విలక్షణ నటుడు కమల్‌హాసన్ వారసురాలిగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టినప్పటికీ.. తన కంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది శ్రుతిహాసన్. కట్టిపడేసే నటనే కాదు ఆమెలో మంచి సంగీత దర్శకురాలు కూడా ఉందన్న విషయం తెలిసిందే. అడపాదడపా కొన్ని పాటలు కూడా పాడుతూనే ఉంది. ఇప్పుడు శ్రుతి తనలోని మరో టాలెంట్‌ను బయటపెట్టింది. తమిళనాడు, శ్రీలంకలలో ఎక్కువగా వాయించే ‘పరాయ్’ను వాయిస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. స్వతహాగా సంగీత దర్శకురాలైన శ్రుతి.. ఈ వీడియోలో డప్పు వాయిస్తూ దానికి అనుగుణంగా కాలు కదుపుతూ కనిపించింది. దీన్ని పోస్ట్ చేసిన గంటల్లోనే లక్షల్లో లైకులొచ్చాయి. శ్రుతి 2017లో వచ్చిన ‘కాటమరాయుడు’ తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. మ్యూజిక్ ఆల్బమ్‌లు, షోలతో బిజీగా గడిపారు. తిరిగి ఈ ఏడాది తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి ఓకే చెప్పారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు అమెరికన్ సిరీస్ ‘ట్రీడ్‌స్టోన్’లోనూ నటిస్తోంది.