ఆడి అమావాస్య సందర్భంగా బుధవారం పూజలు నిర్వహించారు. ఉదయాన్నే పెద్దఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకుడు వారికి ఉపదేశం చేశారు. అనంతరం 75 కిలోల ఎండు మిరపకాయలను దంచి ఆ కారాన్ని నీటిలో కలిపి అర్చకుడికి అభిషేకం నిర్వహించారు. ఏటా ఈ కార్యక్రమం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.
75కిలోల ఎండుకారపు నీటితో అభిషేకం
Related tags :